Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందరికీ సన్నబియ్యం… ఆచరణలో కష్టమైనా సర్కారు సక్సెస్..!

July 8, 2025 by M S R

.

బీఆర్ఎస్ కేవలం హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తే… రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరికీ సన్నబియ్యం అందిస్తోంది… ఇది సాహసమే… ఎందుకంటే, కోట్ల కుటుంబాలకు, అదీ మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి ఇవ్వడం చిన్న టాస్కేమీ కాదు… కానీ సక్సెసయింది… జనంలో స్థూలంగా మంచి పేరు వచ్చింది…

ఖర్చు సంగతి పక్కనపెడితే… ఆచరణ క్లిష్టం… ఐనా సరే, ప్రభుత్వం చేసి చూపించింది… ఐతే ఏ ప్రభుత్వమైనా సరే ఇలాంటి నిర్ణయాలతో తమ ప్రభుత్వానికి మంచి పేరు ఆశిస్తుంది.., అది వచ్చిందా తెలుసుకోవడానికి ఓ ప్రయత్నం చేశా… పలువురు వేర్వేరు జిల్లాల గ్రామీణ మహిళలతో మాట్లాడి…

Ads

దీనికన్నా ముందు ప్రభుత్వం ఆశించిందేమిటి..? 1) ప్రభుత్వ సబ్సిడీ అందరికీ ఉపయోగపడాలి, కడుపు నిండా తినాలి, తద్వారా వాళ్ల ఫుడ్‌లో పౌష్టిక విలువలు పెరగాలి, రక్తహీనత వంటి సమస్యల్ని అధిగమించాలి…

2) దొడ్డు బియ్యంతో అవి సాధ్యం కావా..? కాలేదు… అర్హులకన్నా తెల్ల రేషన్ కార్డులు అధికం… దొడ్డు బియ్యం తీసుకునేవాళ్లు కాదు ఎక్కువ మంది… డీలర్లు తమ స్థాయిలోనే అమ్ముకుంటే, కొందరు లబ్దిదారుల వద్దకు బియ్యం ట్రేడర్లు వెళ్లి అడ్డికిపావుశేరు ధరతో… 15- 18 ధరతో కొనేవాళ్లు…

3) దీనివల్ల ఆహారభద్రత లక్ష్యం మాటెలా ఉన్నా ప్రభుత్వ సబ్సిడీ వృథా అయిపోతూ, ఇంకెవరికో ఉపయోగపడుతోంది… దానికి చెక్ పెట్టాలనేది కూడా ప్రభుత్వ సంకల్పం…

4) ఎలాగూ రాష్ట్రంలో సన్న ధాన్యం సాగు పెరిగింది… రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి సాగుతోంది… సన్నాలకు ఇదే ప్రభుత్వం అదనంగా బోనస్ కూడా ఇస్తోంది… తద్వారా మన బియ్యం మనకే ఉపయోగపడాలి…

5) కేవలం పవర్ సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ కోసం చాలామంది రేషన్ కార్డులను మెయింటెయిన్ చేస్తున్నారు గానీ బియ్యం తీసుకోవడం లేదు… వాళ్లతో కూడా బియ్యం కొనిపించాలి… ఆహారభద్రతకు ఓ అర్థం కలిగించాలి…

ration

సరే, ప్రతి పథకానికీ జస్టిఫికేషన్ ఉంటుంది… ఐతే గ్రామీణ మహిళలు మాత్రం స్థూలంగా ఈ సన్నబియ్యం మీద సంతృప్తితో ఉన్నారు… నర్సమ్మ అని ఓ మహిళ…

‘ఇంతకుముందు దొడ్డు బియ్యం తీసుకునేదానివి కాదా..?

లేదు సార్, నూకలు ఎక్కువ, అన్నం ముద్ద ముద్ద అయిపోయేది, తీసుకోవడం బంద్ చేశాను, మా సేటు ఏదో ధర ఇచ్చి తీసుకుపోయేవాడు…

మరిప్పుడు..?

సన్న బియ్యం ఇస్తున్నాడు కదా రేవంత్ సారు, మేమే వండుతున్నం… మొన్న అల్లుడు, వియ్యంకుడు, వియ్యపురాలు వస్తే పాశం వండి పెట్టిన (పాయసం)… పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నరు…

అదేమిటి..? పాశం సేమ్యాతో లేకపోతే శేవెలతో చేయాలి కదా…

  • పరమాన్నం అంటం కదా సారూ… అదే… 3 నెలల బియ్యం ఒకేసారి తెచ్చుకున్నా, ఇక బేఫికర్… గ్యాస్ బండ సగం ధరకే, కరెంటు బిల్లు మాఫీ అయితంది.,. వేరే ఊళ్లకు పనికిపోతం నా బిడ్డ, నేను, బస్సు ఫ్రీ… ఇప్పుడు జెర మంచిగనే అనిపిస్తంది… నాలుగు పైసలు మిగులుతున్నయ్…

