.
నిష్ఠురంగా ఉన్నా సరే… కటువుగా ఉన్నా సరే… ఓ మిత్రుడి వ్యాఖ్య …. ‘‘ఏదో అఫయిర్ పెట్టుకున్నావు సరే, నడిచినన్ని రోజులు నడిపించు, లేదంటే వదిలెయ్, అంతేతప్ప ఆమె మొగుడిని హతమారిస్తే నువ్వెందుకు అందులో ఇన్వాల్వ్ కావాలి..? జైలు పాలెందుకు కావాలి..? నీ సంసారం బజారున ఎందుకు పడాలి..? నీ బతుకు ఎందుకు ఖరాబ్ కావాలి..?’’
విషయం ఏమిటీ అంటారా..? ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోంది… అక్రమ సంబంధాలకు ‘మరిగిన’ పెళ్లాలు విడాకులు తీసుకుని, విడిపోయి, తమ బతుకులు తాము బతకకుండా, తమ అఫయిర్స్ తాము కొనసాగించకుండా… ఏకంగా మొగుళ్లను ఖతం చేస్తున్నారు… ఆ హత్యాకాండలో ప్రియులు సహకరిస్తున్నారు… ఈమధ్య రోజుకో వార్త…
Ads
తాజాగా ఏమిటంటే..? ‘‘అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా చంపడమే కాకుండా ఆ తర్వాత ఆ మహిళ ప్రవర్తించిన తీరు పోలీసులనే విస్మయానికి గురిచేసింది…
గుంటూరు జిల్లా చిలువూరు… చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి శివనాగరాజుకు, లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది… వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు… విజయవాడలో పనిచేస్తున్న సమయంలో మాధురికి గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది అక్రమ సంబంధానికి దారితీసింది… ఇక భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన మాధురి పక్కా ప్లాన్‌తో అతడిని అంతమొందించింది…
ఇదీ స్టోరీ… సరే, ఏదో అక్రమ సంబంధం… మొగుడు అక్కరలేదు… ఇద్దరు పిల్లలు కూడా… మొగుడిని వదిలేయొచ్చు కదా… లేదు, అలా చేస్తే అది ప్రజెంట్ ట్రెండ్ ఎలా అవుతుంది..? అందుకే…
ఈ నెల 18న రాత్రి భర్త కోసం బిర్యానీ వండింది… అందులో 20 నిద్రమాత్రల పొడిని కలిపింది… నిజానికి ఆ డోస్‌తోనే పోవాలి మొగుడు… కానీ ఆమెకు అప్పటిదాకా వెయిట్ చేయలేదు… భర్త గాఢ నిద్రలోకి వెళ్లగానే ప్రియుడు గోపిని ఇంటికి పిలిపించింది… గోపి అతడి ఛాతీపై కూర్చోగా, మాధురి దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది… కిరాతకం…
భర్త చనిపోయిన తర్వాత ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు... కానీ మాధురి మాత్రం ఏమీ జరగనట్టు శవం పక్కనే కూర్చుని రాత్రంతా సెల్‌ఫోన్‌లో బ్లూ, సంభోగ వీడియోలు చూస్తూ గడిపింది....
తెల్లవారుజామున తన భర్త గుండెపోటుతో చనిపోయాడని మాధురి ఇరుగుపొరుగును నమ్మించే ప్రయత్నం చేసింది… అయితే భర్తతో గొడవలు, వివాహేతర సంబంధం గురించి తెలిసిన చుట్టుపక్కల వారిని మాధురిని అనుమానించారు…
ఆమె దారుణం ఎప్పుడు బయటపడిందీ అంటే… ఓ రక్తపు చుక్క ద్వారా… అంత్యక్రియలకు వచ్చిన అతడి ఫ్రెండ్స్… నాగరాజు చెవిలో రక్తపు చుక్కను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు… దీంతో పోస్ట్‌మార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది…. నివేదికలో నాగరాజు ఛాతీ ఎముకలు విరిగినట్లు, గాలి ఆడకపోవడం వల్లే మరణించినట్లు స్పష్టమైంది…. పోలీసుల విచారణలో మాధురి తన నేరాన్ని అంగీకరించింది…
సో, ప్రియుడు కూడా ఇరుక్కున్నట్టే… వాడి కుటుంబం..? వాడి బంధుగణం..? పెళ్లాలు అన్నింటికీ తెగిస్తున్నారు… కానీ ఈ ప్రియులు ఎందుకు ఈ హత్యాకాండలో చేతులకు నెత్తురు అంటించుకుంటున్నారు..? తమ కుటుంబాల మాటేమిటి..?! అటూ ఇటూ రెండు కుటుంబాల పిల్లలపై పడే ముద్రలు రాబోయే రోజుల్లో ఏ విపరిణామాలకు దారితీస్తాయి..!! అంత ఆలోచిస్తే ‘మాధురులు’ ఎందుకవుతారు..?!
- నవ్వొచ్చింది ఏమిటంటే..? ఓ పత్రిక వాడు ఆమె తన ప్రియుడితో కలిసి హతమార్చింది అని రాశాడు… వాడు ప్రియుడు కాదు, ఆమె ప్రేయసి కాదు… అక్రమ సంబంధం, కామవాంఛ, బరితెగింపు… దానికి లవ్ ముద్ర వేయడం పాత్రికేయానికి మచ్చ..!!
Share this Article