ఒరేయ్ బుజ్జిగా… ఈ సినిమా నిర్మాత ఎవరో గానీ… వెంటనే ఓ వంద థియేటర్లు దొరకబుచ్చుకుని రిలీజ్ చేసేసుకోవడం బెటర్… ఇప్పట్లో పెద్ద కొత్త సినిమాలు వచ్చేవి ఏమీ లేవు… ఏదో వచ్చేవాళ్లు చూస్తారు, చూసేవాళ్లు చూస్తారు… కొన్ని డబ్బులైనా రికవరీ అవుతాయి… ఏం..? సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు ఏం తక్కువ..?
అదే కామెడీ… అదే టైంపాస్ పల్లీ బఠానీ బాపతే కదా… ఆఫ్టరాల్ సాయితేజ సినిమాలో ఒక్కతే హీరోయిన్… కానీ ఈ బుజ్జిగాడి సినిమాలో ఎంచక్కా మాళవిక, హెబ్బా… సరదాసరదాగా కామెడీ ఆఫ్ ఎర్రర్స్… అదేలెండి, ఫేక్ ఐడెంటిటీతో ఫన్ క్రియేట్ చేసే పాతచింతకాయ పచ్చడే…
Ads
బాబూ, థియేటర్లలోకి రారా బుజ్జిగా అనడానికి ఓ రీజన్ ఉంది… సినిమా దురదృష్టం పాడుగాను… టీవీల్లో మరీ ఘోరమైన రేటింగ్స్ వచ్చి, తీవ్రంగా నిరాశపరచింది…
టీవీల్లో కూడా ఫ్లాపయ్యాక, మళ్లీ థియేటర్లకు వచ్చి ఎవడు చూస్తాడు అంటారా..? ఏమో… గుర్రమెగురా వచ్చు… పంట ఎలాగూ పోయింది, కనీసం పరిగె ఏరుకుంటే తప్పేముంది..? పైగా పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు, హీరోలు చాలా కాన్ఫిడెంటుగా చెబుతున్నారు కదా… మన ప్రేక్షకులు థియేటర్లలో మాత్రమే సినిమా చూడటాన్ని ఇష్టపడారు అని… పోనీ, అదీ పరీక్షించి చూడనీ ఒకసారి…
ఇంతకీ టీవీ రేటింగ్స్ ఎన్ని అనేనా మీ డౌటు..? జస్ట్, 3.42 మాత్రమే… (హైదరాబాద్ బార్క్ కేటగిరీ)… చాలా ఘోరమైన ఫ్లాపు ఫాఫం… ఈ చార్టు చూస్తే మీకే అర్థమవుతుంది… మరీ ప్రేక్షకులు రాజ్ తరుణ్ చెవిలో కుంకుమపువ్వు పెట్టారని…! అంటే ఆ సీరియల్తో సమానమైపోయింది… ప్చ్, పాపం, రాజ్ తరుణ్… ఎంత తొక్కులాడినా కెరీర్ మళ్లీ పట్టాలెక్కడం లేదు…
నిజానికి జనం ఇంకా థియేటర్లలోకి వెళ్లే స్థితి లేదు కాబట్టి… అందరూ ఓటీటీల్లో చూడలేరు కాబట్టి…. టీవీల్లో వచ్చినప్పుడు ఎక్కువ మంది చూస్తారని అనుకుంటాం కదా… ఐనా సరే, ఈ సినిమా మరీ ఇంత ఘోరంగా రేటింగ్స్ తెచ్చుకోవడం ఏమిటో అర్థం కాదు… సరే, దాన్నలా వదిలేస్తే… ఈటీవీ వాడితో పోటీపడి కామెడీ, మ్యూజిక్ షోలలో సక్సెస్ కొట్టాలని ప్రయత్నించే జీవాడు మళ్లీ మళ్లీ ఫ్లాప్ అయిపోతున్నాడు రేటింగుల్లో…
ఈ చార్జు చూశారు కదా… నాగబాబు సమర్పించే బొమ్మ అదిరింది షో ప్రతివారం లోపలకే తప్ప, పైకి లేవడం లేదు… ఎక్కడో ఏదో భారీగా తేడా కొట్టేస్తోంది… తను ఎంచక్కా యూట్యూబులో ఖుషిఖుషిగా అని స్టాండప్ కామెడీ షో రన్ చేసుకుంటున్నాడు… ఇంకోవైపు ఈ బొమ్మ చెదిరింది… మరీ మూడు రేటింగ్స్ రావడం విస్మయకరం… ఫాఫం, శ్రీముఖి రెమ్యునరేషన్ అయినా గిట్టుబాటు అవుతుందో లేదో డౌటే… ఇక వాళ్ల మ్యూజిక్ షో సరిగమప కూడా అదే స్థాయి రేటింగ్స్ తెచ్చుకుంటూ నానాటికీ చతికిలపడుతోంది… ఇతర భాషల్లో, ఇదే టీవీలో బాగా హిట్టయిన ఈ షో తెలుగులో మాత్రం ఎందుకు పడకేసింది..? తేడా ఎక్కడుందబ్బా..? ఏమయ్యా ప్రదీపూ… నీకేమైనా అర్థమవుతోందా..?! కనీసం నీ రెమ్యునరేషన్ అయినా రికవరీ అవుతుందా లేదా..?
Share this Article