తండ్రి డీఆర్డీవోలో డాక్టర్ కమ్ సైంటిస్ట్, తల్లి కూడా న్యూరో కెమిస్ట్రీలో డాక్టర్… తను కూడా డాక్టరీ చదివింది… సీబీఎస్‌ఈ మ్యాథ్స్ టాపర్ ఓ సంవత్సరం… 2017 మిస్ వరల్డ్ pageant విజేత… స్వరాష్ట్రం హర్యానా… పేరు మానుషీ చిల్లర్… ఆ నేపథ్యం నుంచి మోడలింగ్, యాక్టింగ్ వృత్తిని ఎంచుకుంది… మోడలింగు వరకూ వోకే, కానీ యాక్టింగ్‌కు కేవలం అందం సరిపోదు కదా…
2022లో తొలిసారిగా సామ్రాట్ పృథ్వీరాజ్‌లో సంయోగిత పాత్ర ద్వారా వెండితెరపైకి ప్రవేశించింది… ఏమో, పెద్దగా ఆమెకు ఉపయోగపడలేదు… తరువాత ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించింది కానీ అదీ ఆమెకు యూజ్ కాలేదు… ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ పేరిట రూపొందిన సినిమాలో వరుణ్ తేజ సరసన నటించింది… చేతిలో మరో రెండు సినిమాలున్నాయి కానీ ఆమె ఆశలన్నీ ఈ వాలంటైన్ సినిమాపైనే…
Ads
ఇదే సినిమా వరుణ్ తేజను హిందీ సినిమా రంగానికి తీసుకుపోతోంది… మన హీరోలు గతంలో బాలీవుడ్‌లో పెద్దగా రాణించలేదు… కమల్‌హాసన్ వంటి నటులే అక్కడ నెగ్గలేక వాపస్ వచ్చారు… హిందీ సినిమా మన సౌత్ హీరోయిన్లకే తప్ప హీరోలకు కాదు… తొలిసారి దాన్ని బ్రేక్ చేసింది రానా, ప్రభాస్… బాహుబలి ద్వారా… తరువాత ప్రభాస్ కంటిన్యూ చేశాడు… కానీ పాన్ ఇండియా సినిమాలతోనే తప్ప స్ట్రెయిట్ బాలీవుడ్ హీరోగా మాత్రం కాదు… రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్ కూడా పాన్ ఇండియా స్టార్లయ్యారు తప్ప బాలీవుడ్ హీరోలు కాలేదు, కాలేరేమో…
ఇప్పుడు వరుణ్ తేజ కూడా తెలుగు- హిందీ ద్విభాషా చిత్రంతోనే జాతీయ తెర మీదకు ప్రవేశిస్తున్నాడు… తన కెరీర్‌లో కూడా హీరోయిన్ మానుషి చిల్లర్ కెరీర్‌లాగే కొన్నాళ్లుగా ఒడిదొడుకులున్నయ్… బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉండీ ఎందుకో అంత పెద్ద స్టార్‌డమ్ సంపాదించలేదు… మొదట్లో కంచె బాగుంది, తరువాత ఫిదా సూపర్ హిట్… తరువాత అంతరిక్షం బాగానే ఉంది గానీ కమర్షియల్ సక్సెస్ కాదు… ఎఫ్2, ఎఫ్3 సినిమాలు కామెడీ బేస్, వెంకటేష్‌తో కలిసి చేశాడు తప్ప తన సోలో పర్‌ఫామెన్స్ కాదు… గద్దలకొండ గణేష్, ఘని, గాండీవధారి అర్జున వరుసగా నిరాశపరిచాయి…
ఈ స్థితిలో తను కూడా ఈ ఆపరేషన్ వాలంటైన్ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు… తన కెరీర్‌కు ఇది కీలకమైంది… సరే, మంచి బ్యానర్, ప్రజెంట్ ట్రెండ్ దేశభక్తి, ఎయిర్‌ఫోర్స్ కథ… ఈమధ్యే హృతిక్ కూడా ఇదే ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఫైటర్ అని ఓ సినిమా తీశాడు… (యూనిఫామ్‌లో ఉండి దీపిక పడుకోన్, హృతిక్ లిప్‌లాక్ ముద్దుపెట్టుకోవడం మీద ఓ వివాదం కూడా నడిచింది కదా…) ట్రెయిలర్ కూడా బాగుంది… గ్రాఫిక్స్, బీజీఎం గట్రా బాగానే కుదిరినట్టు కనిపిస్తోంది… ఐతే ఆర్మీ బేస్డ్ కథలన్నీ సక్సెస్ కావాలనేమీ లేదు… వరుణ్‌కు ఇది ఉపయోగపడాలనే ఆశిద్దాం…
ఐతే తను ఎక్కడో మాట్లాడుతూ… ఈ కథ కొన్ని రియల్ ఇన్సిడెంట్ల మీద ఆధారపడి ఉందని చెప్పాడు వరుణ్ తేజ… పర్టిక్యులర్‌గా పుల్వామా దాడి తరువాత ఎయిర్ ఫోర్స్ ప్రతీకార ఆపరేషన్ల ఆధారంగా ఈ కథ రాసుకున్నట్టు ట్రెయిలర్ చూస్తేనే అర్థమవుతోంది… కానీ బాలాకోట ఎయిర్ స్ట్రయిక్స్ ఎపిసోడ్‌లో ఈ ఆపరేషన్ వాలంటైన్ ఎక్కడా కనిపించలేదు… పుల్వామా తరువాత ఎయిర్ ఫోర్స్ చేపట్టిన పెద్ద ఆపరేషన్లలో బాలాకోట ఎయిర్ స్ట్రయిక్స్ ఓ పార్ట్ కావచ్చు… వినిపించిన వార్తలను బట్టి ఒక కథ రాసుకుని ఉంటారు… ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రను హీరోయిక్‌గా చిత్రించి ఉంటారు… ట్రెయిలర్ చెబుతున్నదీ అదే…
Share this Article