స్థూలంగా ఇదే మహిళలందరిదీ, ఇదొక్క ఉదాహరణ… కాకపోతే గతంలో వైఎస్ రెండురూపాయల బియ్యం మళ్లీ ప్రవేశపెట్టినప్పుడు ఊరూరా, ప్రతి వార్డులో కాంగ్రెస్ నేతలు సంబురాలు చేయించారు.,. తద్వారా బాగా మైలేజీ వచ్చింది… రేవంత్, భట్టి, పొంగులేటి తదితరులు పేదల ఇళ్లకు వెళ్లి, తిని, సన్నబియ్యం పథకానికి మంచి ప్రచారం తీసుకొచ్చినా ఈ స్పిరిట్ ప్రతిచోటా కనిపించలేదు, పార్టీ ఈమేరకు డ్రైవ్ చేయలేదు పార్టీ శ్రేణుల్ని…

అక్కడక్కడా బీఆర్ఎస్ వాళ్లు సన్నబియ్యంలో నూకలున్నయ్, దొడ్డు బియ్యాన్నే రీమిల్లింగ్ చేసి, సన్నబియ్యంగా మార్చి ఇస్తున్నారు అనే ప్రచారంతో కాంగ్రెస్‌కు మైలేజీ రాకుండా ప్రయత్నిస్తున్నారు… కానీ దాంతో పెద్ద ఫాయిదా లేదు వాళ్లకు… తినేవాళ్లకు తెలుసు కదా తాము తినేదేమిటో, ఎలా ఉందో…

బీజేపీ శ్రేణులు మాత్రం ఈ బియ్యం మా మోడీ ఇస్తున్నాడు అనే ప్రచారం చేసుకుంటున్నాయి… మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు మీ  మోడీ అనే కౌంటర్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి మరింత బలంగా జరగాలి, కానీ అది లోపించింది… ఏదైనా పండుగ సందర్భం చూసి, సన్నబియ్యం పథకానికి మళ్లీ కాస్త హడావుడి క్రియేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మైలేజీ, మంచి పేరు…!!

కవిత

మరొకటి చెప్పాలి… సన్నబియ్యం ఇస్తున్నా కొందరు బియ్యం తీసుకుపోవడం లేదు… అంటే బోగస్ కార్డులు లేదా వలస పోయి ఉండాలి, మరేమైనా కారణాలు… దీంతో ఆ 7.24 లక్షల కార్డుల్ని రద్దు చేయబోతోంది అని కవిత విమర్శ స్టార్ట్ చేసింది… ఒకవైపు కొత్త కార్డులు ఇస్తుంటే ఈ రద్దు నిర్ణయం ఆమెకు ఎవరు చెప్పారో… ఏదో ఒకటి అనేయడం… నిజంగా బోగస్  కార్డులు ఎత్తేస్తే ఏమిటి నష్టం..?

రేషన్

నమస్తేలో మొన్న మరో వార్త… 400 కోట్ల దొడ్డు బియ్యం పురుగులు పట్టి ధ్వంసం అయిపోతున్నాయని… వాటికి టెండర్లు పిలిచి డిస్పోజ్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు ఈనాడు వార్త… నమస్తేకు ప్రభుత్వం మీద ఏదో ఒకటి రాసేయడమే పని అయిపోయింది… కేటీయార్, హరీష్, కవిత… ముగ్గురూ ముగ్గురే… బయటికి దెయ్యాలు, భూతాలు అని తిట్టుకుంటూనే…

  • ఇంకొకటీ చెప్పాలి… గతంలో హోటళ్ల వాళ్లు, స్నాక్స్ వ్యాపారులు అడ్డగోలు ధరలకు దొడ్డు బియ్యం కొనేవాళ్లు కదా… ఇప్పుడు దొడ్డు బియ్యం లేవు, ఇచ్చిన సన్నిబియ్యం ఇళ్లల్లోనే వండుకుంటున్నారు… దీంతో మార్కెట్‌‌లో హఠాత్తుగా దొడ్డు బియ్యం ధరలు పెరిగాయి… 25- 28 రూపాయలు… దొడ్డుబియ్యం అయితేనే హోటళ్లకు, స్నాక్స్, నమ్కీన్ వ్యాపారులకు వర్కవుట్ అవుతుంది… అదీ సంగతి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘అడ్డూఅదుపూ లేని కాళేశ్వరం దందాకు… కేసీయారే పూర్తి బాధ్యుడు…’’
  • ప్రజాదేవుళ్లు కదా కరుణించాల్సింది… వాళ్ల సేవ అవసరం కదా కేసీయార్..!!
  • వాట్ ఏ మ్యాచ్..! ఆశ్చర్యకరంగా గెలుపు… అదే మరి క్రికెట్ అంటే..!!
  • అసలే పార్టీలో ఈటల ఎదురీత… ఈలోపు కాళేశ్వరం రిపోర్ట్ షాక్…
  • కల్వకుంట్ల షర్మిలక్క..! పూర్తిగా దారితప్పిన బిడ్డ… ఫాఫం, కేసీఆర్..!!
  • ఆ పాటలో ఆమె చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి..? 30 ఏళ్ల మిస్టరీ..!!
  • మరీ ఇది యండమూరి నవలా..? నిజమేమిటో తనే చెప్పాలిక…!!
  • కొత్త ఎఐ పంచాయితీ… కథలూ, క్లైమాక్సులూ మార్చేసి రీరిలీజులు…
  • కుకూ జాతిరత్నాలు… టీవీ సెలబ్రిటీలు సరదాగా రక్తికట్టిస్తున్నారు…
  • ఆ చెత్త మొహాల పారితోషికాల్ని కట్ చేయండి, వందల మంది బతుకుతారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions