Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాట్సప్ యూనివర్శిటీ నుంచి మరో నాసిరకం సోషల్ పోస్ట్..!!

January 31, 2022 by M S R

సోషల్ మీడియాలో కనిపించే వార్తలు కొన్ని నవ్వు పుట్టిస్తాయి… వీటిని పుట్టించే గుజ్జులేని బుర్రలకు సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరి మీదా ఓ తేలిక భావన… మనమేం రాసినా ఎడ్డి ఎదవలు నమ్ముతారనే ఓ వెర్రి భ్రమ… ఇలాంటి వార్తల్ని పుట్టించి, సర్క్యులేట్ చేసి, చివరకు తామే నవ్వులపాలు అవుతున్నామనే సోయి కూడా ఉండదు వీళ్లకు… అఫ్‌కోర్స్, వీటిని గుడ్డిగా అందరికీ షేర్ చేసే *రాటెన్ బ్రెయిన్స్’’ కూడా ఉంటారు కొందరు… మీరు వాట్సప్ యూనివర్శిటీ అనండి, ఫేస్‌బుక్ యూనివర్శిటీ అనండి, ట్విట్టర్ గురుకులం అన్నా పర్లేదు… ఒకసారి ఈ స్టోరీ చదవండి… చాలారోజులుగా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది…



* బ్రేకింగ్ న్యూస్ – అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్నికయ్యారు! *
భారత్‌కు గొప్ప విజయం!!! ప్రధాని మోదీ చాణక్య దౌత్యం. ప్రపంచ వేదికపై బ్రిటన్‌ ఓటమి. ప్రధాని మోదీజీ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను ఎలా అభివృద్ధి చేసుకున్నారనేదానికి ఇది ఒక ఉదాహరణ. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారీ ఎన్నికయ్యారు. భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ సింగ్ 193 ఓట్లకు 183 ఓట్లు (ప్రతి దేశం నుండి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు) పొందారు మరియు బ్రిటన్‌కు చెందిన జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్‌వుడ్‌ను ఓడించారు. అతను బ్రిటన్ యొక్క ఈ పదవిపై 71 సంవత్సరాల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాడు.
దీన్ని సాధించేందుకు ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 6 నెలలుగా కృషి చేస్తున్నాయి! మొత్తం 193 దేశాల ప్రతినిధులను సంప్రదించడం మరియు సులువుగా గెలుపొందగల బ్రిటీష్ అభ్యర్థి విషయంలో భారతదేశం యొక్క వైఖరిని వారికి వివరించడం చాలా కష్టమైన పని. 11 రౌండ్ల ఓటింగ్‌లో, జస్టిస్ దల్వీర్ భండారీ జనరల్ అసెంబ్లీలో 193 ఓట్లలో 183 ఓట్లను పొందారు మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 మంది సభ్యులలో మొత్తం 15 ఓట్లు పొందారు.
జస్టిస్ దల్వీర్ భండారీ 9 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఈ 183 దేశాలు భారతదేశానికి ఓటు వేసినా వారి దేశాలకు నా ధన్యవాదాలు! మనకు స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో పోటీ పడుతూ మనము గెలవడం గొప్ప విషయం అభ్యర్థన – మీకు నచ్చితే మీ ఇతర స్నేహితులకు కూడా పంపండి
* జై హింద్-జై భారత్. *



అసలు నిజం ఏమిటంటే..?

  1. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కు అసలు చీఫ్ జస్టిస్ ఉండదు… ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ప్లస్ మెంబర్స్ ఉంటారు…
  2. ఇప్పుడు చెప్పబడే జస్టిస్ భండారీ ప్రెసిడెంట్ కాదు, వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు… కేవలం ఒక మెంబర్ మాత్రమే…
  3. ప్రస్తుత ప్రెసిడెంట్ పేరు Justice Joan Donoghue… ఆయన అమెరికన్… వైస్ ప్రెసిడెంట్ Kirill GEVORGIAN ఓ రష్యన్…
  4. జస్టిస్ భండారీ ఈ కోర్టు మెంబర్‌గా చేరింది 2012లో… అప్పటికి మోడీ ఎక్కడుండేవాడు..? ఆయనే 2017లో తిరిగి మెంబర్‌గా ఎన్నికయ్యాడు…
  5. ఇక క్రిస్టోఫర్ గ్రీన్‌వుడ్ పోటీపడటం ఏమిటి..? 71 ఏళ్ల గుత్తాధిపత్యాన్ని బద్ధలు కొట్టడం ఏమిటి..? అసలు ఎన్నిక ఏమిటి..? ఈ 193 వోట్లకు 183 సంపాదించడం ఏమిటి..? భారత విదేశాంగ శాఖ కృషి ఏమిటి..? మోడీ చాణక్య దౌత్యం ఏమిటి..?
  6. ఈ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను కూడా 15 మంది జడ్జిలు రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు… జస్ట్, మూడేళ్ల పదవీకాలానికి మాత్రమే…
  7. అసలు ఈ గ్రీన్‌వుడ్ కూడా బ్రిటిషర్ కాదు, ఆయన అమెరికన్… ఒక టరమ్ ప్రెసిడెంట్… వాట్సప్ యూనివర్శిటీ సోషల్ ఉత్పత్తులు మరీ నాసిరకం, నవ్వుతాలు అయిపోతున్నాయి… ప్చ్, పాపం…!!

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions