.
అప్పట్లో స్కైలాబ్ అనే పదం ఎంత భయాన్ని క్రియేట్ చేసిందో ఐడియా ఉందా…? ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గానీ… 50 దాటిన వాళ్లకు తెలుసు…
గతి తప్పిన ఓ ఖగోళ ప్రయోగశాల భూమిని ఢీకొనే ప్రమాదం… ఎక్కడ ఢీకొంటుందో, ఏం జరుగుతుందో తెలియదు… దాంతో ఉంటామో పోతామో తెలియదు అన్నట్టుగా విపరీతంగా విందులు చేసుకున్నారు,.. స్కైలాబ్ పడే రోజున అందరూ ఇళ్లల్లోనే బందీలైపోయి, గొడ్డూగోదను కూడా జాగ్రత్తగా దొడ్లలోనే కట్టేశారు… సరే, అది ఎక్కడో సముద్రంలో కూలిపోయింది, శుభం…
Ads
ఇప్పుడు తాజాగా మరొకటి… అఫ్‌కోర్స్, విదేశాల్లో కొన్ని కాన్‌స్పిరసీ థియరీలు ప్రచారం చేస్తుంటారు… ఇదుగో విపత్తు, అదుగో కలియుగాంతం అన్నట్టుగా బోలెడు కథలు వస్తుంటాయి… ఇదీ అలాంటిదేనో కాదో నాకు తెలియదు… కానీ ఓసారి చదవండి, ఆసక్తకరం…
50 ఏళ్ల తర్వాత భూమి వైపునకు మళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ – ‘కాస్మోస్ 482’ గాథ
1972 మార్చి 31. అప్పట్లో ప్రచ్ఛన్నయుద్దం నడుస్తూ ఉండగా, సోవియట్ యూనియన్ తన అంతరిక్ష శోధనలో మరో అడుగు వేసింది. వెనెరా ప్రోగ్రాంలో భాగంగా, వారు వీనస్ గ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక అన్‌మ్యాన్డ్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు. అయితే, అది వీనస్‌ను చేరకపోగా — “కాస్మోస్ 482” అనే పేరుతో — భూమి కక్ష్యలోనే చిక్కుకుపోయింది.
ఎందుకు వీనస్‌కు వెళ్లలేకపోయింది?
ఈ స్పేస్‌క్రాఫ్ట్ చివరి దశలో పెద్ద సాంకేతిక లోపం తలెత్తింది… దాని చివరి రాకెట్ దశ మధ్యలోనే ఆగిపోయింది… “ఇంజన్లు పనిచేయడం ఆగిపోయాయి” అని అంటున్నారు జోనాథన్ మాక్‌డవెల్ అనే ఖగోళ శాస్త్రవేత్త… దాంతో స్పేస్‌క్రాఫ్ట్‌కి అవసరమైన getaway speed దొరకలేదు… ఇక, అది భూమి చుట్టూ ఒక పెద్ద ఎలిప్టికల్ కక్ష్యలో తిరుగుతూ – ఇవాళ వరకూ అక్కడే ఉంది…
50 ఏళ్ల తర్వాత తిరిగొస్తుంది!
ఇప్పుడు, ఈ స్పేస్‌క్రాఫ్ట్ తన రివర్స్ జర్నీ స్టార్ట్ చేసింది… భూమి వైపుగా స్పైరల్ అవుతోంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ శనివారం లేదా ఆదివారం అది భూమి వాతావరణంలోకి ప్రవేశించనుంది. ఇది ఎక్కడ పడ్డేది ఖచ్చితంగా చెప్పలేము — ఎందుకంటే ఇది గంటకు సుమారు 17,000 మైళ్ల వేగంతో తిరుగుతోంది.
“ఎప్పుడు అనేది ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేం, భూవాతావరణంలోకి దాని రీఎంట్రీ కొన్ని గంటల ముందు మాత్రమే ఊహించగలమేమో…” అంటున్నారు మాక్‌డవెల్. కానీ అప్పటికే దాని వేగానికి… మనకు ఏ నిరోధ చర్యలకూ చాన్స్ ఉండదు అట…
కాలిపోతుందా? నేల మీద పడుతుందా?
ఈ స్పేస్‌క్రాఫ్ట్‌కు వీనస్కి పంపే ఉద్దేశంతో శక్తివంతమైన heat shield పెట్టారు… ఇది 900°F వేడిని తట్టుకునేలా తయారైంది… అంటే ఇది భూమి atmosphereలో నుంచి దెబ్బతినకుండా దూసుకురావచ్చు… అయితే, 50 సంవత్సరాలుగా స్పేస్‌లో ఉన్నందున దాని పైఉపరితలం ఎంతగా దెబ్బతిన్నదో తెలియదు… ఏమైనా, భూమి మీద 70% ప్రాంతం సముద్రాలే కాబట్టి, ఇది జలాశయంలో పడే అవకాశమే ఎక్కువగా ఉంది.
మానవ విజ్ఞానయాత్రలో విఫల విజయ గాధ
కాస్మోస్ 482 కథ ఒక విఫలం అయిన ప్రయోగంలా కనిపించినా, ఇది ఒక శాస్త్రీయ సాధన, ఆవిష్కరణల పట్టుదలకి చిహ్నంగా నిలుస్తుంది. 50 ఏళ్ల తరువాత కూడా ఇది మన కళ్ళ ముందుకు తిరిగి వస్తూ… మనిషి విచిత్రమైన విజయ విఫల గాథల్లో ఒకటిగా కనిపిస్తోంది…
Share this Article