ఒక దిక్కుమాలిన సర్వే… రకరకాల పనికిమాలిన సర్వేలు జరుగుతూ ఉంటాయి కదా, దానికి ఓ లెక్కాపత్రం ఏమీ ఉండదు… ఇదీ అలాంటిదేనని ఓ గట్ ఫీలింగ్… ఎందుకంటే… దానికీ కారణాలున్నయ్… ముందుగా సదర్ హోమ్ క్రెడిట్ ఇండియా సర్వే సారం ఏమిటంటే..?
‘‘ఆదాయంలో 21 శాతం అద్దెలకే… చదువులకు 17 శాతం, సినిమాలకు 19 శాతం, ముందుగా ప్లాన్ చేసి పెట్టే ఖర్చు 35 శాతం, రుచికరమైన తిండికి 28 శాతం ఖర్చు… గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ వాసుల సగటు ఆదాయం 44 వేల వరకూ పెరిగింది… ఫిట్‌నెస్ కోసం 6 శాతం ఖర్చు అట…’’
Ads
ఇది ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్, దానికి ఈక్వల్ ఎంప్లాయీస్‌ను దృష్టిలో పెట్టుకుని, లేదా మంచి వ్యాపార సంస్థలు కలిగి ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుని వండుకున్న ఓ వంట… దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఈ సర్వే చేశారట, ఇంకేముంది..? అన్నీ ఇలాంటి ఫలితాలే వెల్లడై ఉంటాయేమో కదా…
మన హైదరాబాదులో 10 వేల సగటు జీతం కలిగిన వాళ్లూ లక్షల్లో ఉన్నారు… అంతకు తక్కువతో బతుకులు ఈడుస్తున్నవాళ్లూ ఉన్నారు, అందరికీ ఈ నగరంలో చోటుంది… కోట్లు కమాయిస్తున్నవారున్నారు, రోజురోజుకూ బతుకు కష్టమవుతున్నవాళ్లూ ఉన్నారు… గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 44 వేల వరకూ సగటు హైదరాబాద్ వాసి ఆదాయం పెరిగిందట, ఎవడ్రా వీడు..?
ఏటా 100 కోట్లు దోచుకునే ఓ సినిమా హీరోను, కృష్ణానగర్‌లో వాళ్లనూ వీళ్లనూ అప్పులు అడిగి తినీతినక బతికే ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌నూ కలిపి సగటు లెక్కేస్తే… సగటు ఆదాయం ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌కు కూడా 50 కోట్లు అవుతుంది… మీకు అర్థమైంది కదా ఈ సగటు లెక్కల అసలు బాగోతాలు, పిచ్చితనాలు ఏమిటో…
ఆదాయంలో 21 శాతం అద్దెలకే అని ఓ మాట… నెలకు అయిదారు వేలలోపు అద్దెలతో బతుకుతున్నవాళ్లు కొన్ని లక్షల్లో ఉంటారు ఈ సిటీలో… చదువులకు 17 శాతం… అందరూ కార్పొరేట్ టెక్నో స్కూళ్లలో, ఇంటర్నేషనల్ స్కూళ్లలో లక్షలు పోసి చదివించడం లేదురా నాయనా… సినిమాలకు 19 శాతం అనేది మరో మూర్ఖపు రిజల్ట్… ఎవడు పొమ్మన్నాడు సినిమాలకు..? లక్ష రూపాయల జీతం వచ్చేవాడు సినిమాలకు 19 వేలు వెచ్చిస్తే వాడు మూర్ఖుడు…
రుచికరమైన తిండికి 28 శాతం ఖర్చు అట… ఎవడు ఆర్డర్లు పెట్టమన్నాడు జొమాటోలకు, స్విగ్గీలకు… ఇవన్నీ నాన్సెన్స్ సర్వేలు… నిజంగా జీవన వ్యయం పెరిగింది… కానీ ఎక్కడ పెరిగాయో తెలుసా..? పెట్రోల్, గ్యాస్, మందులు, ఇతర నిత్యావసరాల ధరల్లో… డాక్టర్ల ఫీజుల్లో, ఆసుపత్రుల్లో… చివరకు పసిపిల్లలకు కొనే బిస్కెట్లు, చాక్లెట్ల ధరలు, పళ్ల ధరలు కూడా మండుతున్నయ్…
కూరగాయలు, పాలు, నూనెలు, వాటర్ క్యాన్లు… పవర్ చార్జీలు, కిరాణం బిల్లు… ఆఫీసుల్లో లంచాలు, డిమాండ్లు… ఇవీ పెరిగాయి… సగటు హైదరాబాద్ వాసే కాదు, దాదాపు ప్రతీ నగరంలోనూ మన దైవదూత ప్రధాని పాలన ఘనత కారణంగా జీవనవ్యయం పెరిగింది… ఇది ఖర్మ… ఏయే అంశాల్లో జీవనవ్యయం పెరిగిందో ప్రతి నగరవాసికీ తెలుసు… ఈ పనికిమాలిన తిక్క సర్వేలు చదవాల్సిన పనిలేదు..!!
Share this Article