.
( Shankar G ) …. ఆన్లైన్ షాపింగ్… ఇవీ జాగ్రత్తలు…
నేను దాదాపుగా 15 సంవత్సరాలుగా ఆన్లైన్ లోనే కొంటున్నాను. మొదట జబాంగ్ లో కొనేవాణ్ని. అది కాస్త మింత్రాగా మారిపోయింది. ఆ మింత్రా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ తో అసోసియేట్ అయ్యింది. ఇవికాకుండా అమెజాన్, అజియో, టాటా క్లిక్, NN NOW, nyaka ఫ్యాషన్ లాంటి వాటిల్లో కూడా purchase చేసేవాణ్ణి.
Ads
సైజ్ సెలక్షన్…
మొదట సైజ్ ఎంచుకోవటంలో బాగా ఇబ్బంది పడేవాన్ని.. ఒక్కో బ్రాండ్ ఒక్కో సైజ్ లో ఉండేవి. జనరల్ గా సైజస్ S M X L XL XXL XXL ఇలా ఉండేవి…
సపోజ్ ARROW, రెమండ్స్, LP, పీటర్ ఇంగ్లాండ్, allen solly, US POLO, VAN HUESEN UCB లాంటి బ్రాండ్స్ మనం వాడే సైజ్ కన్నా ఒక సైజ్ పెద్దగా ఉంటాయి. మీ రెగ్యులర్ సైజ్ 40 ఐతే మీరు 38 తీసుకోవాలి… లెన్త్ కూడా 30 లేదా 31 ఉంటాయి. బహుశా 6 ఫీట్ వాళ్ళను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారనుకుంటా…
మీ హైట్ 5.5, 5.7 మధ్యలో ఉంటే levis, ఫ్లైయింగ్ మిషన్, ఇండియన్ టెర్రయిన్, nautica, american eagle, killer, spyker pepe jeans లాంటి బ్రాండ్స్ లాంటివి తీసుకోవటం మంచిది.
ఇవికాకుండా మీడియం రేంజ్ బ్రాండ్స్ కూడా ఉంటాయి.. అవికూడా బాగుంటాయి… మింత్ర వాడి రోడ్ స్టర్.. amazan వాడి సొంత బ్రాండ్, dennis lingo, ధామస్ స్కాట్, మస్ట్ హార్బర్ లాంటివి తక్కువలో వస్తాయి. క్వాలిటీ సో సో…
ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి. రేర్ రాబిట్, Mango, రాల్ఫ్ లారెన్, బాస్, టామి హిల్ ఫిగర్, బ్రూక్ బ్రదర్స్ లాంటివి చాలా ఖరీదు.. 70 పర్సన్ట్ డిస్కౌంట్ ఇచ్చినా మూడు నాలుగు వేలు ఉంటాయి.
ఇక సైజుల్లో ఇంకో ముఖ్య విషయం రెగ్యులర్, స్లిమ్, టేలర్ ఫిట్ లాంటివి ఉంటాయి. మీరు పొట్ట లేకుండా స్లిమ్ గా ఉంటే స్లిమ్ ఫిట్ తీసుకోండి. ఒక వేళ పొట్ట ముందుకు ఉంటే రెగ్యులర్ ఫిట్ తీసుకోండి. రెగ్యులర్ కాస్త లూజ్ గా ఉంటుంది.
మెటీరియల్ విషయానికి వస్తే… చాలా రకాలు ఉంటాయి. కాటన్, కాటన్ బ్లెండ్, లైనన్, లైనన్ బ్లెండ్, పోలిస్టర్, పాలీ కాటన్, పాలీ సిల్క్ ఇలా చాలా రకాలు ఉంటాయి నేనయితే 100% కాటన్, లినన్ ప్రిపర్ చేస్తాను.
కలర్స్, ప్యాట్రన్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేనయితే అన్ని రకాలు తీసుకుంటాను. Shirts లో క్యాజువల్, ఫార్మల్ అని రెండు రకాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఫార్మల్ వాడుతారు.
రేటింగ్… అన్నిటికంటే ఇది ముఖ్యం…
కస్టమర్ రేటింగ్ చూడండి… రేటింగ్ లేనివాటిని కొనటం రిస్క్.. రేటింగ్ 4, 4.5 మధ్య ఉంటే మంచిది. మినిమమ్ 500 మంది పైగా రేటింగ్ ఉన్న వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. ఇక 3 లోపల రేటింగ్ ఇచ్చిన వారి రివ్యూస్ చూడండి…
వారు క్వాలిటీ, కలర్, సైజ్ గురించి చూడండి. ఫోటోలు పెట్టి నెగిటివ్ లేదా పాజిటివ్ రివ్యూస్ ఉన్న వారివి నమ్మొచ్చు… కొన్ని కంపెనీస్ పెయిడ్ రివ్యూస్ కూడా రాయిస్తుంటాయి. ప్యాకింగ్ సరిగా లేకపోతే వాపస్ చేయండి.
ఒరిజినలా…. కాదా….
మీరు కొన్న షర్ట్ బటన్ మీద బ్రాండ్ లోగో లేదా పేరు ఉంటుంది. షర్ట్ లోపలివైపు అంచులు లైనింగ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. లేబిల్ కూడా అతికించి ఉంటుంది.
కొన్ని మాస్టర్ కాపీస్ కూడా ఉంటాయి. లోగోతో సహా అన్ని ఉంటాయి. కానీ క్వాలిటీ తెలిసిపోతుంది. క్లియరెన్స్ సేల్స్ లో ఎక్కువ డిస్కౌంట్ 75 శాతం వరకు ఉంటుంది. రాత్రి 9 లేదా 10 తర్వాత షాపింగ్ చేయండి…
అజియో కొని భంగపడిన మిత్రుడు John Kora పోస్టు ఇదుగో…
‘‘గతంలో ఒక మిత్రుడు ఎవరో ఈ దిక్కుమాలిన షాపింగ్ యాప్ (AJIO) గురించి పోస్టు పెట్టిండు. ఇదంతా సెకెండ్ హ్యాండ్ యాపారం, సుల్తాన్‌బజార్ సరుకు వెయ్యిరెట్లు బెటర్ అని…
అయినా సరే.. నేను దీంట్లో గట్టిగానే షాపింగ్ చేశా.. డెలివరీ అయ్యాక సరుకు చూస్తే.. మా తట్టి అన్నారం సంతలో అమ్మే కడ్రాయర్ల కంటే దారుణంగా ఉన్నాయ్…
మనకు ఏదో చూపించి.. ఇంకేదో అమ్ముతున్నడు ముఖేష్ అంబానీ మామ. అవును.. ఈ AJIO వాడిదే.. దాంట్లోని జియోను గుర్తు పట్టకుండా.. ముందొక A తగిలించిండు…’’
Share this Article