Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లెక్కకు మిక్కిలి పాత్రలు, భారీ తారాగణం … హేండిల్ చేయడమే టాస్క్…

February 13, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… కృష్ణ- పి చంద్రశేఖరరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా ఈ బంగారు భూమి సినిమా . 1982 సంక్రాంతి సీజనుకు విడుదల అయి వంద రోజులు ఆడిన సినిమా .

గ్రామీణ కుటుంబాల నేపధ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో పాడిపంటలు వంటి సూపర్ హిట్ సినిమాలు ముందు కూడా వచ్చాయి . పి చంద్రశేఖరరెడ్డి అలాంటి సినిమాలు తీయటంలో దిట్ట . కృష్ణ ఈ సినిమాలో కూడా చాలా హుందాగా , అందంగా నటించారు . ఇలాంటి పెద్దన్నయ్య పాత్రలు ఆయనకు కొట్టిన పిండే .

Ads

ఈ సినిమాకు బలం కధ , కధనం . పి చంద్రశేఖరరెడ్డి రెండింటినీ బాగా హేండిల్ చేసారు . భారీ తారాగణం . Looks overcrowded too . కృష్ణ , అతిలోకసుందరి శ్రీదేవి , కృష్ణకుమారి , కవిత , సుధాకర్ , గీత , అల్లు రామలింగయ్య , రాజబాబు , మమత , సంగీత , గిరిబాబు , ప్రభాకరరెడ్డి , మిక్కిలినేని , త్యాగరాజు , గుమ్మడి , సత్యనారాయణ , రావు గోపాలరావు , సారధి , ఈశ్వరరావు , సూర్యకాంతం , ప్రభృతులు నటించారు .

ఇన్ని పాత్రలను సమన్వయం చేసుకుంటూ కధను నడిపించటం అంత సులభం కాదు . పి చంద్రశేఖరరెడ్డి సఫలుడయ్యారు .

జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాాయి . ఆత్రేయ వ్రాసిన పొంగింది పొంగింది బంగారు భూమి పాట చాలా బాగుంటుంది . హిట్టయింది కూడా .

బంజరు భూముల్ని , కొండ భూముల్ని సాగలోకి తెచ్చేందుకు నీటి వసతి కోసం రాళ్ళల్లో , గుట్టల్లో హీరో బావుల్ని తవ్వే సీన్లు ఎన్నో సినిమాల్లో పెట్టారు . ఎన్నింటిలో పెట్టినా ఎన్ని సార్లయినా ఆ సీన్లు పండుతూనే ఉంటాయి . అలాంటి పాజిటివ్ సీన్ ఈ సినిమాలో కూడా ఉంటుంది . ఈ పాట అందుకు సంబంధించిందే .

వేటూరి ఒక్క రేయంత కవ్వింత ఒళ్ళంత తుళ్ళింత డ్యూయెట్టునే వ్రాసారు . హుషారుగా ఉంటుంది . మిగిలిన అన్ని పాటలూ ఆత్రేయే వ్రాసారు . దొంగ చిక్కింది కంగు తిన్నది , చిటపట చిటపట చిటపట వర్షం గ్రూప్ డాన్స్ , ఆరిపేయీ ఆరిపేయీ చలిమంట పాటలు హుషారుగా ఉంటాయి .

యస్ పి వెంకన్న బాబు నిర్మించిన ఈ సినిమాకు సంభాషణలు మోదుకూరి జాన్సన్ పదునుగా వ్రాసారు . హాస్య సంభాషణలను అప్పలాచార్య వ్రాసారు . తిరనాళ్ళ వర్షం గ్రూప్ సాంగులో ప్రభల మీద డాన్సుల్ని ఈ సినిమాలో చూడవచ్చు .

ఒకప్పుడు మా నరసరావుపేట ఈ డాన్స్ కంపెనీలకు చిరునామా . కోటప్పకొండ , ఇతర ఊళ్ళల్లో తిరునాళ్ళకు డాన్సర్లను మా ఊరి నుండే తీసుకుని వెళ్ళేవారు . ఎంతో మంది కళాకారులు , డాన్సర్లు బతికేవారు . అవన్నీ అశ్లీలంగా ఉన్నాయని నిషేధించారు .

ఎంతో మంది నిరుద్యోగులు అయ్యారు . ఇవ్వాళ సినిమాలలో , సోషల్ మీడియాలో వచ్చే పచ్చి బూతుల కన్నా ఆ ప్రభల డాన్సులు వంద రెట్లు బెటర్ . ఏలిన వారు మూర్ఖంగా తీసుకునే కొన్ని గుడ్డి నిర్ణయాలు కొందరి జీవితాలనే మార్చేస్తాయి .

చక్కని కుటుంబ కధా చిత్రం . కృష్ణ హుందా నటన , శ్రీదేవి పొగరుబోతు నటన , తర్వాత బాధ్యత తెలుసుకున్నాక హుందా నటన సినిమాకు హైలైట్ .కృష్ణ , శ్రీదేవి అభిమానులు తప్పక చూడతగ్గ సినిమా .

ఇంతకుముందు చూసి ఉండకపోతే ఇతరులు కూడా చూడతగ్గ సినిమాయే . యూట్యూబులో ఉంది . A watchable neat , family-oriented , feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రమ్యకృష్ణ నిజమే చెప్పింది…. మళ్లీ లైంగిక దోపిడీ వార్తల్లోకి వచ్చింది…
  • ఆ అద్భుత ఆధ్యాత్మిక యాత్ర మళ్లీ ఆరంభం అవుతోంది..!
  • తెలియదు… నంబాల మరణంతో నా మనస్సు ఎందుకు చివుక్కుమంది..!
  • డ్రాగన్ రాజు కావచ్చు…. కానీ జామపండు రారాజు… ఆరోగ్య చక్రవర్తి…
  • వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!
  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions