.
రోటీలు, బ్రెడ్డులు, నాన్స్, పూరీలు ఎట్సెట్రా బ్రెడ్ కేటగిరీలో టేస్ట్ అట్లాస్ వాడు మన బటర్ గార్లిక్ నాన్‌కు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు, టాప్ 100లో పదిపన్నెండు వెరయిటీలను కూడా చేర్చాడు, గుడ్ అనుకున్నాం కదా…
టోటల్‌గానే టాప్ 100 వరల్డ్ డిషెస్ జాబితాలో మన వంటలు ఏమైనా ఉన్నాయా..? అదే చూస్తుంటే, ర్యాంకుల్లో ఒక్కొక్కటీ చెక్ చేస్తూ, దిగువకు వెళ్తూ ఉంటే… 29వ ప్లేసులో ముర్గ్ మఖానీ కనిపించింది… నిజానికి అది స్ట్యూ… ఆధరువు…
Ads
ఒరేయ్, ఒరేయ్, వరల్డ్ ఫేమస్ మా హైదరాబాదీ బిర్యానీ ఏమైందిరా బాబూ అని వెతికితే… అదుగో 31వ స్థానంలో కనిపించింది… ప్చ్, టేస్ట్‌ఫుల్ డిషెస్ ఎంపికలో నీ టేస్ట్ ఏడ్చినట్టుందిరా అబ్బాయ్ అనుకుని జాబితాలో మరింత దిగువకు వెళ్తే…
ఎక్కడో 97వ ప్లేసులో చికెన్-65 పేరు కనిపించింది… తరువాత చివరి, అంటే 100 వ ర్యాంకులో ఖీమా ఉంది… అంటే మొత్తం టాప్ వరల్డ్ 100 డిషెస్‌లో మనవి నాలుగు మాత్రమే… అందులోనూ మెయిన్ కోర్స్ రైస్ డిష్ కేవలం హైదరాబాదీ బిర్యానీయే…
ప్చ్, అసలు ఇండియా వీగన్ స్పెషల్ కదా, పోనీ, వెజ్ డిషెస్ కేటగిరీ చూద్దాం… వావ్… ఆరో ప్లేసు దాల్ తడ్కా… 9వ ర్యాంకు మలై కోఫ్తా… పదో ప్లేసులో మిసాల్ అని మహారాష్ట్ర రెసిపీ… అక్కడిదే పావ్ బాజీకి 16వ ర్యాంకు, మహారాష్ట్రకే చెందిన మిసాల్ పావ్‌కు 19వ ర్యాంకు, పాలక్ పన్నీర్ 29, ఛనా మసాలా 46, రాజ్‌మా 51, మటర్ పన్నీర్ 58, రాజ్‌మా చావల్ 63, దాల్ మఖానీ 80 (తులసి గబార్డ్ ఫేవరెట్ డిష్)…
వంద వెజ్ డిషెస్‌లో 11 మనవే… కానీ మహారాష్ట్ర, పంజాబ్ వంటకాలే అధికం… ప్చ్, ఒక్కటీ సౌత్ ఇండియన్ వెరయిటీ లేదు సుమీ… పోనీ, ఇంకేదైనా కేటగిరీలో సౌత్ ఇండియా రెసిపీలు ఉన్నాయా చూద్దాం… కేక్స్ కేటగిరీలో టాప్ 100లో జీరో… ఐనా మనకూ కేకులకూ పడదు కదా… సరే…
స్ప్రెడ్స్‌గా పిలవబడే చట్నీలు, తొక్కుల్లో ఏమైనా ఉన్నాయా..? ఉన్నయ్… కొత్తిమీర చట్నీ 12, 21వ ప్లేసులో మామూలు చట్నీ ఉన్నయ్… మామిడికాయ తొక్కు 24వ ప్లేసులో, 35వ ర్యాంకులో కొబ్బరి చట్నీ, 38వ ప్లేసులో గ్రీన్ చట్నీ కనిపించాయి… గ్రీన్ చట్నీ అంటే ఆకుకూరలతో చేసుకునే చట్నీ… అల్లం చట్నీకి 40వ ర్యాంకు, 45వ ప్లేసులో పుదీనా చట్నీ, ఉల్లి చట్నీ 51, వెల్లుల్లి చట్నీ 55, మిరపకాయ చట్నీ 57, వేరుశనగ చట్నీ 59, 82వ ర్యాంకులో రెడ్ కేప్సికమ్ చట్నీ, 86వ ప్లేసులో దోసకాయ చట్నీ, 87వ ప్లేసులో ఎర్రమిరప చట్నీ, బీట్రూట్ చట్నీ 93, 98వ ప్లేసులో వంకాయ చట్నీ, అంబా అని పిలిచే ఆవకాయ 99, బాదాం చట్నీ 100 ప్లేసు….
వావ్… ఇతరత్రా ఏ డిషెస్ సంగతి ఎలా ఉన్నా సరే, పచ్చళ్లు, తొక్కుల్లో మనల్ని కొట్టేవాడు లేడన్నమాట… టాప్ 100లో 18 మనవే… మరి తెలుగువాడి పుంటికూర, అనగా గోంగూర తొక్కుది 110 వ ర్యాంకు… టాప్ 100 దాటాక ఇంకా చాలా ఉన్నయ్… అవి ఇక్కడ అప్రస్తుతం… చత్తీస్‌గఢ్‌లో చేసుకునే ఎర్ర చీమల చట్నీ కూడా ఉంది జాబితాలో…
టాప్ 100 సూప్స్‌లో కూడా ఇండియా వంటకం ఒక్కటీ లేదు, పోనీలే, సూప్స్‌కు మనవాళ్లు పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు కదా, జానేదేవ్… ఛీజ్, మీట్, పౌల్ట్రీ, సలాడ్స్, పాస్తా, నూడుల్స్, సీఫుడ్, స్నాక్స్, పేస్త్రీలు, డంప్లింగ్స్, శాండ్‌విచెస్… ఇలా బోలెడు కేటగిరీల్లో ర్యాంకింగ్స్ ఇచ్చాడు వాడు..
అన్నట్టు స్నాక్స్ కేటగిరీలో మామూలు దోసకు 31, ఛాట్ 40, మసాలా దోస 44, పాపడీ చాట్ 63వ ర్యాంకులు, అయ్యో మరి ఇడ్లీ, వడ, వడ పావ్ ఎట్సెట్రా..? ఎహె, ఊరుకొండి…!!
Share this Article