ఈ సృష్టిలో ఆడ, మగ రెండే ఉంటయ్… మనుషులు ద్విలింగ జీవులు… అంతే… మధ్యలో వావీవరుసా అనేది మనుషులు ఏర్పాటు చేసుకున్న సామాజిక ఆంక్షలు… అంతే… ఈ ఒప్పందాల్ని, ఈ ఆచారాల్ని, ఈ ఆనవాయితీల్ని, ఈ మర్యాదల్ని ప్రకృతి గుర్తించదు…. ఇలా అనుకునేవాళ్లు కోకొల్లలు… వావీవరుసా అనేది సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, జాతిని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది అనేది మనకు చరిత్ర చాలా సందర్భాల్లో చెప్పింది… సొంత కూతురు, మనమరాలు, మనమడు, తల్లి, తండ్రితో లైంగిక సంబంధం అనేది వినడానికి, చదవడానికి మనకు దారుణంగా అనిపిస్తుంది… Incest sexual relations అంటారు వీటిని… పాశ్చాత్య సమాజాల్లో పెద్ద వార్తలు కావు ఇవి… బోలెడు ఉదాహరణలు… మనం ఇంకా సింగర్ సునీత రెండో పెళ్లి దగ్గరే ఆగిపోయి గుండెలు బాదుకుంటున్నాం…
పాశ్చాత్య సమాజాల్లో నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు… అనే దశ దాటిపోయి… నీ పిల్లల ద్వారా నా పిల్లలు అనే స్టేజ్ కూడా చూస్తున్నాం… ఓ పద్దతీపాడూ ఉండే కుటుంబ వ్యవస్థ లేని సమాజాాల్లో ఇవి కనిపిస్తాయి… ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే… ఓ వార్త… అదీ టైమ్స్ ఆఫ్ ఇండియా తెలుగు అనువాద వెబ్ సైట్లో వచ్చిన ఒక వార్త… … అందులో రష్యాలో ఓ 35 ఏళ్ల వనిత… రెండో పెళ్లి చేసుకుంటుంది… భర్తకు ఆల్రెడీ కొడుకు… అంటే ఆమె తల్లి వరుస… కానీ ఆమె వాడితో సంబంధాలు పెట్టుకుని, ఏకంగా పెళ్లే చేసుకుంటుంది… ఇప్పుడు వాళ్లకు ఓ బిడ్డ… ఆమె ఇన్స్టాలో పెట్టుకుని బహిరంగంగా, ఘనంగా చాటుకుంది… అదీ వార్త…
Ads
వాస్తవానికి ఆమె జస్ట్, పినతల్లి… సొంత తల్లులతోనే సంబంధాలు కూడా ఉంటయ్…. వావీ వరుసా లేని సంబంధాలు మనకు కొత్తేమీ కాదు, కానీ రహస్యం… మన సమాజం అంగీకరించదు కాబట్టి… సరే, ఆ రష్యన్ వనిత చేసింది తప్పే అనుకుందాం… భర్త కొడుకుతో సంబంధం, పెళ్లి, సంతానం… వినడానికి ఎలా ఉన్నా… అది ఓ వార్త… అదే ఈ వెబ్ సైట్ కూడా రాసింది… కానీ ఇలాంటి వార్తల్ని రాయడం ద్వారా మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నదీ ఆ దిక్కుమాలిన వెబ్ సైట్ అంటున్నది మరో వెబ్ సైట్…
మనం సంధి దశలో ఉన్నామా..? లైంగిక సంబంధాల్లో ఏది సక్రమం, ఏది అక్రమం, ఏది అనైతికం, ఏది అరాచకం అని ఇంకా మీమాంసపడే స్థితిలోనే ఉన్నామా..? వావీవరుసా అనేది నాన్సెన్స్, ఆడామగా అనేదే అల్టిమేట్ అనే దశ వైపు వెళ్తున్నామా అనేది చర్చ… ఏదో నవలలో చదివినట్టు గుర్తు… ఏదో ఓడలో వెళ్తూ, ప్రమాదానికి గురై ఓ తల్లి, ఓ కొడుకు ఓ ద్వీపంలో చిక్కుపడిపోతారు… వాళ్లకంటూ ఓ సమాజం సృష్టించుకోవాలి… అప్పుడు వాళ్లేం చేస్తారు అనేదే ఆ నవల కథాంశం… అది అనైతికమా..? మానవసహజమా..? లేక జీవసహజ లక్షణమా..? ఇదీ పెద్ద చర్చ… మన దగ్గరే తీసుకుందాం… పిన్ని, మేనత్త ఎట్సెట్రా లైంగిక సంబంధాలు నిషిద్దం… అదే సొంత అక్క బిడ్డ లేదా సొంత మేనమామ బిడ్డతో సంబంధాలు ఆమోదనీయం, ప్రయారిటీ… కొన్ని మతాల్లో సొంత తల్లి, సొంత తండ్రి బిడ్డలు తప్ప వేరే ఎవరైనా సరే… ఆమోదనీయం… ఈ పద్ధతులు రావడానికి చారిత్రిక అవసరాలు బోలెడు ఉండే ఉంటయ్… అందుకే చెప్పేది మనం ఇంకా సింగర్ సునీత దగ్గరే ఆగిపోయాం అని…!!
Share this Article