.
కింగ్‌డమ్ సినిమా వసూళ్లు ఇప్పటికి తెలుగులో 45.9 కోట్లు (10 రోజులు) … తమిళంలో కేవలం 3.7 కోట్లు
సూ ఫ్రమ్ సో సినిమా వసూళ్లు కన్నడంలో 53.53 కోట్లు (16 రోజులు)… మలయాళంలో 2.55 కోట్లు (8 రోజులు), తెలుగులో మరీ 15 లక్షలు (ఒకరోజు)
Ads
తలైవాన్ తలైవి సినిమా వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా 74.3 కోట్లు (16 రోజులు)… కానీ తెలుగు వెర్షన్ సార్ మేడమ్ వసూళ్లు 1.97 కోట్లు మాత్రమే…
హరిహర వీరమల్లు సినిమా తెలుగులో వసూళ్లు 85.27 కోట్లు (17 రోజులు)… హిందీలో జస్ట్ 11 రోజుల్లో 33 లక్షలు… తమిళంలో 8 రోజులు, 19 లక్షలు… మలయాళంలో 6 రోజులు, 15 లక్షలు… కన్నడంలో 5 రోజుల్లో 5 లక్షలు…
ఇవి కొన్ని ఉదాహరణలు.,. ఒరిజినల్ సినిమా ఏ భాషలో తీయబడితే ఆ భాషా ప్రేక్షకులు మాత్రమే ఆదరిస్తున్నారు… పరభాషా ప్రేక్షకులు తిప్పికొడుతున్నారు… అదెంత పాన్ ఇండియా సినిమా అయినా సరే, ఎంత ప్రమోషన్ చేసుకున్నా సరే… సౌత్‌లో మరీ ముఖ్యంగా ఇది కనిపిస్తోంది…
వేరే భాషలో ఎంత తోపు హీరో అయినా సరే నిరాదరణే… హరిహర వీరమల్లు ఉదాహరణ చూశారు కదా… హిందీలో జస్ట్ 33 లక్షలు… కన్నడంలో అయితే మరీ 5 లక్షలు… నిజానికి నిత్యామేనన్, విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి ఆదరణే ఉంటుందని అనుకుంటాం కదా…
తమిళ వెర్షన్ 75 కోట్ల దాకా వసూలు చేస్తే, తెలుగులో డబ్ వెర్షన్ ‘సార్ మేడమ్’ వసూళ్లు 2 కోట్లే… ఇంతకుముందు సౌత్ సినిమా అంటే చాలు హిందీలో విరగబడి చూశారు కదా… ఆ ట్రెండ్ మారింది… ఒకటీ అరా తప్ప సౌత్ సినిమాల బదులు వాళ్ల సినిమాల్నే వాళ్లు చూస్తున్నారు… బాలీవుడ్ రివైవ్ ట్రెండ్‌లో ఉంది…
విచిత్రంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ధోరణికి ఒక్క సినిమా భిన్నం… అది మహావతార్ నరసింహా… ఈ యానిమేటెడ్ సినిమా హిందీలో బాక్సాఫీసును కుమ్మేస్తోంది… ఇప్పటికి 156 కోట్ల వసూళ్లు రికార్డు కాగా (16 రోజుల్లో) హిందీలోనే 107 కోట్లు వసూలు చేసింది… ఒరిజినల్ కన్నడం కదా, కర్నాటకలో 4 కోట్లు మాత్రమే…
నిజానికి హొంబలె ఫిలిమ్స్ వాడిది సుడి… కేజీఎఫ్ రెండు పార్టులు, కాంతారా అనూహ్యంగా బ్లాక్ బస్టర్లు కాగా… జస్ట్ 15 కోట్లతో తీసిన మహావతార్ నరసింహ సైతం అనేక రెట్ల లాభాన్ని మూటగట్టుకుంటోంది… ఈ సినిమాకు తెలుగులో 31 కోట్లు… తెలుగు ప్రేక్షకుల పట్టాభిషేకం… కానీ తమిళంలో 1.89 కోట్లు, మలయాళంలో 37 లక్షలు… అంటే ఆ రెండు రాష్ట్రాలూ లైట్ తీసుకున్నాయి…
కన్నప్ప సినిమా వసూళ్లు కూడా చూశాం కదా, ఇదే ట్రెండ్… సో, పాన్ ఇండియా పేరు చెప్పి, రాష్ట్రాలన్నీ తిరిగి ఎంత ప్రమోట్ చేసుకున్నా సరే… ఎవరి భాషలో సినిమాలను ఆ భాషా ప్రేక్షకులు మాత్రమే చూస్తున్నారు… ఒకటీఅరా మినహాయింపులు తప్ప..!! ఇప్పుడిక కూలీ, వార్2 రిజల్ట్ చూడాలి…!
Share this Article