కాంతార సినిమా సక్సెస్‌లో, వసూళ్లలో ఎంత రికార్డు సాధించిందో చూశాం… ఓ మారుమూల కర్నాటక పల్లెల్లోని ఓ ఆదివాసీ నర్తన, ఆధ్యాత్మిక కళను, పరిమళాన్ని పరిచయం చేసుకున్నాం… సినిమా కథ, అందులో డ్రామా, కృత్రిమత్వం ఎట్సెట్రా కాసేపు వదిలేస్తే హీర్ కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి అనితర సాధ్యంగా క్లైమాక్స్ పండించాడు… అదీ చూశాం, విస్తుపోయాం… అదంతా వదిలేస్తే నిజజీవితంలో కాంతార తాలూకు కొన్ని అనుభవాలు కూడా విస్తుపోయేట్టుగానే ఉంటున్నయ్…
సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ఆ అడవుల్లో ఓసారి తనకు పంజుర్లి దైవానుగ్రహం లభించిందనీ, ఆ వ్యక్తిగత అనుభవాన్ని నేను అందరితో షేర్ చేసుకోలేనని రిషబ్ శెట్టి ఎక్కడో అన్నాడు… సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటివి మాట్లాడుతుంటారులే అనుకున్నారు చాలామంది… తరువాత… ఆమధ్య సినిమా థియేటర్ రన్ కూడా పూర్తయ్యాక ఎక్కడో ఓ గుడిలో కాంతార కథలో తరహాలోనే గుడి ట్రస్టు నియమాన్ని, నిర్ణయాన్ని ధిక్కరించిన ఓ గుడి పెద్దమనిషి కోర్టుకెక్కి, వెంటనే గుండెపోటుతో మరణించాడు…
Ads
ఇప్పుడు చెప్పుకునేది మరొకటి… ఆమధ్య కాంతార సీక్వెల్ తీయడానికి ఆశీస్సులు కోరుతూ (నిజానికి సీక్వెల్ కాదని, ప్రిక్వెల్ అనీ ఓ ప్రచారం ఉంది… సరే, అదేమిటనే చర్చ తరువాత సంగతి…) ఓ గుడిలో జరుగుతున్న భూతకోలకు హాజరయ్యాడు రిషబ్ శెట్టి, దీవెనలు పొందాడు… ఈసారి మొత్తం హొంబలె ఫిలిమ్స్ టీం మరోచోట సాగుతున్న భూతకోలకు హాజరైంది…
మంగుళూరు ప్రాంతంలోని అన్నప్ప పంజుర్లి నెమోత్సవకు హాజరైంది ఈ టీం… సేమ్, కాంతార సినిమా కథలో చివరలో భూతకోల ఆడే కథానాయకుడు అటవీ అధికార్లు, గ్రామ పెద్దలను దగ్గరకు పిలిచి, అందరి చేతులూ తన ఛాతీపై వేసుకుని, ఆశీస్సులు ఇస్తున్న సీన్ గుర్తుంది కదా… అచ్చు, హొంబలె టీంను కూడా సదరు భూతకోల కళాకారుడు అలాగే ఆశీర్వదించాడు… తన ఆహార్యంలో భాగంగా అలంకరించుకున్న వక్క (హింగర) పూలను బహూకరించాడు… (వక్క పూలు భూతకోల అలంకరణలో ప్రధానమైనవి)… ఇదంతా సాక్షాత్తూ పంజుర్లి ఆశీస్సులుగా టీం ఆనందపడిపోయింది…
ఈ వీడియోను హొంబలె టీం షేర్ చేసుకుంది… అయితే ఇది పాతదా..? తాజాగా జరిగిందా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు… సరే, ప్రీక్వెలో, సీక్వెలో… ఇక కానివ్వండి… మీరు కోరుకున్నట్టే పంజుర్లి ఆశీస్సులు, అనుమతి లభించింది కదా… ఆ ఫుటేజీ దిగువ వీడియోలో చూడొచ్చు…
Share this Article