Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డియర్, గుడ్‌నైట్ సినిమాల గురక కథలకూ దీనికీ ఏ లింకూ లేదని గమనించ మనవి…

April 15, 2024 by M S R

గుడ్ నైట్ అనే ఓ సినిమా… ఆమధ్య వచ్చింది లెండి… హీరోకు గురక… తద్వారా సమస్యలు, భార్యాభర్తల నడుమ, వాళ్ల జీవితాల్లో ఇక్కట్లు కంటెంట్… సినిమా హిట్… ఓ చిన్న సమస్యగా మనకు కనిపించింది కొందరి జీవితాల్లో అదే పెద్ద సమస్యగా మారవచ్చు కదా… తరువాత అదే సమస్యను బేస్‌గా చేసుకుని ఈమధ్య డియర్ అనే సినిమా వచ్చింది… నిజానికి ఇలాంటివి కామెడీ బేస్డ్‌గా డీల్ చేస్తూ సబ్జెక్టుపైనే ఫోకస్డ్‌గా ఉంటే సినిమా హిట్టవుతుంది… కానీ ఇది సీరియస్, సో, తన్నేసింది……

ఇలాంటి విశ్లేషణలు, స్టోరీలు చదువుతూ ఉంటే… ఓ మిత్రుడి పోస్టు కనిపించింది… గురక అనేది చిన్న సమస్యేమీ కాదు, చిక్కులు తెచ్చిపెట్టే సమస్యే అని అర్థమవుతుంది… (నిజానికి గురక కొన్నిసార్లు మనలోని అనారోగ్యాన్ని సూచించే ఇండికేషన్ కూడా…) ఆ పోస్టు షేరబుల్ అనిపించింది… ఆ రెండు గురక చిత్రాలకు దీనికీ ఏ సంబంధమూ లేదని గమనించగలరు… సదరు పోస్టు యథాతథంగా… దిగువన…

గురక



Mahesh Babu … గత నాలుగేళ్లుగా ముంబైలో IPL కి పని చేయడానికి వస్తున్నాను , సంవత్సరంలో Event జరిగే ఆ మూడు, ఆరు నెలలు ఇక్కడే ఉంటాను అదే yearly routine కంటిన్యూ అవుతూ‌ వస్తుంది

Ads

అయితే,

ఈసారి నేను Company మారాను, Sports నుండి నా Favorite అయిన Entertainmentకి Shift అయ్యాను

నేను పనిచేస్తున్న కంపెనీ ఎంప్లాయిస్ కి ఎలాంటి స్టే ఫెసిలిటీ ఇవ్వలేదు so, నేనే సొంతంగా స్టే అరేంజ్ చేసుకోవాలి

ముంబైలో స్టే అరేంజ్ చేసుకోవడం అంటే అంతా ఆషామాషీ విషయం కాదు, మినిమం 80,000 ఉంటే 1 bhk అద్దెకి దొరుకుతుంది, మన హైదరాబాదులో ఉండే పెద్ద హాల్ లాంటి స్పేస్ లో మొత్తం 1bhk flat అమరిపోతుంది అంత ఇరుగ్గా ఉంటాయి, అది కూడా మినిమం 1 yr contract condition తో ఇస్తారు 2, 3, 6 months లాంటి‌ Short period occupancy encourage చేయరు ఒక నెల అద్దే అంటే 22,000/- బ్రోకర్ కి ఇవ్వాలి , సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా అసాధ్యం,

అందుకని చాలా వరకు నాలాగా పని చేసుకోడానికి వచ్చినవాళ్ళు షేరింగ్ లో ఉంటారు ఒక్క 1 bhk లో నలుగురు అడ్జస్ట్ అవుతూ ఉంటారు

కానీ నేను అలా అడ్జస్ట్ అవ్వడానికి లేదు, నాకు Goodnight సినిమాలో హీరోకి ఉన్న విధంగా Chronic Snoring Problem ఉంది

అసలే రూములో నలుగురు అడ్జస్ట్ అవుతూ ఉండాలి, అగ్గిపెట్ట లాంటి గదుల్లో పక్కపక్కనే పడుకోవాలి సరిగ్గా కాళ్లు చాపి పడుకుంటే ఒకరి కాళ్ళు ఒకరికి తగులుతాయ్,

సీజనల్ ఈవెంట్స్ కి పనిచేయడానికి వస్తాం కాబట్టి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అంతటి hectic Day తర్వాత సుఖంగా నిద్ర పట్టడం చాలా అవసరం, అందరూ నాలాగే పని చేసుకోవడానికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్లే

వాళ్ల నిద్రకి నేను డిస్టర్బెన్స్ అవ్వదలచుకోలేదు

అవుదాం అనుకున్నా వాళ్లు అవనివ్వరు

స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఉంటే మాకు నిద్రకి భంగం కలుగుతుంది అని, ఎవరు మాత్రం వాళ్ళ నిద్రని Sacrifice చేసుకుంటారు ?

రికార్డు లెవల్లో గురక పెడతాను నేను, నా గురక గురించి మార్కెట్లో మంచి టాక్ ఉంది, అందుకని నావల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదని నేనే ఇల్లు వెతుక్కోవాలని ఫిక్స్ అయ్యాను,

కానీ నేను ఇక్కడికి వచ్చేదే పని చేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి, అలాంటిది నా దగ్గర లక్ష రూపాయలు సేవింగ్స్ ఉంటే ఏ ట్రిప్పుకో పోతాను కానీ ముంబైకి ఎందుకు వస్తాను? So, ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా సరైన budget లేదు,

Infact నేను ఒక‌ వారం ముందొచ్చి stay అదీ arrange చేసుకుంటే Drama తప్పేది, అలా కాకుండా joining day రోజు early flight ఎక్కొచ్చి direct గా luggage తో office లో దర్శనమిచ్చి‌ report చేసా, friends ఉంటున్న ఇల్లేమో దూరం, ఒకవేళ వెళ్ళినా నా గురక వల్ల వాళ్ళకు‌ నిద్రాభంగం, ఎవడు ఏమంటాడో అన్న భయంతో అక్కడ ఉండలేం

ఒక‌ 2 days ఆఫీసులోనే chair ల‌ పైన adjust అవుతూ నిద్ర గడిపేసా, తెల్లవారు ఝామునే లేచి బ్రషింగ్ గట్రా మేనేజ్ చేసుకున్నాను కానీ స్నానానికి వెసులుబాటు లేదు 2 days అలాగే పని చేసాను‌ ,

స్నానం లేనందుకు body odour వచ్చింది, uncomfortable గా ఉందని manager కి collegue complaint చేసాడు,

నాకు కొంచెం OCD ఉంది, neatness కి brand ambassador లాంటి నా గురించే neat గా లేనని నా hygiene గురించి complaint చేసేసరికి తలకొట్టేసినట్టయ్యింది, ఈ డ్రామాకి end card పడాలంటే‌ stay set అవ్వాల్సిందే‌

ఎలా‌రా దేవుడా అనుకుంటూ ఉండగా సాధు అచ్చా కరేతో భగవాన్ బిచ్చా కియా

ముంబైలో నాకు అద్భుతమైన ఇల్లు దొరికింది

Delhi నుంచి వచ్చి ముంబైలో నివాసం ఏర్పరచుకున్న ఒక అబ్బాయి తారసపడ్డాడు,

పరిస్థితుల రీత్యా మళ్ళీ Delhi వెళ్ళాల్సివచ్చింది,

తను Delhi లో ఉంటున్నా ఇక్కడ అద్దె ఖచ్చితంగా కట్టాలి, అది కూడా నెలకి 18 వేల రూపాయలు,

“ఎలాగో నేను అక్కడ ఉండట్లేదు, పైగా మొత్తం అద్దె కడుతున్నాను, మీరు అక్కడ ఉండండి” అని నాకు సగం రెంట్ కే ఇల్లు ఇచ్చేశాడు

గురక

Now I have ఇల్లు, (not a room) with attached beach & island

ఇతను నాలాగే బాగా పద్ధతి కలవాడు, ఇంట్లో అన్ని సమకూర్చుకున్నాడు, అన్నీ నీట్ గా పెట్టుకున్నాడు

ఇంట్లో గ్యాస్ స్టవ్, రెండు బెడ్లు, ఫ్రిడ్జ్, వంట సామాన్లు అన్నీ ఉన్నాయి

కాకపోతే ఈ ఇల్లు madh island అని ఒక దీవి మధ్యలో ఉంటుంది, ఇది ఒక holiday destination, tourist spot కూడా, చాలా Film shootings కూడా జరుగుతూ ఉంటాయ్, complete Goa feel ఉంటుంది‌ Holiday కి వచ్చినట్టు

అయుతే నేను ఆఫీస్ నుండి‌ ఇక్కడికి రావాలంటే రోజూ పడవ ప్రయాణం చేయాలి, ఒక రెండు మెట్రోలు లేదా ఒక మెట్రో ఒక లోకల్ ట్రైన్ మారాలి, రెండుసార్లు షేరింగ్ ఆటో తీసుకోవాలి, ఇవన్నీ కాకుండా ముంబై స్పీడ్ ని క్యాచ్ చేయాలంటే కి.మీ నడక తప్పని సరి, ఇవన్నీ చేస్తే కానీ నేను ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్లలేను

మొదట ఏడు రోజులు బాగా చిరాకుగా అనిపించింది ఏంటి ఇదంతా అని, తర్వాత మెల్లిగా అలవాటయింది, ఎందుకంటే ఎలాంటి security deposit లేకుండా 1 yr contract లాంటి condition లేకుండా ఇంత తక్కువ ధరకు ఇంత విశాలమైన ఇల్లు అన్ని వసతులతో ఎవ్వరి Disrubance లేకుండా నాకు ముంబైలో ఇల్లు దొరకడం అనేది అసాధ్యం, పైగా మొత్తం ఇల్లు నాకే గనక DTS లో గురక పెట్టినా అడిగేవాడు లేడు, ఎవరినో ఇబ్బంది పెడుతున్నాను అనే Guilt లేకుండా ప్రశాంతంగా పడుకోవచ్చు , కావలసినంత ప్రైవసీ ఉంది thats the best part, నాకు ఇంకో option, choice కూడా లేదు

పని హడావిడిలో పడి… ఇది దీవిలో ఉంది అన్న విషయం తెలుసు కానీ దీవి ఉన్నప్పుడు చుట్టూ సముద్రం ఉంటుంది కదా అన్న చిన్న లాజిక్ ని మరిచాను

ఇవాళ సండే మొత్తం క్లీనింగ్ లో అయ్యాక

బయటికి వచ్చి 5 నిమిషాలు అలా నడుస్తుండగా

అలల చప్పుడు వినిపించించి

అందరూ అటువైపు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు ఏంటా అని కొంచెం చూస్తే చిన్న సందులోంచి సూర్యుడు ఎర్రగా కిందకి దిగుతున్నాడు ఆ visual ని follow అవుతూ కరెక్ట్ గా 30 అడుగుల దూరంలో ఉంది ఈ madh beach , ఒక్కసారిగా చూసి surprise అయ్యాను

నాకు కొండలు, పర్వతాలు, సముద్రాలు , అడవులు జలపాతాలు,‌ నదులు అంటే చాలా ఇష్టం

పక్కన ఇంత అందమైన బీచ్ పెట్టుకొని 15 రోజులు వేస్ట్ చేసానిపించింది, ఇక ఈ మూడు నెలలు gonna have abundant amount of vitamin sea, మొత్తానికి ఈ సారి నేను‌ job cum summer holiday కి ముంబై వచ్చాను….



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions