Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకటే చెట్టు… మీద పది పక్షులు… ఒకటే తుపాకీ గుండు… తర్వాత మీరే చదవండి…

February 27, 2023 by M S R

ఒక ప్రొఫెసర్‌కు తన పిల్లల ఐక్యూ పరీక్షించాలని అనిపించింది… క్లాసులో ఓ పిల్లవాడిని లేపాడు… అడిగాడు… ‘‘ఒక చెట్టు మీద 10 పక్షులున్నాయ్… నువ్వు ఒకదాన్ని తుపాకీతో కాల్చావు, ఇంకా ఎన్ని మిగిలి ఉంటాయి..?’’ మిగతావన్నీ ఎగిరిపోతాయి అని జవాబు చెబుతాడని అందరూ ఎదురుచూస్తున్నారు… ఈ పక్షులు, చెట్లు, కాల్పుల పజిల్స్ ఎప్పుడూ వినేవే కదా… కానీ ఆ పిల్లాడు ఇండియన్ పొలిటికల్ లీడర్ టైపు… ఈడీ ప్రశ్నలకు బదులు చెప్పే తరహాలో సంభాషణ ఇలా సాగింది…

‘‘అది సైలెన్సర్ బిగించిన తుపాకీయా..? లేక నిశ్శబ్దంగా పేలే ఇతరత్రా తుపాకీయా..?’’

‘‘నో, అది శబ్దంతో పేలే తుపాకీయే…’’

Ads

‘‘అది ఎంత శబ్దం చేస్తుంది..?’’

‘‘80 నుంచి 100 డెసిబిల్స్’’

‘‘అంటే చెవులు నొప్పి పెట్టేంత రేంజా..?’’

‘‘అవును..’’

‘‘సిటీలో పక్షలపైకి కాల్పులు చట్టవిరుద్ధమా..?’’

‘‘నో, చట్టాన్ని ఉల్లంఘించడం ఏమీ కాదు…’’

‘‘నిజం చెప్పండి, ఆ పక్షి నిజంగా మరణించిందా..? మీరు వెరిఫై చేసుకున్నారా..?’’

‘‘అవును’’ ప్రొఫెసర్ లో అసహనం పెరిగిపోతోంది… ‘‘అక్కడ ఎన్ని మిగిలి ఉంటాయో చెప్పు…’’

‘‘సరే, సరే, ఆ పక్షుల్లో చెవిటి పక్షులు ఏమైనా ఉన్నాయా..?’’

‘‘లేవు…’’

‘‘మెంటల్ పక్షులేమైనా ఉన్నాయా..? తుపాకీ చప్పుడు కాగానే ఎగరకుండా అలాగే ఉండిపోయేవి ఉన్నాయా..?’’

‘‘నో, నో, ప్రతి పక్షీ కనీసం 200 ఐక్యూ దాటి ఉంటుంది… తుపాకీ పేలగానే ఎగిరిపోతాయి…’’

‘‘ఆ పక్షుల్లో ఏమైనా పంజరాల్లో బంధించినవి ఉన్నాయా..?’’

‘‘లేవు… నీకు దండం పెడతానురా… నన్ను ఇంటరాగేట్ చేయకురా…’’

‘‘పక్కన ఇంకేమైనా చెట్లున్నాయా..? వాటిపై ఏమైనా పక్షులున్నాయా..?’’

‘‘ఏమీ లేవు…’’

‘‘చుట్టుపక్కల పది మైళ్లు ఎలా ఉంటుంది..?’’

‘‘అలాంటి చెట్లే తప్ప ఇంకేమీ లేవు…’’

‘‘ఈ చెట్టు మీద ఉన్న పక్షుల్లో ఆకలితో ఉండి ఎగరలేనివి, రెక్కలు సరిగ్గా లేనివి ఉన్నాయా..?’’

‘‘నో, అన్నీ బాగానే ఉన్నాయి…’’

‘‘పక్షుల కడుపుల్లో ఉన్న పిల్లల్ని కూడా కౌంట్ చేయాలా..?’’

‘‘అవన్నీ మగ పక్షులు… కడుపుల్లేవు, కాకారకాయల్లేవు…’’

‘‘కడుపయ్యే అవకాశాలే లేవంటారా..?’’

‘‘సవాలే లేదు… నో చాన్స్…’’

‘‘ఇంతకీ షూటర్ కంటిచూపు బాగానే ఉందా..? ఆ పది పక్షలనూ ఎలా పోల్చుకున్నాడు..?’’

‘‘ఒరేయ్, ఒరేయ్, నిన్ను షూట్ చేసినా బాగుండు… వాడి కంటిచూపు బాగానే ఉంది… అక్కడున్నవి కేవలం పది పక్షులు…’’ ప్రొఫెసర్ నుదుటి మీద చెమట కనిపిస్తోంది ఇప్పుడు…

‘‘క్లాస్ బెల్ మోగింది, ఆ విద్యార్థి అడుగుతూనే ఉన్నాడు… ‘‘వాటిల్లో చావంటే భయం లేనివి ఏమైనా ఉన్నాయా..?’’

‘‘నో, అన్నింటికీ చావంటే భయమే…’’

‘‘సపోజ్ తమ లవర్‌ను కాల్చడాన్ని చూసి, మరో పక్షి తనూ చావడానికి సిద్ధపడి అక్కడే ఉండిపోయిందా..?’’

‘‘ఒరేయ్, నువ్వు ఎక్కడికో వెళ్లిపోతున్నావ్… అవన్నీ మగ పక్షులని చెప్పాను కదరా..?’’

‘‘అలా కాదు మాస్టారూ… స్వలింగ సంపర్కులు ఉండొచ్చు కదా… వాటి లైంగిక స్వభావాన్ని మీరెలా నిర్ధారిస్తారు..?’’

‘‘అవన్నీ వదిలేసి, కాస్త నేనడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు ఇవ్వరా బాబూ…’’

‘‘ఒక షాట్‌కు రెండు పక్షులు మరణించే చాన్స్ ఉందా..? అలా కాల్చగలడా..?’’

‘‘లేదు..’’

‘‘పోనీ, మూడు పక్షులు..?’’

‘‘లేదే…’’

‘‘పోనీ, నాలుగు పక్షులను ఒకే దెబ్బకు కొట్టేయగలడా..?’’

‘‘లేదు, లేదు… లేదు…’’

‘‘ఓహో, అయిదు కొట్టగలడా..?’’

‘‘లేదురా, నీ దుంపతెగ, నన్ను కాల్చుకు తింటున్నావు కదరా…’’

‘‘ఆ షాట్ ఏకంగా చెట్టునే కూలదోసేంత బలమైందా..? అప్పుడిక పక్షులే ఉండవు కదా…’’

‘‘అదొక ఆర్డినరీ పిస్టల్, చెట్టును కూలదోసేంత సీన్ లేదు…’’

‘‘…. అంటే పక్షులన్నీ ఎగరిపోయే స్థితిలోనే ఉన్నాయంటారా..?’’

‘‘అవును బాబూ, అవును, అవును, అవును…’’

‘‘ఎగిరిపోయేటప్పుడు ఒకదాన్నొకటి పొడుచుకునే అవకాశం ఏమైనా ఉందా..?’’

‘‘లేదు, ప్రతీ పక్షికీ శాటిలైట్ నేవిగేషన్ సిస్టమ్ ఫిట్ చేసి ఉంది… సాఫీగా ఎగిరిపోతాయి…’’

‘‘వోకే, నీ జవాబులు నన్ను మోసం చేసేవిలా ఏమీ లేవు… మరణించిన పక్షి అలాగే చెట్టుకు వేలాడుతూ ఉంటే, చెట్టుపై మిగిలి ఉండేది అదొక్కటే… మీ ప్రశ్నకు జవాబు ఒకటి… ఒకవేళ అదీ కిందపడిపోతే, చెట్టుపై ఏమీ మిగలవు… జవాబు మీరే వర్తింపజేసుకొండి…’’

‘‘ఒరేయ్, నువ్వు భవిష్యత్తులో గొప్ప లాయర్ లేదా గొప్ప సివిల్ సర్వెంట్ లేదా కరప్ట్ లీడర్ అవుతావురా… గ్యారంటీ…’’ అంటూ కిందపడిపోయాడు… కథ అయిపోలేదు… మిగతాది మీరు రాసుకోవచ్చు… మీ ఐక్యూ ఆ పిల్లాడికన్నా ఎక్కువగా ఉండి ఉంటే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions