.
ముందుగా ఈటీవీ జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్స్ ఓసారి చెప్పుకుందాం… తాజా బార్క్ రేటింగుల్లో జస్ట్, 2.98… అదీ శుక్రవారం రేటింగ్స్… మిగతా టీవీలతో పోలిక వద్దు గానీ… ఆ ఈటీవీ షోలలోనే రాను రాను వెనుకబడిపోతోంది…
కొత్తగా హోస్ట్ మానస్‌ను తెచ్చారు… డబుల్ డబుల్ అంటూ ఏవేవో ప్రయోగాలు చేశారు ఈమధ్య… అవేవీ ఫాఫం, టీఆర్పీలను ఏమాత్రం పైకి తోయడం లేదు… సరే, ఈ టీఆర్పీల గోల వదిలేస్తే… 12 ఏళ్లయిందట… భారీ (మెగా) సెలబ్రేషన్స్ నిర్వహించారు…
Ads
ఆ షోను వదిలేసి వెళ్లిన పాత టీమ్ లీడర్లు, లేడీ గెటప్పులు, సీనియర్ కమెడియన్లతోపాటు పాత జడ్జి నాగబాబు, పాత యాంకర్లు అనసూయ, మరో పాత జడ్జి ఇంద్రజ తదితరులనూ పిలిచినట్టున్నారు… కాకపోతే ప్రోమోలో మరీ నాగబాబుకే ప్రాధాన్యం ఇచ్చారు ఎందుకో మరి… జడ్జిలు కృష్ణ భగవాన్, శివాజీ, మనో, ఖుష్బూలు కూడా కనిపించలేదు మరి…
కానీ… ఆ ప్రోమోలో రోజా కనిపించలేదు… పార్టీ అధికారం కోల్పోయాక మళ్లీ ఇప్పుడు టీవీల్లోకి రీఎంట్రీ ఇచ్చి, పలు షోలు చేస్తోంది… ఇదే జబర్దస్త్‌కు చాన్నాళ్లు మెయిన్ జడ్జి తను… జబర్దస్త్ లేనిదే తనకు పాపులారిటీ లేదు అని పలుసార్లు చెప్పుకుంది… మరెందుకు ఈ ప్రోమోలో లేదు, పిలవలేదా..? పిలిచినా రాలేదా..? (పార్టీలు వేరయినా, వాళ్లవి ప్రత్యర్థి పార్టీలే అయినా… గతంలో కలిసే షోలు చేశారు కదా…)
సరే, ఇదీ వదిలేద్దాం… వేదిక మీదే పాదపూజల తంతు ఏదో నడిపించినట్టు కనిపిస్తోంది… ఎవరెవరికి ఎవరు పాదపూజలు చేస్తున్నారనే స్పష్టత లేదు… కానీ మరీ ఏకాలంలోకి తీసుకుపోతున్నారు ఈటీవీ క్రియేటివ్ టీం..? ఈ వేదికల మీద పాదపూజల తంతు ఏమిట్రా బాబూ…
ఇంకా నయం, అక్కడే కొబ్బరికాయలు కొట్టడం, పంచామృత అభిషేకాలు గట్రా చేయలేదు… ఏకాలం నాటి మర్యాదలు, పూజలివి మహానుభావులూ… అస్సలు బాగనిపించలేదు ఆ సీన్లు…
అవునూ, సుడిగాలి సుధీర్ కనిపించినట్టు లేడు… రాలేదా..? లేక హోస్ట్ రష్మితో కలిపి మరో సర్‌ప్రయిజ్ ప్రోమో రిలీజ్ చేస్తారా..? తన దోస్తులు గెటప్ సీను, ఆటో రాంప్రసాద్ మాత్రం కనిపిస్తున్నారు..!! హైపర్ ఆది సరేసరి… తను లేకుండా ఈటీవీ షో ఉండదు కదా ఇప్పుడు…!!
Share this Article