Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదే కథాంశంతో అనేక సినిమాలు… షేక్స్‌పియర్ నాటకమే స్పూర్తి…

June 27, 2024 by M S R

ఒసే వయ్యారి రంగీ వగలమారి బుంగీ ఊగిందే నీ నడుము ఉయ్యాల . 1973 జూన్లో ప్రముఖ బేనర్ అయిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ఈ పల్లెటూరి బావ సినిమా అనగానే సినిమా లవర్సుకు గుర్తు వచ్చేది ఆత్రేయ వ్రాసిన ఈ పాటే . పొగరుబోతు , డబ్బు చేసిన , గారాబంగా పెరిగిన భార్యకు బుధ్ధి చెప్పే కథాంశంతో తీయబడిన సినిమా .

ఇలాంటి కథాంశాలతో చాలా సినిమాలు వచ్చాయి . వీటన్నింటికీ మాతృక Shakespeare వ్రాసిన టేమింగ్ ఆఫ్ ది ష్రూ నాటకమే . ష్రూ అంటే గయ్యాళి . కాలేజీలో మా ఇంగ్లీషు మాస్టారు చెప్పారు . Shakespeare భార్య చాలా గయ్యాళి అట . ఆమె మీద దుగ్ధతో , కోపంతో The Taming of the Shrew నాటకాన్ని వ్రాసి పడేసాడట . మళ్ళా మన సినిమాకు వద్దాం .

తమిళంలో సక్సెస్ అయిన పట్టికాడ పట్టణమా సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో శివాజీ గణేశన్ , జయలలిత , శుభ నటించారు . మన తెలుగులో అక్కినేని , లక్ష్మి , శుభ , నాగభూషణం , సుకుమారి , రాజబాబు , రమాప్రభ , గోకిన రామారావు , రమణారావు , నిర్మలమ్మ , చంద్రమోహన్ , రేలంగి ప్రభృతులు నటించారు .

Ads

ఈ సినిమాలో లక్ష్మికి తల్లిగా నటించిన సుకుమారి 2,500 సినిమాల్లో నటించింది . బహుశా ఇన్ని సినిమాలలో నటించిన నటి కాని , నటుడు కానీ ప్రపంచంలో మరెవరయినా ఉండి ఉండరేమో ! (కేరళలో పుట్టిన ఈమె తెలుగు, తమిళం, మలయాళమే గాకుండా ఒడిశా, బెంగాలీ భాషల్లో నటించింది… మహేశ్ బాబు సినిమా మురారిలో బామ్మ పాత్ర చేసింది కదా, ఆమే…)

టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టయ్యాయి . ఏయ్ బావయ్యా పిలక బావయ్యా నీ చిలకమ్మ పిలిచింది , మురిపించే గువ్వల్లారా ముద్దు ముద్దుగుమ్మల్లారా చెప్పనా , ఎటు చూసినా అందమే ఎటు చూసినా ఆనందమే , తెలివి ఒక్కడి సొమ్మంటే తెలివి తక్కువ దద్దమ్మా పాటలు హిట్టయ్యాయి . కొసరాజు వ్రాసిన శరభ శరభ అశరభ శరభా అనే కొలుపుల పాట ప్రత్యేకంగా చెప్పుకోవాలి . బాగుంటుంది .

కె ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . అప్పుడప్పుడు టివిలో కూడా వస్తుంటుంది . ANR , లక్ష్మి అభిమానులు తప్పక చూడతగ్గ సినిమా . యూట్యూబులో ఉంది . An entertaining , feel good movie . బనారసీ బాబు అనే టైటిల్ తో హిందీలోకి కూడా గోవిందతో రీమేక్ అయింది . కన్నడంలోకి Putnanja అనే టైటిల్ తో రీమేక్ అయింది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…… (By డోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…
  • కొన్ని ఉద్వేగపు కన్నీళ్లకు పేర్లుండవ్… అవి అనుభవైక వేద్యమే…
  • మరో వెలుగుబంటి… కాదు, వాడి తాత…! గుట్ట ఈఈకి గుట్టలుగా ఆస్తులు..!!
  • లంచస్వామ్యం…! లంచం చుట్టూ, లంచం కోసం, లంచం చేత…!!
  • మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్… మరో మాట లేకుండా చప్పట్లు కొట్టేయడమే…
  • ది గ్రేట్ సైబర్ రాబరీ..! కుంభస్థలాన్నే కొట్టారు హ్యాక్ దొంగలు..!!
  • చైనా సైబర్ మాఫియా..! ఆ చెరలో వందలాది భారతీయులు గిలగిల..!
  • సింగిల్ మదర్‌హుడ్..! పెళ్లి, విడాకులు, ఐవీఎఫ్ సంతానం… రేవతి స్టోరీ…!!
  • ఆమె అమెరికా అమ్మాయి… పాటేమో వేణువుపై… అతనేమో వీణ సవరింపు…
  • జెమీమా రోడ్రిగ్స్..! ఓ తిలక్ వర్మ… ఓ రోహిత్ శర్మ… ఓ విరాట్ కోహ్లీ…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions