ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఒబేసిటీతో ఉన్నారు. దానికన్నా అతి పెద్ద సమస్య “ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ”. ప్రపంచం లో ప్రతి ఇద్దరు లో ఒకరు ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ తో బాధ పడుతున్నారు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుత ప్రపంచాన్ని పీడించే సమస్యల్లో ఇది ఒకటి.
రోజుకి ఎన్ని నీళ్ళు తాగాలి అనే సింపుల్ టాపిక్ తీసుకుంటే – ఒకతను 3 లీటర్లు తాగాలి అంటాడు, ఇంకో అతను ఉదయమే 2 లీటర్లు తాగాలి అంటాడు. మరొకతను ఆ నీళ్ళు గోరు వెచ్చగా ఉండాలి అంటాడు. ఇంకొకరు ఆ నీళ్ళలో నిమ్మకాయ పిండుకొని తాగాలి అంటాడు. మరొకరు నిమ్మకాయతో పాటు అల్లం అని, బెల్లం అని, తేనే అని, ఇంకోటి అని రకరకాలుగా చెప్తారు. మళ్ళీ ఇందులో ఆయుర్వేదం వాళ్ళు ఒకరకంగా చెప్తారు, హోమియోపతి వాళ్ళు ఒకరకంగా చెప్తారు, ఇంగ్లీష్ వైద్యం వాళ్ళు ఒకరకంగా చెప్తారు. ఇంగ్లీష్ వైద్యంలో కూడా ఒకో డాక్టర్ ఒకో రకంగా చెప్తాడు.
దీనికి తోడు గ్లూకోజ్ కి, ఫ్రక్టోజ్ కి తేడా తెలియని వాళ్ళు కూడా యూ ట్యూబ్ ఛానల్స్ లో సుగర్స్ గురించి, నీళ్ళు తాగటం గురించి నానా చెత్త… ఎక్కువ వ్యూయర్స్ వస్తే వాళ్ళకి మనీ వస్తుంది. అందుకే ఇన్ స్టాగ్రాంలో, యూట్యూబ్ లో, ఇంకా రకరకాల ఛానల్స్ లో రక రకాల చెత్త…
Ads
మా వాచ్ మన్ కొడుకు, అన్నా – ఫలానా సినెమా ట్రైలర్ బాగుంది కదా అన్నాడు… అవునా, ఆ సినెమా ఉంది అని, ట్రైలర్ వచ్చింది అని నాకు తెలియదు అని చెప్పాను… నీకు ఇది కూడా తెలియదా అని మొఖం తిప్పుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ సినెమాలు వచ్చేంత వరకు చాలా సినెమాలు నాకు తెలియవు, వచ్చాక కూడా తెలియవు. క్రికెట్, రాజకీయ నాయకుల గురించి ఇంకా సీరియల్స్ లో నటించే వాళ్ళ గురించి ఇంకా ఊర్లో ఉన్న కుక్కల గురించి నాకు ఎందుకు..? నేను ఎందుకు తెలుసుకోవాలో నాకు అసలు తెలియదు.
ఈ రోజు ప్రపంచ స్టాటిస్టిక్స్ డే, అది నాకు తెలుసు. మన దేశం సిమెంట్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండోది. ఇంకా స్టీల్ ప్రొడక్షన్ లో కూడా ప్రపంచంలో మనం రెండో స్థానం. గణితం, స్టాటిస్టిక్స్ మరియూ స్పేస్ టెక్నాలజీలో మనం ఉన్నత స్థితిలో ఉన్నాం, అది నాకు తెలుసు.
నా గురించే నాకు పూర్తిగా తెలియదు, ఇంకా మా కొండాపూర్ లో కుక్కల గురించే నాకు తెలియదు. అలాంటిది బంజారా హిల్స్ కుక్కల గురించి, బర్మా గురించి నాకు ఎందుకు..?
మనం తెలుసుకోవాల్సిన విషయాలే మనకి సరిగ్గా తెలియవు. ఇంకా డకోటా విషయాలు అన్నీ మనకి ఎందుకు..? ఏది ఎంత వరకు తెలుసుకోవాలో తెలుసుకుంటే చాలు. ముందు ఏది తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలో తెలియాలి.
రోజుకి తినాల్సినంత తింటే శరీరానికి మంచిది. అదే 20 కేజీలు ఒకే రోజు తింటే ఏమవుతుంది.? తిన్న ఆహారం విషం అవుతుంది. మనం అనవసరంగా సేకరించే , వినే, చూసే ఇన్ ఫర్మేషన్ కూడా అంతే. మన బ్రెయిన్ ని విషతుల్యం చేస్తుంది.
నిజానికి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా సింపుల్ మరియూ అవి అందరికీ తెలుసు. మనిషి కొత్తగా నింపుకోవాల్సిన చెత్త ఏదీ లేదు.
ఏది ఎమైనా ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ అత్యంత ప్రమాదకరం. ఆ ట్రాప్ నుంచి ఎంత త్వరగా బయటికి వస్తే అంత మంచిది. మనకి ఏది తెలియాలో అది తెలిస్తే చాలు. మరియూ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి తెలివికలవారే; కొత్తగా తెలివి పెంచుకోవాల్సిన అవసరం లేదు, కొత్త చెత్త నింపుకోవాల్సిన అవసరం లేదు.
బయట నుంచి నేర్చుకోవాల్సింది చాలా చాలా తక్కువ. మన లోపల నుంచి నేర్చుకునేది అసలు విజ్ఞానం. ఇంకా వేరే వాళ్ళ నుంచి, వేరే దేశాల నుంచి నేర్చుకునేదానికంటే మన నుంచి మనం నేర్చుకునేది అనంతం అంటాడు ఒక రోమన్ తత్వవేత్త.
అయినా మనకి తెలిసింది అంతా ఒకరోజు తెలియకుండా పోతుంది కదా, తెలుసుకొని ఏమి చేస్తాం..! – పూర్తి వ్యక్తిగత అభిప్రాయం…. By జగన్నాథ్ గౌడ్
Share this Article