.
ఇది ఆంధ్రా ప్రభుత్వమా, తెలంగాణ ప్రభుత్వమా… అని తెలంగాణవాదులు అని కాంగ్రెస్ పార్టీ సర్కారును విమర్శిస్తున్నారని అంటున్నారు గానీ… అంటే అన్నామంటారు గానీ… ఆ చాన్స్ పలుసార్లు ఇచ్చేది చేజేతులా ప్రభుత్వమే…
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు, గుడ్… తిరుమలగిరిలో ఓ బహిరంగ సభ పెట్టి మరీ కొత్త కార్డుల జారీ ప్రారంభిస్తున్నారు, గుడ్… కానీ దీనికి సంబంధించిన ప్రభుత్వ అధికారిక ప్రకటనను ఏయే పత్రికలకు ఇచ్చారు..? అదీ ఇంట్రస్టింగు…
Ads
కేవలం ఆంధ్రజ్యోతి… ఈనాడు… అంతే… రెండింటి మూలాలూ ఆంధ్రా… ఒకటే చంద్రబాబు సామాజికవర్గం … రెండూ తెలుగుదేశం అనుకూల పత్రికలే… ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల విముఖంగా ఉండేవి… ఈమధ్య ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసిన ‘ఎవరి జాగీర్’ అనే వ్యాసమూ బోలెడంత విమర్శకూ, వివాదానికీ తావిచ్చింది…
బీఆర్ఎస్ మేధోవర్గం అయితే ఏకంగా ఆంధ్రజ్యోతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పునఃకలయికకు కుట్ర చేస్తోందని కూడా ఆరోపించింది… సరే, ఇప్పుడిక్కడ ఆ చర్చలోకి, నిజానిజాల జోలికి వెళ్లడం లేదు గానీ… కొత్త రేషన్ కార్డుల ప్రభుత్వ ప్రకటనను కేవలం ఆ రెండు పచ్చ పత్రికలకే ఇవ్వడం గమనార్హం…
ప్రభుత్వ సమాచార శాఖ పనితీరు ఇలా ఉంటే, విమర్శలు రావా మరి..? దీనికి బాధ్యులెవరో గానీ… రేవంత్ రెడ్డి సీరియస్ లుక్ వేయాల్సిందే ఓసారి… ఎందుకంటే..? తన మీద ఇప్పటికీ చంద్రబాబు శిష్యుడు, తను చెప్పినట్టే నడుస్తాడు అని ఓ ముద్ర అలాగే ఉండిపోయింది… దానికి తగినట్టే ఇదుగో ఇలాంటి ప్రభుత్వ ప్రకటనల జారీ ప్రక్రియ కూడా ఉంటే, అది తనకే పొలిటికల్‌గా కూడా నష్టం…
చంద్రబాబు ఇష్టపత్రికలు కాబట్టే, చంద్రబాబు అంటే ఇష్టుడు కాబట్టే కేవలం ఆ రెండు పత్రికలకే ఖజానా నుంచి డబ్బు ఇస్తున్నారు అనే విమర్శకు ఆస్కారం ఇచ్చింది ప్రభుత్వమే కదా మరి…
మన తెలంగాణ గతంలో కేసీయార్ పల్లకీయే మోసినా సరే… ఈ ప్రభుత్వం రాగానే జై రేవంత్ అంటోంది కదా.., ఆ ఎడిటరూ రేవంత్ రెడ్డికి సన్నిహితుడే కదా… ఆంధ్రప్రభవి కూడా పెద్దగా పచ్చకళ్లు కావు, పచ్చపాతం ఏమీ ప్రదర్శించదు పెద్దగా… రెండింటికీ రేషన్ కార్డులు ప్రకటనలు ఇవ్వలేదు…
సరే.., సాక్షి జగన్ పేపర్ కాబట్టి… అది ఎంతోకొంత అది కేసీయార్‌కే మద్దతు పత్రిక కాబట్టి సర్కారీ యాడ్స్ ఇవ్వలేదని అనుకుందాం… (డిబేట్ కోసం)… అప్పుడప్పుడూ దిశ అనే వెబ్ పత్రికకు కూడా ప్రకటనలు ఇచ్చేవాళ్లు కదా, మరిప్పుడు దానికీ ఇవ్వలేదేం…?
వెలుగు అయితే అక్షరాలా కాంగ్రెస్ మంత్రిగారి సొంత పత్రికే కదా.,. మరేమైంది..? అది పత్రికలాగే కనిపించలేదా..? ఇంగ్లిషులో కూడా ఒక్క టైమ్స్ మాత్రమే కనిపించినట్టుంది… ఇది టీడీపీ సర్కారా అనే విమర్శల్లో మరింత పెట్రోల్ పోస్తున్నట్టుగా ఉంది ప్రభుత్వ ప్రకటనల వైఖరి..!!
Share this Article