Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ బలమైన భారత విద్వేషి గొంతు ఆగిపోయింది… బీబీసీ రేడియో కాలగతి…

October 11, 2022 by Rishi

పార్ధసారధి పోట్లూరి ….. యాంటీ ఇండియా ప్రాపగాండా ! భారత్ మీద ఎప్పుడూ వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే BBC కి కొంచెం సెగ తగిలినట్లుగా ఉంది ! ప్రపంచవ్యాప్తంగా ఉన్న BBC రేడియో స్టేషన్లని మూసివేస్తున్నట్లు ప్రకటించింది బిబిసి! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి రేడియో లో పనిచేస్తున్న 382 మంది ఉద్యోగులని తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది బిబిసి.


పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు దానికి తోడుగా ధరలు పెరగడం కారణంగా చెప్తున్నది బిబిసి. దాంతో రేడియో ప్రసారాలకి గాను చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజ్ కూడా భారంగా మారడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లుగా బిబిసి ప్రకటించింది. నామినల్ GDP ఆధారంగా భారత్ బ్రిటన్ ని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించిన తరువాత ఈ వార్త వెలువడింది.


ప్రస్తుతం బ్రిటన్ ఆర్ధికంగా కష్టాలని ఎదురుకొంటున్నది. ద్రవ్యోల్బణం నెల నెలకి పెరుగుతూ పోతూ ఉన్నది. మరో వైపు బ్రిటన్ పౌండ్ విలువ డాలర్ తో పోలిస్తే క్రమంగా తగ్గుతూ వస్తున్నది. డాలర్ తో పోలిస్తే బ్రిటన్ పౌండ్ విలువ 17% పడిపోయింది. డాలర్ తో పోలిస్తే భారత్ రూపాయి విలువ 7% పడిపోయింది.

Ads

 


పోయిన జనవరి నెల 2022 లో బ్రిటన్ ద్రవ్యోల్బణం 5.456% గా ఉండగా గత నెల అది 10.10% గా ఉంది. అంటే డబుల్ డిజిట్ కి చేరుకుంది ద్రవ్యోల్బణం. బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ ధనవంతులు కడుతున్న ఆదాయపన్నుని తగ్గిస్తానని హామీ ఇచ్చింది. మూడేళ్ళ క్రితం శ్రీలంక కూడా ఇలాగే చేసింది కదా ? ధరల పెరుగుదలతో పాటు డాలర్ రిజర్వ్ కూడా గణనీయంగా పడిపోతున్నది. గతంలో $211 బిలియన్ డాలర్లుగా ఉన్న బ్రిటన్ డాలర్ రిజర్వ్ ఇప్పుడు అది $80.7 బిలియన్ డాలర్లకి తగ్గింది.


బ్రిటన్ ప్రభుత్వం తన మిలటరీ బడ్జెట్ మీద కోత పెట్టింది ఇప్పటికే. అదే సమయంలో విదేశాలలో బ్రిటన్ నిర్వహిస్తున్న మిలటరీ బేస్ లని మూసివేయాలని నిర్ణయించింది. బ్రిటన్ మొత్తం 17 ప్రదేశాలలో తన మిలటరీ బేస్ లని నిర్వహిస్తున్నది బ్రిటన్ బయట. జర్మనీ, లిథువేనియా, ఎస్టోనియా, చెక్ రిపబ్లిక్, సైప్రస్ లు ప్రధానంగా ఉన్నాయ్. బహుశా వీటిలో చాలా వరకు మూసివేయవచ్చు ఖర్చు తగ్గించుకోవడానికి.
ఇది ప్రారంభం మాత్రమే !


ఎప్పుడూ భారత దేశం – బీదరికం మీద వార్తలు ప్రసారం చేసే బ్రిటన్ మీడియా గత కొద్ది వారాలుగా ఎందుకో తన దూకుడిని తగ్గించింది. బహుశా స్వదేశంలోని పరిస్థితులని గమనించి వెనక్కి తగ్గింది అనుకోవాలా ? ముందు ముందు బిబిసి కూడా మరిన్ని పొదుపు చర్యలని చేపట్టే అవకాశాలని కొట్టిపారవేయలేము.


ఇక న్యూయార్క్ టైమ్స్ గురించి మనకి తెలియనది ఏముంది ?


డబ్బులు తీసుకొని వార్తలని వ్రాసే న్యూయార్క్ టైమ్స్ అంటే ఆప్, లెఫ్ట్ పార్టీలకు ఎనలేని ప్రేమ… చాలా ఇష్టం… తాజాగా డబ్బులు తీసుకొని మరీ ప్రకటన రూపంలో న్యూయార్క్ టైమ్స్ చాలా తెలివిగా అమెరికన్ సమాజానికి ఒక విజ్ఞప్తి చేసింది. భారత్ లో ప్రస్తుతం ప్రజలు అణిచివేయబడుతున్నారుట ! ముస్లిములు, క్రిస్టియన్లు, సిక్కులు చాలా కష్టాలని ఎదుర్కొంటున్నారుట ! మసీదులు, చర్చి లని కూలగొడుతున్నారుట. భారత్ లో ప్రస్తుతం హిందూ ఫాసిస్ట్ ప్రభుత్వం ఈ అణిచివేతలకి పాల్పడుతున్నదిట ! కాబట్టి యావత్ అమెరికన్ ప్రజానీకం అమెరికన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత ప్రభుత్వం మీద చర్య తీసుకునేలా చేయాలిట ! ఇదంతా ప్రకటన రూపంలో ఉన్నా నిజానికి బాక్సు కట్టి మరీ, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నది సాక్షాత్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రికే అన్నట్లుగా ఉంది.


ఈ ప్రకటన – బహిరంగ లేఖ వేయడానికి న్యూయార్క్ టైమ్స్ కి డబ్బు ఇచ్చింది ఎవరు ?

  • అమెరికన్ ముస్లిం ఇన్స్టిట్యూషన్ [American Muslim Institution]
  • అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆఫ్ అమెరికా [Association of Indian Muslims of America]
  • హార్వర్డ్ కైన్ [Harvard Cain]
  • దళిత్ శాలడారిటీ ఫోరం ‘[Dalit Solidarity Forum]
  • హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ [Hindus for Human Rights]
  • ఐసిన్ఏ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ [ICNA Council for Social Justice]
  • ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ [ Indian American Muslim Council]
  • ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ పీస్ అండ్ జస్టిస్ [International Society for Peace and Justice]
  • అమెరికన్ సిఖ్ కౌన్సిల్ [American Sikh Council]

ఇంతకీ 400 ఏళ్ల క్రితం ఇప్పుడు అమెరికాగా పిలవబడుతున్న దేశంలో మూల వాసులుగా ఉన్న రెడ్ ఇండియన్స్ ఏమయ్యారు ? వాళ్ళని సమూలంగా నాశనం చేసిన వాళ్ళు ఎవరు ? రెడ్ ఇండియన్స్ ఎవరికి ఫిర్యాదు చేయాలి ? రెడ్ ఇండియన్స్ కి ఎవరు న్యాయం చేస్తారు ? ఇంతకీ ఎందుకింత ఆక్రోశం ? గత 8 ఏళ్లలో రష్యా,కెనడా, బ్రెజిల్, ఇటలీ, ఫ్రాన్స్ లని వెనక్కి నెట్టి భారత్ ప్రబల ఆర్ధిక శక్తిగా నిలబడ్డది. ఇప్పుడు బ్రిటన్ ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్ధిక శక్తిగా అవతరించింది. త్వరలో జర్మనీ, జపాన్ లని కూడా వెనక్కి నెట్టి మూడవ అతి పెద్ద ఆర్ధిక శక్తిగా నిలబడాలి. అప్పుడే వీళ్ళు మొరగడం ఆపుతారు.

అమెరికన్ న్యూయార్క్ టైమ్స్,,CNN లతో పాటు జర్మనీ కి చెందిన మీడియా సంస్థ DW కూడా భారత వ్యతిరేక వార్తలని వ్యాపింపచేయడంలో ఎప్పుడూ ముందు ఉంటాయి. అందుకే జర్మనీ ఎకానమీని దాటాలి మనం అప్పుడే DW నోరు మూత పడుతుంది. ఇక అల్-జజీరా ఇంగ్లీష్ న్యూస్ అయితే నిత్యం మన మీద పడి ఏడవడమే ! పేర్లు వేరుగా, దేశాలు వేరుగా కనపడవచ్చు లేదా వినపడవచ్చు కానీ వీళ్ళ లక్ష్యం ఒక్కటే ! ఇండియా డీస్టెబిలైజేషన్… భారత సమాజానికి అర్థమైతే చాలు… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions