Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శరీరవర్ణం మన చేతిలో లేదు… కానీ పర్యవసానాల భారం మనదే…

July 22, 2024 by M S R

శారద జైత్రయాత్రలో ఓ మైలురాయి 1974 లో వచ్చిన ఈ ఊర్వశి సినిమా . సినిమాకు షీరో శారదే . చాలా సున్నితమైన కధాంశం . మనిషి నల్లగా పుడతాడా లేక తెల్లగా పుడతాడా అనేది ఆ మనిషి చేతిలో ఉండదు . కానీ , నల్లగా పుట్టినదాని పర్యవసానాలు మాత్రం ఆ మనిషి భరించక తప్పదు .

చాలా కుటుంబాల్లో చూస్తుంటాం . కుటుంబ పెద్దలు తమ పిల్లల్లో అందంగా ఉన్నవారిని బంధుమిత్రులకు ఎంతో గర్వంగా పరిచయం చేస్తుంటారు . అందంగా లేని పిల్లల్లో న్యూనతా భావం ఏర్పడుతుంది . కొంతమందిలో ప్రపంచం మీదే కోపం కలుగుతుంది . Pervert అవుతారు . Cynical గా తయారవుతుంటారు .

ఈ సినిమా అలాంటి నల్లమ్మాయి కధే . కవలల్లో ఒకరు తెలుపు , మరొకరు నలుపు . చిన్నప్పటి నుంచి ఆ నలుపు వలన అవమానాలు పడే అమ్మాయిగా , తన సోదరిని బుజ్జగించుకుంటూ రక్షించుకునే అమ్మాయిగా రెండు విభిన్న పాత్రల్లో శారద అద్భుతంగా నటించింది .

Ads

నల్లమ్మాయికి తెల్ల పాప పుట్టడంతో తనకు ఊర్వశి పుట్టిందని సంతోషపడుతుంది . తనలాగా తన బిడ్డ అవమానాల పాలు పడదని ఆనందపడుతుంది . ఆ పాత్ర నిష్క్రమణతో సినిమా ముగుస్తుంది .

కె బాపయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు విశేషం ప్రముఖ హిందీ నటుడు సంజీవ్ కుమార్ హీరోగా నటించటం . ఆయన్ని హీరోగా పెట్టుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ! ఇతర పాత్రల్లో గిరిబాబు , సత్యనారాయణ , రావుగోపాలరావు , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో శ్రావ్యంగా ఉన్నా బయట హిట్ కాలేదు . Excellent screenplay , direction and neat presentation . యూట్యూబులో ఉంది . శారద అభిమానులు తప్పక చూడతగ్గ సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……….. ( By దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ ధనపిశాచి కనీసం సినిమా థియేటర్ ఖర్చులైనా ఇప్పించేట్టు లేదు..!!
  • అక్కడ శ్రీచరణికి ఘన సత్కారం… ఇక్కడ అరుంధతిరెడ్డికి ఏది మరి..?!
  • ఏదీ పవన్ కల్యాణ్ ఫోటో..? ఏదీ ఆటల మంత్రి ఫోటో..? ఏం యాడ్స్ ఇవి..?!
  • ది గరల్ ఫ్రెండ్..! ఓ టాక్సిక్ లవ్ స్టోరీ… రష్మికను మరో మెట్టు ఎక్కించింది..!!
  • ఇప్పటి నగర ప్రణాళికలన్నా… త్రేతాయుగపు అయోధ్య ఎంతో నయం…
  • నా డెత్ సర్టిఫికెట్ పోయింది… దొరికినవారు దయచేసి సంప్రదించగలరు…
  • బంగారు బల్లి… వెండి బల్లి… కంచిలో వాటి తాపడాలూ మార్చేసేశారు…
  • స్టార్ల సినిమాలు కాదు… ఇదుగో ఇవి కదా రీరిలీజ్ చేయాల్సింది..!!
  • బండి రాకతో జుబ్లీ హిల్స్ ప్రచార చిత్రంలో హఠాత్ మార్పు… ఎలాగంటే..?
  • జుబ్లీ ఇరకాటంలో కేటీయార్..! మాగంటి తల్లి పేల్చిన కొత్త బాంబులు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions