యాహ్నా పుట్టిన తరువాత… నాకు మూడు మిస్ క్యారేజీలు… మధ్యలోనే అబార్షన్లు… ఇక నాకు మరో సంతానం మీద ఆశలన్నీ చనిపోయినయ్… యాహ్నా పెరిగేకొద్దీ ఆమె మీదే మా ప్రేమ కేంద్రీకృతం అవుతోంది… మాకు ఇంకెవరున్నారని…! కానీ యాహ్నాకు మాత్రం బాగా కోరిక, తనకు చెల్లె గానీ, తమ్ముడు గానీ కావాలని…
ఎప్పుడు బంధువుల ఇళ్లకు వెళ్లినా సరే, ఎవరైనా చిన్న బేబీని చూస్తే చాలే ఏడ్చేది… నాతో తగవు పెట్టుకునేది… అలిగేది… ‘మమ్మీ, మేరా కోయి భాయి- బహెన్ క్యూ నహీఁ హై… (నాకు తమ్ముడో, చెల్లెలో ఎందుకు లేదు..?) మాకూ మెల్లిగా అర్థమవుతోంది… తనకు ఒక తోడు కావాలని కోరుకుంటోందని… అన్నీ పంచుకోవడానికి తనకు ఓ చిన్న తోబుట్టువు కావాలని… ఆ కోరిక తన వయస్సుతోపాటు పెరుగుతోందని…
లేటుగానైనా… మేం ఆశలన్నీ వదిలేసుకున్న స్థితిలో… ఆ దేవుడు మా యాహ్నా కోరిక తీర్చడం కోసమే అన్నట్టుగా నాకు మళ్లీ ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మయింది… యాహ్నాకు చాలా ఉత్కంఠగా, ఉత్సాహంగా ఉంది… ఎప్పుడూ నన్ను అంటిపెట్టుకునే తిరిగేది… ‘‘మమ్మీ నీకేమైనా కావాలా..? తెచ్చి పెట్టాలా..?’’ నాకు అమ్మలా అనిపించేది, హత్తుకునే దాన్ని, దుఖం కాదు గానీ కళ్లల్లో నీళ్లు తిరిగేవి…
Ads
వయస్సు చిన్నదే అయినా తనకు అన్ని విషయాలూ అర్థమయ్యేవి… ఆరిందాలా అన్నీ అడిగేది… నేను లేబర్ రూంలోకి డెలివరీ కోసం వెళ్తున్నప్పుడు కూడా… ‘‘మమ్మీ, ఆప్‌కో కుచ్ నహీఁ హోగా నా..?’’ (అమ్మా, నీకేమీ కాదు కదా…) తనకు భయం, దాంతోపాటు ఉత్కంఠ, తోబుట్టువు కోసం నిరీక్షణ… వో ఏక్ దమ్ రెడీ హోకే ఆయీ థీ ఘర్ సే… బేబీకి స్వాగతం చెప్పడానికి మంచిగా తయారై వచ్చింది హాస్పిటల్‌కు…
నేను డాక్టర్‌కు ముందే చెప్పాను… బిడ్డను ఎవరి చేతికీ ఇవ్వకండి, ముందుగా నా యాహ్నా చేతుల్లోనే పెట్టాలని… అదే జరిగింది… నా కొడుకు విశ్వాన్ని యాహ్నా చేతుల్లోకి అపురూపంగా తీసుకుంది… శిశువును ఎత్తుకుంటున్నాననే భయమే లేదు, తమ్ముడిని ముద్దాడాలనే ప్రేమ తప్ప… తీరా తన చేతుల్లోకి పసిగుడ్డు వచ్చాక ఏడ్వడం స్టార్ట్ చేసింది… తమ్ముడి పట్ల ప్రేమతో ఉద్వేగాన్ని ఆపుకోలేని కన్నీళ్లు అవి…
నిజానికి తమ్ముడు వస్తున్నాడని రాత్రంతా తండ్రితోపాటు ఓ గదిని డెకరేట్ చేయడంలో, బెలూన్లు, పూలతో అలంకరించడంలో నిద్రే పోలేదు… మరి నన్నూ, నా మలి శిశువుకూ స్వాగతం చెప్పాలి కదా… విశ్వమంటే దానికి ఎనలేని ప్రేమ… ఏడ్వనిచ్చేది కాదు… ఎత్తుకునేది, డైపర్లు మార్చేది… పాలివ్వడమే నా పని… మిగతావన్నీ యాహ్నాయే చేసేది…
ఇంటికి ఎవరైనా వస్తే ఎక్కువ సేపు చూడనిచ్చేదే కాదు, దిష్టి తగులుతుందని భయం… ఒరేయ్ విశ్వం, ఈ వీడియో దాచిపెట్టుకోరా… కొన్నేళ్ల తరువాత, నువ్వు పెరిగాక, మీ అక్కకు నీమీద ఎంత ప్రేమో నీకు ఈ వీడియో ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ ఉంటుంది… మంచి మెమొరీ కదరా… ఈ నెత్తుటి బంధాన్ని విడదీసేది ఏముందిరా లోకంలో…
Share this Article