Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చైనా, పాకిస్థాన్ మనకు యుద్ధ సంకేతాలు ఇస్తున్నయ్..! ఇలా…

November 19, 2026 by M S R

.

Pardha Saradhi Potluri …….. భారత్ PoJK ని స్వాధీనం చేసుకోబోతున్నదా?
కాశ్మీర్ లో CRPF చెక్ పోస్ట్ మీద కాల్పులు!
భారత్ PoJK ని స్వాధీనం చేసుకోబోతున్నదా అనే మకుటంతో నేను ఇప్పటికే మూడు భాగాలు పోస్ట్ చేయడం జరిగింది!
అఫ్కోర్స్! పాకిస్తాన్ వైపు నుండి కవ్వింపు చర్యలు ఉంటే భారత్ దాడిచేస్తుంది అని వ్రాసే లోపలే నిజంగానే పాకిస్తాన్ అన్నంత పనీ చేసింది!

నవంబర్ 11న కాశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో Mir Bazar కి దగ్గరలో ఉన్న Akhran CRPF చెక్ పోస్ట్ మీద ఇద్దరు తీవ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయారు! ఇద్దరు తీవ్రవాదులు మోటార్ బైక్ మీద వచ్చి డ్యూటీలో ఉన్న CRPF జవాన్ల మీద కాల్పులు జరుపుతూ వెళ్లిపోయారు! ముగ్గురిలో ఒక CRPF జవాను హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు!

Ads

CRPF చెక్ పోస్ట్ మీద తీవ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు అదే జిల్లాలో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా గారు వెంటనే అదనపు బలగాలని రప్పించి తీవ్రవాదులని మట్టుపెట్టాలని ఆదేశించారు!
మరో వైపు ఘటన జరిగిన ప్రదేశాలని అదనపు బలగాలు వచ్చి చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టారు!

నవంబర్ 12 న మరో ఘటన జరిగింది!
ఇద్దరు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG ) పోలీస్ అధికారులు తీవ్రవాదుల కాల్పులలో మరణించారు!
ఈ సంఘటన కిష్టావర్ జిల్లాలోని దచ్చాన్ ( Dachchan ) ప్రాంతంలో జరిగింది. చనిపోయిన అధికారుల పేర్లు బాబీ చంద్ (57), రాష్పాల్ కుమార్ (47).
ఈ అధికారులు ఇద్దరూ స్పెషల్ గ్రూప్ ఆపరేషన్స్ కి (రాష్ట్రీయ రిఫిల్స్ బేటాలియాన్ ) అటాచ్ చేయబడిన జమ్మూ కాశ్మీర్ పోలీస్ విభాగానికి చెందినవారు.

దచ్చానా దగ్గర ఉన్న రాష్ట్రీయ రిఫైల్స్ క్యాంపులో ఉన్న మరో ఇద్దరు SOG అధికారులకి రిలీఫ్ ఇవ్వడానికి బయలుదేరిన బాబీ చంద్, రష్ పాల్ కుమార్ మార్గమధ్యంలో అదృశ్యం అయ్యారు. వాళ్ళ మైబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి. అనుమానం వచ్చిన పైఅధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా మరుసటి రోజు ఉదయం ఇద్దరి మృత దేహాలు కొండపైన దట్టమైన అడవిలో కనపడ్డాయి. ఇద్దరి దేహాల మీద డజన్ల కొద్దీ బుల్లెట్ గాయాలు ఉన్నాయి కానీ వాళ్ళ వెపన్స్ కనపడలేదు!

అంతకు ముందు రోజు ఒక 10th క్లాస్ చదువుతున్న బాలుడు SOG అధికారుల ముందుకి వచ్చి మీరు తప్పించుకోలేరు అని వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఆ బాలుడు ఎవరు ఎక్కడ ఉంటాడు అని గాలిస్తున్నారు!
ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవులు పర్వతాలతో నిండి ఉంటుంది కాబట్టి గెరిల్లా తరహా దాడులకి అనువుగా ఉంటుంది.

మరో వైపు మరో అయిదుగురు గ్రామస్తులని అనుమానంతో అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నాయి భద్రతా దళాలు!
ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే LAC కీ దగ్గరలో ఉన్న ప్రాంతాలలో చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. లష్కరే తోయిబా మద్దతుదారులు భారత్ వైపు దాడులు చేసి LAC దాటి PoJk లోకి పారిపోతారు ఇది దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్నది!

పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకుంటే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది!
14 నవంబర్, 2026 న చైనాకీ చెందిన ఫైటర్ జెట్ ఒకటి భారత్ లోని సిక్కిం భూభాగం మీద 25,000 అడుగుల ఎత్తులో దాదాపుగా 25 నిముషాల పాటు ఎగిరింది!
అంటే దీనర్ధం సిక్కింలో భారత ఆర్మీకి చెందిన ఎలాంటి రాడార్ లేదు, అని ఒకవేళ ఉన్నా అది యాక్టివ్ గా లేదని, కావాలనుకుంటే దాడి చేయగలను అనే సoకేతాన్ని ఇచ్చినట్లయింది. అయితే భారత భూభాగంలోకి వచ్చిన ఫైటర్ జెట్ ఎలాంటిది, దాని మోడల్ నంబర్ ఏమిటి అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.
మిలిటరీ పరిభాషలో దీనిని ‘Cone of Silence ’ అంటారు!

అఫ్కోర్స్! ప్రతీ దేశానికి ఇలాంటి కోన్ అఫ్ సైలెన్స్ లు ఉంటాయి. ఎందుకంటే ఒక రాడార్ రేంజ్ 200 km లు ఉంటే ఆ రేంజ్ అయిపోయే చివరలో ఇంకో రాడార్ ని ఏ దేశము ఇంస్టాల్ చేయదు. అలా ప్రతీ 200 km లకి ఒక్కో రాడార్ పెట్టుకుంటూ పొతే వేల సంఖ్యలో రాడార్స్ అవసరం అవుతాయి, వాటికి విద్యుత్ సరఫరాతో పాటు నిర్వహణ కోసం సిబ్బంది అవసరం ఉంటుంది, పైగా సిబ్బందిని తీసుకెళ్లి తీసుకురావడానికి వందల సంఖ్యలో హెలికాప్టర్స్ అవసరం అవుతాయి కాబట్టి ఇంస్టాల్ చేయరు!

గత అయిదేళ్లుగా తైవాన్ ద్వీపం చుట్టూ చైనా తన యుద్ధ నౌకలని, ఫైటర్ జెట్స్ ని తిప్పుతూ వస్తున్నది తప్పితే ఒక్క బుల్లెట్ కానీ, మిసైల్ కానీ ఫైర్ చేయలేదు!
But here is the catch!

నెల రోజుల క్రితం CIA భారత అధికారులకి ఒక మెసేజ్ పంపిస్తూ చైనా, పాకిస్తాన్ జాయింట్ గా భారత్ మీద దాడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి కానీ ఇది రొటీన్ ఇంటెల్ ఇన్ఫర్మేషన్ కాదు సీరియస్ గా తీసుకోమని హెచ్చరించింది!
షరా మాములుగా ఆ మెసేజ్ పక్కన పెట్టేశారు కానీ ఏకంగా రెండు రోజుల వ్యవధిలో కాశ్మీర్ లో కాల్పులు, ఇద్దరు కాశ్మీర్ పోలీసులని ఎత్తుకెళ్లి కాల్చి చంపి వెపన్స్ ఎత్తుకెళ్లడం అనేది యుద్ధానికి రమ్మని సంకేతం ఇవ్వడానికే!

పైగా సిక్కిం ఎయిర్ స్పెస్ లో చైనా ఫైటర్ జెట్ 25 నిముషాల పాటు ఎగరడం అనేది CIA ఇంటెలిజెన్స్ మెసేజ్ ని విస్మరించకూడదు అనే సంకేతాన్ని ఇస్తున్నది!
ఈసారి అన్నీ సిద్ధంగా ఉంచుకొని వల వేస్తున్నట్లుగా ఉంది!
పాకిస్థాన్ గత ఆగస్టు నెలలో భారీగా ఆయుధాలని దిగుమతి చేసుకున్నది టర్కీ నుండి.
డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ పాకిస్థాన్ ఆపరేషన్ సిందూర్ లో నష్టపోయిన వాటిని భర్తీ చేసుకునేందుకు వీటిని దిగుమతి చేసుకోవట్లేదు నేరుగా భారత్ మీద దాడి కోసమే భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నది అని విశ్లేషస్తున్నారు.

మక్కా ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ టర్కీ, చైనాల నుండి ఆయుధాలు దిగుమతి చేసుకుంటుండగా సౌదీ అరేబియా వీటికి చెల్లింపులు చేస్తున్నది!
టర్కీ నుండి దిగుమతి చేసుకున్న ఆయుధాలు: ఆగస్టు 19 నుండి ఆగస్టు 21 వరకూ టర్కీకి చెందిన మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు పాకిస్తాన్ లో లాండ్ అయి ఆయుధాలని అన్ లోడ్ చేసి వెళ్లిపోయాయి.

1.K2 Tactical Loitering Munition అంటే ఆకాశంలో ఎగురుతూ రాడార్స్ కి చిక్కకుండా ఉండే టార్గెట్స్ ని పేల్చడానికి వాడే కామికాజ్ డ్రోన్స్. K2 ఇండిపెండెంట్ గా వ్యవహారిస్తూ తనకి ముందే నిర్దేశించిన టార్గెట్ దగ్గరికి చేరుకొని నాశనం చేస్తుంది లేదా సుదూరంగా ఉండే ఆపరేటర్ ద్వారా కూడా పనిచేస్తుంది!

2.Asisguard Songar armed drone systems.

3.బైరాక్టర్ TB2 డ్రోన్ ని SATCOM తో ( satellite communication ) అప్ గ్రేడ్ చేసి సరఫరా చేసింది టర్కీ! ఇరాన్ షాహిద్ డ్రోన్లు టార్గెట్స్ ని ఖచ్చితంగా నాశనం చేయగలిగింది అంటే చైనా ఇచ్చిన సాటిలైట్ కో ఆర్డినేట్స్ వల్లనే కానీ TB2 Byraktor మాత్రం నేరుగా satellite తో కనెక్ట్ అయిపోయి టార్గెట్ మీద దాడి చేస్తుంది. TB2 Byractor డ్రోన్ ని S-400 ఎయిర్ డిఫెన్స్ ని నాశనం చేయడం కోసమే పాకిస్తాన్ దిగుమతి చేసుకుంది.

4.Stealth & Decoy technology- TAI Anka -3 అన్ మాన్డ్ కంబాట్ ఎయిర్ వెహికల్. ఇది టర్కీ కి చెందిన పైలెట్ లెస్ కంబాట్ ప్లేన్!

5.Super Simsek Target / decoy డ్రోన్స్ ని దిగుమతి చేసుకున్నది.

ఇక చైనా నుండి దిగుమతి చేసుకున్నవి
6. HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కొత్తగా తన సైన్యంలో ప్రవేశపెట్టింది పాకిస్థాన్! ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ దగ్గర ఉన్న HQ-9A ఎయిర్ డిఫెన్స్ విఫలం అయిన సంగతి తెలిసిందే! అయితే వెనిజులా, ఇరాన్ లలో HQ-9B కూడా విఫలం అయ్యాయి. వెనుజులా, ఇరాన్ లలో HQ-9B ఎందుకు విఫలం అయ్యిందో డాటా సేకరించి మార్పులు, అప్ గ్రేడ్ చేసింది చైనా. లేటెస్ట్ అప్గ్రేడ్ HQ-9B ని పాకిస్థాన్ కి ఇచ్చి పరీక్షించాలని చూస్తున్నది చైనా!

7. చైనా నుండి కొత్త ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్ కొన్నది పాకిస్తాన్. అయితే అవి ఎలాంటివి అన్నది బయటికి రాలేదు! నిపుణులు అంచనా వేస్తున్న ప్రకారం ఒకవేళ ఆపరేషన్ సిందూర్ II కనుక జరిగితే EW తో కలిసి HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుంది కనుక బ్రహ్మోస్, రాఫెల్ జెట్స్ ని టార్గెట్ విషయంలో కన్ఫ్యూజ్ చేసి కూల్చివేసే దిశగా కొత్తగా ఒక ప్రణాళిక వేసినట్లుగా అంచనా వేస్తున్నారు!

kashmir

అఫ్కోర్స్! కూల్గామ్ లో SOG ఆఫీసర్స్ ని కిడ్నాప్ చేసి చంపడం, సిక్కిం ఎయిర్ స్పెస్ లో చైనా ఫైటర్ జెట్స్ ఎగరడం అనేవి ట్రాప్ అనుకోవాలి! ఎందుకంటే భారత్ ఎప్పుడు, ఎలా స్పందిస్తుందో ఇప్పటికే ఒక అంచనా ఉంది కాబట్టి ఇలాంటి కవ్వింపు చర్యలకి దిగుతున్నాయి చైనా, పాకిస్తాన్ దేశాలు.

ఆపరేషన్ సిందూర్ II కనుక జరిగితే ఈసారి ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది రెండు వైపులా!
PoJK కనుక పాకిస్తాన్ చేతుల్లో నుండి భారత్ వశం అయిపొతే చైనాకి ఆడడానికి కార్డ్స్ ఉండవు. పాకిస్తాన్ సైన్యానికి వేరే సాకులు ఉండవు దేశ దుర్భర పరిస్థితులని సమర్ధించుకోవడానికి!

కూల్గామ్ ఘటనకి బాధ్యుడు కాశ్మీర్ లో లష్కరే తోయిబా కి మిగిలి ఉన్న ఒకే ఒక్కడు… లతీఫ్ భట్ ని నిన్న ఎన్కౌంటర్ లో చంపేశాయి భద్రతా దళాలు! లతిఫ్ భట్ తో పాటు అతని అనుచరుడు ఉమర్ నిసార్ దార్ ని మట్టుపెట్టాయి భద్రతా దళాలు.
కుల్గం జిల్లాలోని ఒక మసీదులో లతిఫ్ భట్ ని, ఉమర్ నిసార్ ని స్థానికులే దాచిపెట్టారని తెలుస్తున్నది!
…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చైనా, పాకిస్థాన్ మనకు యుద్ధ సంకేతాలు ఇస్తున్నయ్..! ఇలా…
  • ఒకేలాంటి పాట ఒకేలాంటి సందర్భాల్లో రెండు సినిమాల్లో…
  • Qatar Vs Indigo… వోల్వో బస్సు దిగి ఎర్ర బస్సు ఎక్కినట్టు..!
  • చాణక్యుడిగా రణ్‌వీర్.. చంద్రగుప్తుడిగా యశ్.. నిజమైతే మరో సంచలనమే!
  • వందేళ్ల నాటి తమిళ భక్తి పాట- గ్రామీ అవార్డుకు పరిశీలన…
  • ఇండియాకు వస్తున్నారా… బీ అలర్ట్, ఎబోలా డిక్లరేషన్ తప్పనిసరి!
  • The son who stole his mother’s night…
  • అమెరికాలో నిత్యావసర వస్తువుల కోసం ప్రజల పరుగులు!
  • ఓసారి నారాయణమూర్తి జాబ్ అప్లికేషన్‌ను విప్రో ప్రేమ్‌జీ రెఫ్యూజ్ చేశాడు…
  • సకల తీర్థాల్లో మునిగి పుణ్యం చేసుకున్న ఆ సొరకాయ చివరికి..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions