యుగపురుష్, శకపురుష్, అవతారపురుష్, తెలుగుజాతి మూలపురుష్…. అని కొన్నిరోజులుగా మీడియా, ఒక పార్టీ తెగపొగుడుతున్న ఎన్టీయార్ మరో కోణం లేదా..? రాస్తే ఒడవనంత ఉంది… రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు Gurram Seetaramulu… ఏమంటాడంటే..?
“అవతార పురుషుడివి సావి” కొందరు జనాలకు మతిమరుపు అనుకుంటారు; కాలం నమోదు చేసిన చేదు నిజాలు దాచేస్తే దాగవు, మూసేస్తే మరుగున పడవు. ఎన్టీఆర్ కు వందేళ్ళు, అందరూ ఆయన తిండి, బట్ట, కట్టు, బొట్టు గురించి మాట్లాడుకుంటారు. నేను కల్చరల్ స్టడీస్ చదువుకున్నా, నేను ఏమి చూసినా నా ఫోకస్ అక్కడే ఉంటది…
రామారావు మూలంగానే తెలంగాణ పౌర సమాజం బియ్యం తింటోంది అని ఆయన రాజకీయ వారసత్వాన్ని కబళించిన చంద్రబాబు అంటున్నాడు. పాపం, నిజం ఏమిటి అంటే ఇరవై వేల రకాల వడ్లు తెలంగాణ, బస్తర్ లో వేల ఏళ్ళుగా పండించేవారు అనీ, దానికి సంబందించిన జీనోమ్ (జర్మిప్లాజమ్) ఎక్కడో ఇంకా పదిలంగా ఉందని ఈమధ్య ఒక పెద్ద నాయకుడి ఇంటర్వ్యూలో చదివా… వడ్ల గురించి మాట్లాడుకుంటే… ఈమధ్యనే కనుమరుగు అయిన రవ్వా శ్రీహరి సర్ వడ్ల రకాలు చెప్పేవారు.
ఎవరో రాసారు తెలుగు దేశం వచ్చాకనే బహుజనులు రాజకీయాలలోకి వచ్చారు అని… అది నిజం కాదు, వాళ్ళు అధికారంలోకి వచ్చాకనే ‘ఊచకోత’ అనే ఫినామినా వినబడుతోంది. నక్సల్స్ దేశభక్తులు అన్నారు అన్నగారు. తర్వాత ఆటా మాటా బంద్’ కూడా అన్నాడు… విప్లవకారులను చంపడం లో హిట్లర్ పరంపర చంద్రబాబుది…
ఇక ఆయన రాజకీయ హత్యలు ఇవీ… “బెజవాడ నడిబొడ్డున పింగళి దశరథరామ్ ని నరికి చంపి, మనకు అడ్డొస్తే పాత్రికేయుణ్ణి అయినా నరికి చంపుతాం… అనే చైతన్యం ఇచ్చావు, నీ బలమే కదా చెంచురామయ్య అనే మరొక అవతార పురుషుడు ఈ లోకానికి తెలిసింది. దగ్గుబాటి చెంచురామయ్యను కారంచేడు కారణంగా అవతార పురుషుడిని చేసావు, ఆయన మనవడు, ముని మనవడు రోజుకొక్క సినిమా చూపిస్తున్నారు.
ఊరికొక కంచికచర్ల కోటేషులు అవతనం అవుతున్నారు. స్టూడియోలు, పేపర్లు, కార్పొరేట్ బడులు, జూబ్లి, బంజారా హిల్స్ లో సంచార తెగలను తరిమేస్తిమి, ప్రపంచ పెద్ద ఫిలిం స్టూడియో, సైబర్ టవర్ నిర్మాణం, యెన్ కన్వెన్షన్, జయభేరి లాండ్ మాఫియా…. ఇవన్నీ తవరు ఇచ్చిన అలుసు మూలంగానే సాధ్యం అయ్యాయి.
ఆఖరికి మా జొన్నరొట్టె మీద కూడా కన్నేసి, హైవే దాబాల మీద క్యాబరే ఆటలు పెడితిరి సావీ… మల్లెప్పుడు తిరిగి వస్తావు ? మామను వెన్నుపోటు పొడిచిన అల్లుడు మొన్నటి దాకా భ్రమరావతి అనే చంద్రశోక వనంలో నార బట్టలు కట్టుకొని ఉన్నడు. ఇప్పుడు అశోకవనంలా మారిన భ్రమరావతికి మహానాడులో పేటియం ద్వారా చందాలు అడుగుతున్నాడు.
మళ్ళీ రాకూడదూ… ఇప్పుడు తెలుగు భాష సంస్కృతి చచ్చిపోయేలా ఉంది. మీరు వీళ్ళను ఎక్కడికో తీసుకొని పోవాలి అనుకున్నారు . ఇక్కడే ఉంటున్నారు. మర్చి పోయా… మా బాలంకుల్ భాష ఎంత బాగుంటదో..!? ఎంత మర్యాద, మన్నన, ముఖ్యంగా స్త్రీల మీద ఎంత గౌరవమో… పాపం…. మీకు లాగులు కూడా ఏసుకోవడం రాదు అన్నాడు రామోజీరావు . ఇప్పుడు శక పురుషుడికి శత వందనం అంటూ అవతార పురుషుడివి నువ్వే అంటున్నాడు. అయినా సరే ఝై పాతాళ భైరవి ఝై ఎన్టీఆర్….
Share this Article
Ads