Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…

May 15, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ………. డిఫరెంట్ మీసకట్టుతో చిరంజీవి , రాధిక కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ కమర్షియల్ ఎంటర్టయినర్ ఈ పల్లెటూరి మొనగాడు .

మొనగాళ్ళందరూ సక్సెస్ అయ్యారు . మనోళ్ళకు మొనగాళ్ళు నచ్చుతారేమో ! కధ చాలా గ్రామ నేపధ్యం సినిమాలలో చూసేదే . ఓ మోతుబరి . ఆయనకో భజన సంఘం , partners in crime and exploitation .

Ads

ఆ ఊళ్ళో ఒక మగాడు , మొనగాడు . ఆ మోతుబరి విలన్ బాధితులకు అండగా ఉంటాడు మన హీరో మొనగాడు .

ఈ సినిమాలో మనకు అన్ని సినిమాలలో కనిపించే రావు గోపాలరావు స్థానంలో గొల్లపూడి మారుతీరావు దర్శనమిస్తాడు . ఆయన నేర భాగస్తులు చలపతిరావు , సుత్తి వీరభద్రరావు , మరో ఏక్టర్ పేరు నాకు తెలియదు . హీరోయిన్ రాధిక మెడిసిన్ అయ్యాక కోరి ఆ ఊరికే డాక్టర్ ఉద్యోగం వేయించుకుని చేరుతోంది .

తన డాక్టర్ తండ్రిని హత్య చేసిన వాడిని కనుక్కొని , వాడిని చంపేయాలని ఆ గ్రామానికి చేరుతుంది . హీరో తండ్రిని కూడా విలనే చంపి ఉంటాడు . హీరోయిన్లు డ్యూయెట్లతో పాటు సంయుక్తంగా విలన్ని , అనుచర గణాన్ని తుదముట్టిస్తారు .

విలన్ని చంపినందుకు హీరో గారికి ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుంది . శిక్షానంతరం పెళ్ళి చేసుకోవడంతో శుభం కార్డు పడుతుంది . ఇదీ కధ టూకీగా .

తమిళంలో బాగా హిట్టయిన నెంజిలే తిరువిరుంతల్ (Nenjile Thiruvirunthal) సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో విజయకాంత్ , స్వప్న , విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు .

రాజలక్ష్మి ఆర్ట్ మూవీస్ బేనరుపై మిద్దె రామారావు నిర్మించిన ఈ సినిమాకు యస్ ఎ చంద్రశేఖర్ దర్శకులు .
సినిమా సక్సెస్ అవటానికి కేవలం చిరంజీవి , రాధికల జోడీ , చక్రవర్తి మ్యూజిక్ కారణాలు . చిరంజీవి , రాధికలు మొత్తం 20 సినిమాలలో జంటగా నటించారు . హిట్ పెయిర్ .

జడలోని బంతి పువ్వు కడగంటి కన్నె నవ్వు , పలుకే బంగారమా ఓ గున్నమామిడీ డ్యూయెట్లు బాగుంటాయి . గుండె గది ఖాళీ ఉండిపోతావా అంటూ సాగే డ్యూయెట్ రాజేష్ , పూర్ణిమల మీద చాలా బాగుంటుంది .
అన్ని గ్రామ నేపధ్య సినిమాలలో లాగానే ఓ గ్రూప్ డాన్స్ ఉంది . కాస్తంటే కాస్త ఎర్రగా ఉంటుంది .

ఎవరు పెద్దోళ్ళు ఎవరు ఉన్నోళ్ళు అంటూ సాగుతుంది . చిరంజీవి డాన్స్ బాగుంటుంది . ఆయన డాన్సింగ్ స్కిల్స్ గురించి చెప్పేదేముంది ! సత్యానంద్ డైలాగులు బాగుంటాయి . గొల్లపూడి డైలాగులు , వాటి డెలివరీ భిన్నంగా ఉంటాయి .

ఇతర ప్రధాన పాత్రల్లో అత్తిలి లక్ష్మి , కాకినాడ శ్యామల , సుత్తి జంట , ప్రభృతులు నటించారు . 1983 ఫిబ్రవరిలో విడుదలయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది .

ఇంతకుముందు చూడని చిరంజీవి అభిమానులు చూడవచ్చు . చూడబులే . సినిమా అంతా చిరంజీవి , రాధిక , గొల్లపూడిల మీదే నడుస్తుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?
  • నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…
  • అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!
  • డాక్టర్ సాబ్… 20 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడారు గుర్తుందా..?
  • నవలా రాక్షసుడు + సినిమా రాక్షసుడు + నట రాక్షసుడు…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions