పార్ధసారధి పోట్లూరి ………….. అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి గురించి సమాచారం ఎవరు ఇచ్చారు ? CIA చాలా కాలంగా వెతుకుతున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి గురించి ఇంటెలిజెన్స్ సమాచారం ఎవరు ఇచ్చారు ? వెల్ ! హాక్కాని నెట్ వర్క్ సిఐఏ కి సమాచారం ఇచ్చింది. పాకిస్థాన్ లోని అట్టోబబాద్ లోని మిలటరీ కంటోన్మెంట్ ఏరియాకి దగ్గరలోనే ఒక భవంతిలో ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లుగా అమెరికన్ సిఐఏ తెలుసుకోవడానికి 11 ఏళ్ల పట్టింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI సహాయ సహకారాలతోనే ఒసామా అమెరికాకి చిక్కకుండా అన్ని సంవత్సరాలు ఉండగలిగాడు. నేవీ సీల్స్ ఒసామాని మట్టుపెట్టాక ఇక జవహరి గురించి వేట మొదలుపెట్టింది…. కానీ రెండు రోజుల క్రితం వరకు సిఐఏ అల్ జవహరి జాడ కనుక్కోలేక పోయింది… అంటే పాక్ ISI ఎంత పటిష్టంగా తీవ్రవాదులకి రక్షణ కల్పిస్తున్నదో అర్థమవుతున్నది…
చాలా కాలంగా జవహరి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ సరిహద్దుల దగ్గర ఉన్న గిరిజన ప్రాంతాలలో ఉన్నాడని వచ్చిన ఇంటిలిజెన్స్ సమాచారం తప్పని సిఐఏ చాలా ఆలస్యంగా తెలుకుంది… నిజానికి జవహరి పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీలలో ఉంటూ వచ్చాడు తరుచూ అటూ ఇటూ మారుతూ… కానీ సిఐఏ పసిగట్టలేకపోయింది. దీని వెనుక హాక్కానీ నెట్ వర్క్, ISI ల పటిష్ట రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి.
అమెరికా – పాకిస్థాన్ ల మధ్య రహస్య ఒప్పందం ?
Ads
జవహరి ఆచూకీ తెలిపితే వచ్చే అక్టోబర్ లో జరిగే FATF సమావేశంలో పాకిస్థాన్ ని గ్రే లిస్ట్ నుండి తొలగించడానికి సహకరిస్తానని అమెరికా మాట ఇచ్చింది… దాంతో జవహరిని పాకిస్థాన్ నుండి కాబూల్ తరలించింది హక్కాని నెట్ వర్క్, అదీ రహస్యంగా ! జూన్ నెలలోనే జవహరి కుటుంబ సభ్యుల్ని తరలించిన ఈ గ్రూపు వారం రోజుల క్రితం జవహరిని కూడా రహస్యంగా కాబూల్ కి తరలించింది… సిఐఏ కి సమాచారం ఇచ్చింది… నిజానికి MQ రీపర్ డ్రోన్లని పాకిస్థాన్ నుండే ఆపరేట్ చేస్తున్నట్లు తెలిసింది. గత సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్ నుండి నాటో దళాలు వెనక్కి వెళ్ళిన తరువాత నుంచి ఖతార్ లోని దోహాలో అతి పెద్ద డ్రోన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని నిర్వహిస్తున్నది అమెరికా. దోహా నుండే ఆఫ్ఘనిస్తాన్ తో పాటు పాకిస్థాన్ సరిహద్దుల వరకు నిఘా పెడుతూ వచ్చింది…
జవహరిని పాకిస్థాన్ నుండి కాబూల్ కి తరలించడంలో హక్కానీ నెట్ వర్క్ పాత్ర చాలా ముఖ్యమయినది. ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్గత భద్రతని నిర్వహిస్తున్నది హాక్కానీ నెట్వర్క్… అన్ని చెక్ పోస్ట్ లు కూడా హాక్కానీ నెట్వర్క్ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి అల్ జవహరిని కాబూల్ కి తరలించిన విషయం తాలిబన్లకి తెలియకుండా పోయింది. ఇక జవహరి ఉంటున్న కాబూల్ లోని ఆ ఇంటి GPS కో- ఆర్డినేషన్ ని నేరుగా సిఐఏ కి అందించింది ఐఎస్ఐ… దాంతో అల్ జవహరిని చంపడం చాలా తేలికగా జరిగిపోయింది. కానీ ఈ ఆపరేషన్ విషయం తాలిబన్లకి తెలియదు. అసలు జవహరి కాబూల్ లో ఉంటున్నట్లు తమకి తెలియనే తెలియిదని తాలిబన్లు అంటున్నారు… అంటే ఈ మొత్తం ఆపరేషన్ ని ఐఎస్ఐ, దాని ఉగ్రవాద గ్రూపు హక్కానీ ఎంత పకడ్బందీగా నిర్వహించాయో అర్ధం అయిపోతున్నది…
పాకిస్థాన్ ప్రమాదంలో పడిందా ?
జవహరిని పాకిస్థాన్ లో ఉన్నప్పుడే సమాచారం ఇచ్చి చంపవచ్చు ఐఎస్ఐ… కానీ అక్కడ జరిగితే మిగతా ఉగ్ర గ్రూపులు తిరుగుబాటు చేస్తాయి పాక్ సైన్యం మీద… దాంతో జవహరిని కాబూల్ తరలించి, ఇన్నాళ్లు ఆశ్రయమిస్తున్న నెపం తాలిబన్ల మీద నెట్టి వేసింది పాకిస్థాన్… కానీ రహస్యం దాగదు. ఐఎస్ఐ సహకారంతో హాక్కానీ ఈ పని చేసింది అని తెలుసుకోవడానికి అల్ ఖైదాకి పెద్దగా సమయం అక్కరలేదు… త్వరలో పాకిస్థాన్ లో భారీగా విధ్వంసం జరగవచ్చు…
చేతిలో డాలర్ రిజర్వ్ లు లేనందువల్ల తమతో స్నేహంగా ఉండే దేశాలకి పాకిస్థాన్లోని వివిధ సంస్థలని తాకట్టు పెట్టి డాలర్లు అప్పుగా తీసుకోవాలనే ప్రతిపాదన నెల క్రితమే పాక్ ప్రభుత్వం ముందుకు తెచ్చింది… కానీ ఈలోపు అల్ జవాహిరి ఉదంతం తెర మీదకి వచ్చి కొంచెం ఊరటనిచ్చింది. అసలు FATF గ్రే లిస్ట్ నుండి పాకిస్థాన్ ని తొలగించకుండానే, ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ పాకేజీ కోసం పాక్ ప్రభుత్వంతో ఎలా సంప్రదింపులు చేస్తుంది ? అంటే ముందు నుండి అంతా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతున్నది అన్నమాట !
అంతా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతున్నది అని చెప్పే మరో పెద్ద ఉదాహరణ డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి ఏకంగా 10 రూపాయలు బలపడడం… అదీ అల్ జవహరి ని మట్టుపెట్టిన రెండవరోజే ఇది జరగడం యాదృచ్చికం కానే కాదు… ఒక రూపాయి లేదా రెండు రూపాయలు బలం పుంజుకోవడం జరుగుతుంది ఎక్కడయినా, కానీ ఒకే రోజులో 10 రూపాయలు బలపడడం ఎలా సాధ్యపడింది ? హఠాత్తుగా పాకిస్థాన్ నుండి ఎగుమతులు పెరిగాయా ? లేదే ! పోనీ పాకిస్థాన్ స్టేట్ బాంక్ బహిరంగ మార్కెట్లో డాలర్లు అమ్మకానికి పెట్టిందా ? లేదు… మరి ఒక్క రోజులో డాలర్ తో 10 పాకిస్థాన్ రూపాయలు ఎలా బలపడింది ? ఆగస్ట్ 2 వ తేదీన ఒక డాలర్ కి 238 పాకిస్థాన్ రూపాయలుగా ఉండగా, అది ఆగస్ట్ 3 వ తేదీన అంటే నిన్న ఏకంగా పది రూపాయలు బలపడి 228 గా అయిపోయింది… ఇది ఎలా సాధ్యపడింది ఒక్క రోజులో ?
Share this Article