.
నిన్నటి అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌తో తన బాడీ లాంగ్వేజ్… తెలుగు ఖ్యాతిని పెంచేందుకే సినిమాలు చేస్తున్నానన్న జోక్… చెప్పిన అబద్ధాలు… రోజూ ఓ మూల కూర్చుని చింతిస్తున్నాడన్న అరవింద్ వ్యాఖ్యలు చదువతుంటే…
మొదటి నుంచీ ఈ వివాదం… సినిమా సర్కిళ్ల స్పందన గట్రా చూస్తుంటే… చిరంజీవి గుర్తొచ్చాడు… అవును, ఆ అరవింద్ బావే… ఆ బన్నీ మామే… తను ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో… తన కార్యక్రమం కోసం వస్తూ ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతే చిరంజీవి ఎంత బాధపడ్డాడో గుర్తొచ్చింది…
Ads
అప్పట్లో ఆ కవరేజీ బాధ్యతలు చూసిన ఓ మిత్రుడిని అప్పుడేం జరిగిందో గుర్తుందా మిత్రమా అనడిగితే… ఇలా రాసి పంపించాడు… ప్రత్యక్ష సాక్షి అప్పుడు… (తను పార్టీ పెట్టిన కొత్తలో తను ఎక్కడికి వెళ్లినా జనం విరగబడేవాళ్లు… ఏ తెలుగు సినిమా హీరో అనుభవించని టాప్ రేంజ్ పాపులారిటీ ఆయన సొంతం…)
అది 2009 ఫిబ్రవరి 10…
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి విజయవాడ మీదుగా గుంటూరు జిల్లాకు వచ్చారు…
గుంటూరు నగరంలో ఉదయం ప్రెస్‌మీట్ పెట్టి… నారాకోడూరు మీదుగా తెనాలి బయలుదేరారు…
అప్పటికి ఇంకా రాజకీయాల్లో ఓడిపోని మెగాస్టారే కాబట్టి జనం విరగబడ్డారు. రోడ్లకు ఎటువైపు చూసినా జనమే..
నారా కోడూరు గ్రామంలో తన పార్టీ ప్రజారాజ్యం పేరిట ఒక్క బ్యానర్ కూడా లేని “వర్గ” రాజకీయాలను చూసి ఒకింత ఆశ్చర్యంతో నవ్వుకున్న చిరంజీవి… ఆ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నమస్కారం చేసి ముందుకు కదిలారు…
ఈ క్రమంలో (గ్రామం చక్రాయపాలెం) తెనాలి సమీప గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చిరంజీవికి ఎదురేగి స్వాగతం పలకాలని ర్యాలీగా వస్తూ… బైక్ మీద జారిపడి అక్కడికక్కడే చనిపోయారు… ఇద్దరూ బావామరుదులు…
విషయం చిరంజీవికి తెలిసింది… వెంటనే రోడ్ షో నిలిపేశాడు… ఆ యువకుల మృతదేహాలకు వద్దకు వెళ్లి, స్వయంగా నివాళులర్పించారు…
ఆ తల్లిదండ్రుల రోదనలకు కదిలిపోయి తను కూడా కన్నీరు పెట్టుకున్నారు… అది చూసి చలించిన ఓ మహిళ (మృతుల్లో ఒకరి తల్లి) మీకు రెండు ఓట్లు పోయాయయ్యా అంటూ బిగ్గరగా రోదించడంతో అక్కడ విషాద ఛాయలు ఒక్కసారిగా కట్టలు తెగాయి…
(అప్పటి ప్రజారాజ్యం పార్టీ నుంచి పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన తాళ్ల వెంకటేష్ యాదవ్ ఈ సమాచారం పంపారు…)
ఆ తర్వాత చిరంజీవి సోదరుడు నాగబాబు ఆ కుటుంబాలను కలిసి కొంత ఆర్థిక సాయం అందించినట్టు గుర్తు… ఇప్పుడు అల్లు అర్జున్ ఘటనల నేపథ్యంలో… అది నాకు గుర్తుకు వచ్చింది… ఇట్లు… అప్పట్లో ఆ ఘటనను కవరేజ్ చేసిన ఓ జర్నలిస్టు ‘జీవీ………
(15 సంవత్సరాల క్రితం, అంటే అల్లు అర్జున్ అప్పుడు ఏం చేస్తుండేవాడో తెలియదు… సగటు తెలుగు స్టార్ హీరోలను మించి ఎన్నోరెట్లు స్టార్‌డం అనుభవించిన వ్యక్తి ఇలాంటి సందర్భాల్లో మానవీయ ధోరణితోనే వ్యవహరిస్తాడు తను… అల్లు అరవింద్‌కు ఇది అందరికన్నా బాగా తెలుసు… ఐనా సరే, ప్చ్… ఇప్పుడేమో…!!)
Share this Article