Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అడ్వెంచర్, ప్రైవసీ కోసం… ‘పారడైజ్’ వెళ్లినా సరే… సమస్యలుంటయ్…

August 5, 2024 by M S R

సినిమా పేరు Paradise . చాలా బాగుంది . మళయాళం సినిమా ఇంగ్లీషు సబ్ టైటిల్సుతో . తమ అయిదవ వెడ్డింగ్ ఏనివర్శరీని జరుపుకునేందుకు ఒక ఇండియన్ జంట శ్రీలంకకు వెళతారు . 2022 శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో నేపధ్యంలో తీయబడిన సినిమా .

ఆ జంట శ్రీలంకలో రామాయణం లోని ముఖ్య ఘటనల ప్రదేశాలను సందర్శిస్తారు . వాళ్ళతోపాటు మనకూ చక్కగా చూపించారు . మనకు బాగా నచ్చుతుంది . ఆ తర్వాత శ్రీలంక ప్రకృతి అందాలను , వారి సంస్కృతిని , దేశం ఆర్ధిక కష్టాలలో ఉన్నప్పుడు ప్రజల హాహాకారాలు – ఆందోళనలు , టూరిస్టులకు ముఖ్యంగా భారతీయులకు ఇచ్చే గౌరవాన్ని సినిమాలో బాగా చూపారు .

Background music ఢాం ఢాంలు లేకుండా చాలా pleasant గా ఉంటుంది . ఢాం ఢాం సంగీత దర్శకులు తప్పక చూడాలి .
ప్రధాన పాత్రల్లో నటించిన దర్శన రాజేంద్ర , రోషన్ మేథ్యూ చాలా బాగా నటించారు . ముఖ్యంగా వారిద్దరి మధ్య ఆలోచనా బేధాలు రావటాన్ని సున్నితమైన మాటలు తక్కువ భాషలో డైరెక్టర్ ప్రసన్న వితానగే బాగా చూపారు .

Ads

కాకపోతే ముద్దులు గట్రా మరీ అంతగా చూపాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు మాలాంటి కె విశ్వనాధ్ బేచ్ ప్రేక్షకులకు . మణిరత్నం నిర్మాతల్లో ఒకరు . రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది .

బుసాన్ లో జరిగిన 28 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడి , కిం జిసోక్ అవార్డుని గెలుచుకుంది . చాలామంది పర్యాటకులు ముఖ్యంగా యంగ్ కపుల్స్ జనం లేని ప్రదేశాలకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు . ఒకటి ఎడ్వెంచర్ , రెండు ప్రైవసీ . అవి ఎంత ప్రమాదమో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది . ఇంతకన్నా కొత్త సినిమా గురించి చెప్పటం భావ్యం కాదు .

సినిమా బాగుంది . శ్రీలంక ప్రకృతి అందాలను బాగా చూపారు . ఇంగ్లీషు సినిమాల్లోలాగా కుర్ర ప్రేక్షకులకు కాస్త శృంగార వాసన కూడా ఉంది . వెరశి చూడతగ్గ సినిమా . ప్రైంలో ఉంది . చూసేయండి … [ దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతా కాలమహిమ- చంద్రబాబా మహత్తు- ఆ లీలలెన్న తరమా !?
  • ‘యాదాద్రి’పై రేవంత్ రెడ్డి కొరడా ! కేసీయార్ నిర్వాకాలే అసలు తలనొప్పి !!
  • రజినీ ఒక్కడు చాలదా..? మరీ ఇన్ని కామియోలు ఎందుకురా బుజ్జా..!!
  • కట్టి, కూల్చి, మళ్లీ కట్టి… కేసీయార్ మార్క్ ‘ఇంజినీరింగ్ అద్భుతం’…
  • మళ్లీ తెరపైకి బనకచర్ల ! చంద్రబాబు తమిళనాడు నుంచి నరుక్కొస్తున్నాడా..!?
  • జాతీయ పరీక్షల్లో AI సాయం ! నందన్ నీలేకని ప్రతిపాదన భేష్ !!
  • గజల్ శ్రీనివాస్ అంటేనే… గజలియత్‌కు ఓ అవమానం, ఓ కళంకం !!
  • ఓ సామాజిక కథతో మళ్లీ కలిసిన సీతారాముల జంట!
  • ఈ జెండాలు స్పష్టంగానే కుట్ర హెచ్చరికల్ని జారీ చేస్తున్నయ్!!
  • పొలిటికల్ రిపోర్టింగ్ ఎన్నో జీవితసత్యాల్ని ‘అక్షరాలా’ కళ్లకుగట్టింది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions