Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భానుప్రియ పద్మగంధి..? అరుదైన ఆ జాతి స్త్రీ లక్షణం నిజమేనా..?

February 18, 2025 by M S R

.

Abdul Rajahussain…..  *పద్మగంధి.. ఓరోజు కవి, విమర్శకులు సాంధ్యశ్రీ గారితో మాట్లాడుతుంటే ఎందుకో సినీనటి “భానుప్రియ” విషయం వచ్చింది.

ఆ మాట, ఈ మాటా మాట్లాడుతుంటే… భానుప్రియ గారి ఒంటి నుంచి అద్భుత పరిమళం వస్తుంది మీకు తెలుసా అన్నారు. అంతకుముందు ఇదే విషయం భానుప్రియతో సినిమాలు తీసిన ఓ దర్శకుడు కూడా చెప్పివుండటంతో ఆసక్తిగా వుంది. వివరంగా చెప్పమన్నాను…

Ads

“అప్పుడెప్పుడో సినిమా షూటింగ్ చూద్దామని అన్నపూర్ణ స్టూడియోకు వెళ్ళాను.. అక్కడ విశ్వనాథ్ గారు, రామానాయుడు వున్నారు.. వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నప్పుడు ఓ కారొచ్చి మా ముందు ఆగింది…

కారులోంచి భానుప్రియ గారు దిగి మా దగ్గరకొచ్చారు. ఆమె రాగానే ఓ రకమైన అద్భుత పరిమళం గుప్పుమంది.. అది అత్తరో,సెంటో, డియోడరెంట్ వాసనో కాదు.. అంతకు ముందె‌ప్పుడో ఓ అవధూతను కలిసినప్పుడు ఆయన నుంచి వచ్చిన సహజ వాసన గుర్తొ చ్చింది.

తీరా విచారిస్తే భానుప్రియ సెంటు, అత్తరులాంటివంటే ఎలర్జీ అట.. అసలామె పరిమళపు సబ్బు కూడా
వాడదట. బాంబే ఫైవ్ స్టార్ హోటల్‌లో వున్నా, కుంకుడు కాయలతోనే తలస్నానం చేసేవారట. అలాగే ఒంటికి సున్నిపిండి రాసుకొని స్నానం చేసేవారట.

అటువంటి భానుప్రియ నుండి అవధూతల నుంచి వచ్చే పరిమళం రావడం నిజంగా ఆశ్చర్యమనిపించింది..” అన్నారు సాంధ్యశ్రీ..!!

*ఎవరీ అవధూతలు?
భాను ప్రియ గారి సంగతలా వుంచి అసలీ అవధూతలెవరో తెలుసుకుందాం.! * అవధూతలు..!!
అవధూత ఒక సంస్కృత పదం. సాధువులను లేక ఆధ్యాత్మికులను సూచించడానికి కొన్ని భారతీయ మతాలు లేదా ధార్మిక సాంప్రదాయాల నుండి ఈ అవధూత పదం ఆవిర్భవించిందని చెబుతారు. వీరు మానవ సహజమైన అహంకారాన్ని(ఇగో) వదలి ప్రతిఫలం లేకుండా సామాజిక మర్యాద, ప్రమాణాల కోసం ప్రాపంచిక (లౌకిక) చర్యలను చేపడతారు.

సర్వాంగాలను పరిత్యజించిన వీరిని ‘సర్వసంగ పరిత్యాగులు’ లేక ‘సన్యాసులు’ అని కూడా అంటారు. వీరిని భారతీయ స్మృతులు, కుటీచులు, బహుదకులు, హంసులు, పరమహంసులు అని నాలుగు తరగతులుగా విభజించాయి. వీరందరికంటే మహోన్నత స్థితికి చేరిన మహనీయులను” అవధూతలంటారు..

*భాను ప్రియ …. అవధూత కాదు..!! భానుప్రియ ఒక సినీ నటిమాత్రమే. అవధూత కాదు… మరి ఈ అవధూతలను పోలిన పరిమళం ఎలా వస్తుందన్న ప్రశ్నకు సమాధానం లేదు. చెప్పేవాళ్ళు కూడా దొరకలేదు..

*భానుప్రియ ‘పద్మగంధా’?
సినీ నటి భాను ప్రియ గారు పద్మగంధా? మన ప్రబంధాల్లో ‘పద్మగంధి’ పేరు మీరు వినేవుంటారు. పద్మగంధి అంటే పద్మపు సువాసన గలిగిన స్త్రీ అని అర్ధం..!!

నేను వ్యక్తిగతంగా ఆమెను చూడలేదు. సినిమాల్లో మాత్రమే చూశాను.. ఆమెను చూసినవాళ్ళు, ఆమెతో సన్నిహితంగా వున్నవాళ్ళు చెప్పినమాటలే ఈ వ్యాసానికి ప్రేరణ.. మూలం.

*భానుప్రియ ఇప్పుడెక్కడ
వున్నారు.‌?
భానుప్రియ ఇప్పుడు మద్రాసులో వున్నారు. ఆమెకు మెమరీ లాస్ అని చెబుతున్నారు. ఈ కారణంగా ఆమెకేదీ గుర్తుండటం లేదు. అందువల్ల సినిమాల్లో నటించడం లేదన్నది సినిమా వాళ్ళ మాట…. (మొన్న ఏదో ఇంటర్వ్యూలో వంశీ వ్యాఖ్యలు కూడా కొన్ని మానసిక స్థిరత్వం తప్పినట్టే అనిపించాయి, అవి వింటుంటే ఎందుకో ఈ పాత పోస్టు గుర్తొచ్చింది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AI … కొలువులే కాదు, ప్రాణాలూ తీస్తోంది… బహుపరాక్‌‌…
  • ఛాలెంజ్..! ‘మెదడుకు మేత’ నవలను సినిమాకరించడం ఛాలెంజే..!!
  • కూలిపోతున్న మినీ బంగ్లాదేశ్… కానీ ఇలాంటివి దేశంలో కోకొల్లలు..!!
  • నో పవర్, నో నెట్, నో ఫోన్, నో టీవీ… 17 ఏళ్ల ఏకాంతంలో… ఓ వన్యప్రాణిలా…!!
  • ఎస్.., ఓ అవకాశం ఇవ్వాల్సిందే..! ధిక్కార తూటా శాంతిమంత్రం..!!
  • చార్‌ ధామ్ కాదు… ఇది పంచ కేదార్..! వెరీ ఇంట్రస్టింగ్ కారిడార్..!
  • ఒక మనిషి మరణించబోతున్నాడు… దేవుడొచ్చాడు చేతిలో ఓ పెట్టెతో…
  • రమ్యకృష్ణ నిజమే చెప్పింది…. మళ్లీ లైంగిక దోపిడీ వార్తల్లోకి వచ్చింది…
  • ఆ అద్భుత ఆధ్యాత్మిక యాత్ర మళ్లీ ఆరంభం అవుతోంది..!
  • తెలియదు… నంబాల మరణంతో నా మనస్సు ఎందుకు చివుక్కుమంది..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions