తెలుగు చానెళ్లు బాగా ఎదిగిపోతున్నయ్… పోతున్నయ్ ఏంటీ, పోయాయ్… ఇప్పుడున్నవన్నీ రంగులు పూసుకున్న చానెళ్లే కదా… అనగా ఏదో ఓ పార్టీకి డప్పు కొట్టేవే కదా… ప్రత్యర్థి పార్టీల మీద టన్నుల కొద్దీ బురదను చల్లేవే కదా… అఫ్‌కోర్స్, కాస్త ఎక్కువ కాస్త తక్కువ, అంతేతప్ప ఏ చానెలూ మినహాయింపు కాదు… వాటి ఓవరాక్షనే ఓవరాతి యాక్షన్ అయిపోతోందిరా దేవుడా అని ప్రేక్షకుడు తలపట్టుకుంటే… ఆ చానెళ్లలో మోడరేటర్లు, ప్రజెంటర్లు ఆ ఓవరాక్షన్ డోస్ మరింత పెంచుతున్నారు…
టీవీ9 గురించి అందరికీ తెలిసిందేగా… అటాప్సీ- ఆటోస్పై దగ్గర నుంచి గగనం నుంచి రుధిరవర్షం దాకా… బోలెడు జ్ఞానగుళికలు సరే… కానీ న్యూస్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ న్యూస్‌ను బట్టి వాళ్లు వాడే గ్రాఫిక్స్, వేసే వేషాలు నవ్వు పుట్టిస్తుంటయ్… దాన్ని క్రియేటివ్ ప్రజెంటేషన్ అనే భ్రమల్లో పడి ఆ ఔట్‌పుట్ బాధ్యులు మరింత ఎక్కువ చేస్తున్నారు… సోషల్ ట్రోలర్లకు ఫుల్ హేపీ…
నిన్న ఆప్ గెలిచిందీ అనగానే, ఓ పెద్ద చీపురు పట్టుకొచ్చి, ఫ్లోర్ ఊడుస్తున్న సీన్ భలే నవ్వు పుట్టించింది.,. ఆ నవ్వులో జాలి కూడా మిక్సయి ఉంది… కాకపోతే కాసేపు రిజల్ట్స్‌కు సంబంధించి డెస్కులో ఎవరెవరు ఏ బాధ్యతలు చూస్తున్నారో చెబుతూ, వాళ్ల అభిప్రాయాలు కూడా లైవ్‌లో చూపించడం కాస్త నచ్చింది… నిజానికి ప్రేక్షకుడికి అదంతా అనవసరం… కానీ డెస్క్ జర్నలిస్టులు ఎప్పుడూ తెరపైకి రారు కదా… అందరినీ వాళ్ల సీట్లలోనే చూపించడం సరదాగా బాగానే అనిపించింది…
Ads
ఇక ఏబీఎన్ వెబ్‌సైట్ ఓ దరిద్రపు లింక్ పెట్టింది… ఏంటంటే..? బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ను మాడరేటర్ వెంకటకృష్ణ చెడుగుడు ఆడాడట… ఒకవేళ అది నిజమైనా సరే, ఫలానా పొలిటిషియన్‌తో మా మోడరేటర్ కబడ్డీ ఆడుకున్నాడు తెలుసా అని వార్త రాసుకోవడం ఏబీఎన్‌కే చెల్లింది… నిజానికి ఆ వీడియోలో కబడ్డీ, హాకీ, క్రికెట్ ఏమీలేవు… రఘునందన్, వెంకటకృష్ణ మధ్య ఆ దూరం ఏమీ లేదు… రఘునందన్ స్వతహాగా గతంలో జర్నలిస్టు, అడ్వొకేట్ కాబట్టి… జవాబులు ఇవ్వడంలో దూకుడుగానే ఉంటాడు…
వెంకటకృష్ణ ఏదో చెబితే తను ఏదో జవాబు ఇచ్చాడు తన స్టయిల్‌లోనే… చివరలో వెంకటకృష్ణ కంగ్రాట్స్ రఘు అన్నాడు… అయిపోయింది… ఇక చెడుగుడు ఏముంది..? గుడుగుడుగుంచం ఏముంది..? కాకపోతే తమ చానెళ్ల పార్టీల రంగులను బట్టి మోడరేటర్లు కొందరి అభిప్రాయాలను మధ్యలోనే కట్ చేయడం, తామే ఖండించడం ప్రతి చానెల్‌లోనూ ఉన్నదే… ఈ విషయంలో టీవీ5 ఇంకాస్త ఎక్స్‌ట్రీమ్…
నిజానికి డిబేట్లు రన్ చేసే జర్నలిస్టులకు ప్రధానంగా కావల్సింది ఓపిక… అనుభవమున్న సీనియర్ జర్నలిస్టులు మరింత మర్యాద, పద్ధతిగా వ్యవహరించాలి… వర్తమాన వ్యవహారాలపై అవగాహన ఉండగానే సరిపోదు, తమ చానెల్ పొలిటికల్ లైన్‌కు కట్టుబడి ఉండగానే సరిపోదు… ఎదుటివాళ్లు మాట్లాడుతుంటే ప్రొఫెషనల్‌గా వినాలి, అభ్యంతరకరమైతే అడ్డుకోవాలి, సరిచేయాలి… అంతే తప్ప తామే ఆవేశంతో ఊగిపోతే ఎలా..?
సాంబశివరావు, మూర్తి ఇద్దరూ అదే కోవ… పైన వీడియో చూశారు కదా… నవ్వొచ్చింది.., ఇక ఆ తీరుపై వ్యాఖ్యానించడానికి కూడా ఏమీలేదు… ఆమధ్య మహాన్యూస్ చూస్తుంటే ఓ న్యూస్ ప్రజెంటర్ బీపీతో విపరీతంగా ఊగిపోతూ కనిపించాడు… అక్కడే కిందపడిపోతాడేమో అని భయసందేహాలు తలెత్తాయి… సమయానికి ఆ వీడియో బిట్ దొరకడం లేదు… టాల్కమ్ పౌడర్ వంశీ అయితే ఎప్పుడూ విచిత్ర వ్యాఖ్యానాలే… చెబుతూ పోతే ఇలా ఇలా బోలెడు… తెలుగు డిబేట్లా… తెలుగు మోడరేటర్లా మజాకా మరి…!!
మిత్రుడు పైడి శ్రీనివాస్ గీసిన ఒక పాత కార్టూన్ గుర్తొచ్చింది మళ్లీ…
Share this Article