ప్రతీ నాయకుడిలోనూ మైనసులుంటయ్, ప్లస్సులుంటయ్… గెలిస్తే ఆహా ఓహో అని పల్లకీలు మోసే లోకమే, ఓడినప్పుడు చేతకానివాడనీ, చెడ్డవాడనీ ఆడిపోసుకుంటుంది… అంతకుముందు మంచిగా కనిపించిన కొన్ని లక్షణాలను విస్మరిస్తుంది… సేమ్, ట్రంపు విషయంలోనూ..! ఏ మెరిట్ లేకుండానే అమెరికా అధ్యక్షుడయ్యాడా..? కాదు కదా..! ఈసారి ఎన్నికల్లో తను పోరాడిన పద్ధతులు మనకు తప్పుగా తోచవచ్చుగాక.., తన పాలన పద్ధతుల్లో మనకు బోలెడు తప్పులు కనిపించవచ్చుగాక… తను అంతిమంగా ఫెయిల్ అయిపోవచ్చుగాక… రేప్పొద్దున సెనెట్ తనను అభిశంసించవచ్చుగాక… కానీ తను ఇక్కడి దాకా సాగించిన ప్రస్థానం ఓసారి నెమరు వేయదగిందే… మిత్రుడు Jagannadh Goud…
మారుతున్న ప్రపంచానికి అనుగుణం గా అమెరికా అధ్యక్షుడు కూడా మారాలని నమ్మాడు. అధ్యక్షుడు స్మార్ట్ ఫోన్ వినియోగానికి అనుమతి లేకపోయినా పర్మిషన్ తీసుకొని అనునిత్యం ప్రజలతో ట్విట్టర్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉండేవాడు. కార్పొరేట్ మాఫియా అంతా డెమోక్రాట్ పార్టీ వైపే అని పాలు తాగే పసివాడి నుంచి ఫౌచి వరకు అందరికీ తెలుసు. బైడెన్ గెలవలేదు, నీవు ఓడిపోయావ్ కాబట్టే అతను గెలిశాడు అని ప్రపంచం అనుకుంటుంది. 100 యేండ్ల క్రితం వచ్చిన ఫ్లూ పాండెమిక్ లో మీ నాయనమ్మని కోల్పోయావ్, ఆ 100 యేండ్ల తర్వాత వచ్చిన కరోనా పాండెమిక్ వలన నీవు అధ్యక్ష పదవిని కోల్పోయావ్. విధి విచిత్రం ఏమిటంటే చైనా నిన్ను అధ్యక్ష పదవి నుంచి దించటానికి అమెరికాతో సహా కరోనాని ప్రపంచం అంతా అంటించినా… ప్రపంచం నిన్నే గేలి చేస్తోంది. నీలో లోపాలని నేను సపోర్ట్ చేయను కానీ నిన్ను సపోర్ట్ చేస్తా. A fare well to you Donald J Trump ………….. జగన్ (వ్యక్తిగత అభిప్రాయం)
Ads
Share this Article