కొత్త సంవత్సరం వస్తున్న వేళ నిమిషానికి 1244 బిర్యానీలు ఆర్డర్లు ఇచ్చారట ఫుడ్ ప్రియులు… అదీ స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ సప్లయ్ ప్లాట్‌ఫారాలుగా… పెద్ద విశేషం ఏమీ కాదు, నిజానికి హోటళ్ల నుంచి స్వయంగా తీసుకువెళ్లిన ఫుడ్ పార్సిళ్ల సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది… పైగా భారతీయులకు బిర్యానీని మించిన ప్రియవంటకం ఏముంటుంది..? మాంచి మసాలా… అవును, మసాలా వేళల్లో అదే కదా కోరుకునే డిష్…
2 లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల బంగాళాదుంపలు ఆర్డర్ ఇచ్చారట… అది కేవలం ఒక స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ చెబుతున్న లెక్క… ఇళ్లల్లో వంటకాల కోసం ఈ ఆర్డర్లు… స్వయంగా తెచ్చుకున్న వాటిని ఈ లెక్కలో కలపకండి… కొత్త సంవత్సరం ఆరగించుకున్న మటన్, చికెన్ డిషెస్ పరిమాణాన్ని మనం కొలవలేం… ఇళ్లల్లో కూడా ఎక్కువగా వండుకున్నది కూడా బిర్యానీయే కావచ్చు బహుశా…
నిజానికి ఆ బిర్యానీకి తోడుగా తెప్పించుకున్న, తెచ్చుకున్న బీర్ల సంఖ్య… విస్కీ బాటిళ్ల సంఖ్య… అది కూడా ఓ లెవల్‌లో… ఒక్క తెలంగాణలోనే ఆరేడు వందల కోట్ల మద్యాన్ని అలా అలా లటుక్కున మింగేశారుట… మరి దేశం మొత్తమ్మీద..? సరే, ఆ సంఖ్యల జోలికి వద్దులే గానీ… ప్రతి గంటకు 1722 యూనిట్ల కండోమ్స్ ఆర్డర్లు వచ్చాయనే వార్తావాక్యమే బాగా ఆకర్షిస్తోంది… స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ స్వయంగా తెలిపిన సమాచారమే ఇది… స్వయంగా మెడికల్ షాపుల్లో తీసుకుపోయిన కండోమ్స్ సంఖ్య అపరిమితం… దానికి లెక్క తెలియదు…
Ads
అసలు ఇవన్నీ కాదు, వార్తలో బాగా ఆకర్షించిన మరో వాక్యం… కేవలం డిసెంబరు 30, 31 తేదీల్లో బుక్కయిన ఓయో రూమ్స్ సంఖ్య 2.3 లక్షలు… ఏడాది మొత్తం 6.7 లక్షలయితే ఏడాది చివరలో అందులో మూడో వంతు ఆ రెండు రోజుల్లోనే… ఓయో రూములు ఎందుకు బుక్ చేసుకుంటారో అందరికీ తెలుసు కదా… సో, బీరు, బిర్యానీ, ఓయో రూమ్, నచ్చిన వ్యక్తితో సంభోగాలు… ఇదీ కొత్త సంవత్సరం వేడుకలు పెరుగుతున్న తీరు…
ఎవరో ఫ్రెండ్స్‌తో కొత్త సంవత్సరం వేడుకలకు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పడం… ఎవరికీ చెప్పే పనే లేనివాళ్లయితే ఇంకా ఫ్రీడమ్… ఛలో ఓయో… అందుకే ఈ సంఖ్యలో కండోమ్ ఆర్డర్స్ మరి… ఓయో రూమ్స్ సంఖ్యకు అదనంగా రిసార్ట్స్, ఓయోకు సంబంధం లేని హోటళ్ల రూమ్స్, ఫ్రెండ్స్ రూమ్స్ గట్రా లెక్కేస్తే… కొత్త సంవత్సరం వేళను ‘‘ఆసక్తి ఆ శక్తీ’’ ఉన్న జంటలు ఫుల్ ఎంజాయ్ చేసినట్టే అన్నమాట… అందుకే చెప్పేది… మనకు ఇయర్ ఎండింగ్‌ను మించిన రసికోత్సవం లేదు అని…!!
Share this Article