మీ ఇష్టమొచ్చిన చోట పంట అమ్ముకొండి… నేనయితే కొనను, ఇప్పటికే చేతులు కాలినయ్… అసలు పంటలు కొనడం ప్రభుత్వం పనే కాదు… ఊళ్లల్లో కొనుగోలు కేంద్రాల్ని మూసేయండి………. ఇదే కదా, కేసీయార్ నిర్ణయం… అదే కదా చెప్పింది… సరే, వ్యాపారులు సరైన ధరకు కొనరు, అసలు కొన్నిసార్లు ఏ ధరకూ కొనరు… మరోవైపు మిత్తీలు, ఖర్చులు తరుముతుంటాయి… మరి రైతు ఏం చేయాలి..? హహహ… దానికి మార్గం సారు గారి సొంత పత్రిక నమస్తే తెలంగాణ రాసేసింది నిన్ననే…
……. కేసీయార్ చెబితేనే తెలంగాణ సన్నాలు వేశాం, ఎక్కువ ధర ఇస్తానన్నాడు, ఏదీ, మళ్లీ మాట్లాడడు ఏందీ అనే ప్రశ్న రైతుల నుంచి వస్తోంది కదా… వేరే రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి మస్తు ధరలకు కొనుక్కుపోతున్నారు అని ఆమధ్య వార్తలు రాయించబడ్డయ్… ఇప్పుడిక ఏకంగా… వాడూవీడూ కొనడం ఏమిటి..? రైతులే వడ్లను మిల్లింగు చేయించి, పట్టణాలకు వెళ్లి బియ్యాన్ని అమ్ముకుంటే సరి, మస్తు ఫాయిదా అంటున్నది నమస్తే…
Ads
ఏవో కొన్నిచోట్ల రైతులు ఈ ప్రయోగం చేస్తే, ఇక ఇదే శిరోధార్యం అన్నట్టుగా ప్రచారం చేస్తే ఎలా..? ఒక ఆధునిక సటాకే రైస్‌మిల్లులో పట్టే బియ్యానికీ, సాధారణ వడ్ల గిర్నీల్లో పట్టే బియ్యానికీ బోలెడంత తేడా ఉంటుంది… పెద్ద మిల్లులో ఔట్ టర్న్ ఎక్కువ… ఇసుక, దుబ్బ, మెరిగె, నూక ఉండవు… ఆ బియ్యాన్ని నేరుగా స్టవ్వు మీద పెట్టేసుకోవడమే… ఒక రైతు తన పంట మొత్తాన్ని మిల్లింగ్ చేయించి, తనే అమ్ముకోవడం అనేది చాలా పెద్ద టాస్క్…
సరే, దీన్ని ఇలా వదిలేస్తే… మొక్కజొన్న రైతు ఏం చేయాలి..? పోనీ, ఆముదం రైతు గతేమిటి..? మిర్చి వేసిన రైతు, పసుపు వేసిన రైతు ఎటు పోవాలి..? నాలుగెకరాల్లో మిర్చి వేసిన రైతు… పట్టణాలకు తీసుకుపోయి ఎన్ని కారం పొట్లాలు అమ్మాలి..? పసుపు రైతు ఎన్ని పసుపు పొట్లాలు ఎన్ని ఇండ్లు తిరిగి అమ్ముకోవాలి..? అసలు ఇది అయ్యే పనేనా..?
ఇదొక సర్కిల్… పంట పండించేవాడు పంట అమ్మేసుకుని, కొత్త పంట పనుల్లో నిమగ్నం అవుతాడు… పెట్టుబడి పెట్టి ఎవరో ఓ వ్యాపారి పంట కొంటాడు… దాని నిల్వ, రవాణా, తరుగు, పెట్టుబడిపై మిత్తీలు, మార్కెట్లో ధరల ఒడిదొడుకులు గట్రా అదో పెద్ద వ్యవస్థ,.. వాళ్ల నుంచి ప్రాసెసింగు మిల్లులకు రావడం, ప్రాసెసింగు జరిగి మార్కెట్లోకి రావడం మరో వ్యవస్థ… హోల్ సేల్ వ్యాపారుల నుంచి రిటెయిలర్ల దగ్గరకు రావడం మరో వ్యవస్థ… ప్రతి దశలోనూ లాభనష్టాల రిస్కు ఉంది… అంతే తప్ప, ప్రతి రైతూ తన పంటను తానే వినియోగదారుడి దగ్గరకు వెళ్లి అమ్మడం అనేది ఊహకు, కల్పనకు, రాసుకోవడానికి మాత్రమే బాగుంటుంది… అవునూ… ఒకవేళ పచ్చ జొన్నలో, తెల్ల జొన్నలో కొనే వ్యాపారి లేకపోతే రైతు ఏం చేయాలబ్బా…. రొట్టెలు చేసి అమ్మేసుకోవడమేనా..?!
Share this Article