పేరుకు పంచాయతీ ఎన్నికలు పార్టీరహితమే అయినా… పార్టీపరంగానే జరుగుతయ్, జరుగుతున్నయ్…! మనం బతికే హిపోక్రటిక్ సొసైటీలో, సిస్టంలో మరో భ్రమాత్మక నిజం ఇది… నిజంగా పార్టీ రహిత ఎన్నికలు అని ఎవరైనా భ్రమపడితే, ఎవడైనా ప్రకటిస్తే అది వాడికే వదిలేద్దాం… పార్టీపరంగా సాగే ఎన్నికలే కాబట్టి ఒక పార్టీగా టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు… ఒక రాజకీయ పార్టీగా అది తనిష్టం… చిన్న చిన్న విషయాలకే పెద్ద హంగామా, హైపూ క్రియేట్ చేసే అలవాటున్న పార్టీ, ఆ ధోరణి ఉన్న నాయకుడు కాబట్టి దాన్ని పెద్ద సీరియస్గా విమర్శకు ప్రాతిపదిక చేసుకోవడం శుద్ధదండుగ… అయితే..? తను ఏం చెబుతున్నాడో మాత్రం చూడాలి… జనం ఛీత్కరించినా సరే తను మారాడా లేదా కూడా ఓసారి పరీక్షించడానికి ఈ మేనిఫెస్టోను అందరూ ఓసారి చదవాలి… తను ఏం హామీలు ఇస్తున్నాడో తనకే సోయి తెలియని తీరు ఓసారి చూడాలి…
ఉన్నదే రెండు పేజీలు… మచ్చుకు కొన్ని పట్టుకుని చూస్తేనే బోలెడంత జాలి కలుగుతోంది టీడీపీ మీద… ఈ పార్టీ మారదు, ఈ నాయకుడు మారడు… మొన్నటిదాకా అయిదేళ్లు తనే ఏపీని పాలించాను అనే స్పృహ కూడా లోపించింది తనలో…
Ads
- 60 రోజుల్లో సమగ్ర సర్వే చేసేసి, ప్రభుత్వ పథకాలన్నీ చేరవేసి… కోవిడ్ వేక్సిన్ వేయిస్తాడట…. అసలు సమగ్ర సర్వే చేయాల్సింది ఎవరు..? విడివిడిగా ప్రతి పంచాయతీ సర్వే చేసుకోవాలా..? ప్రభుత్వ పథకాల అమలు అనేది పూర్తిగా పంచాయతీల చేతుల్లో ఉందా..? ఐనా కరోనా వేక్సిన్కూ పంచాయితీలకూ లింకేమిటి..?
- మోటార్లకు మీటర్ల బిగింపుకి వ్యతిరేకంగా పంచాయతీల్లో తీర్మానాలు చేయిస్తాం… రైతులకు ఉచిత విద్యుత్తు వచ్చేలా చేస్తాం అని మరో హామీ… మరి మోటార్ల మీటర్ల బిగింపును నిర్దేశించే కొత్త విద్యుత్తు చట్టాన్ని రాజకీయంగా ఎందుకు వ్యతిరేకించలేదు..? ఏమోయ్ మోడీ, ఏమిటీ దుర్మార్గం అని ఎందుకు ప్రశ్నించలేదు..? ఎందుకు ఖండించలేదు..? ఐనా మోటార్లకు మీటర్ల బిగింపు అనేది చంద్రబాబు హయాంలోనే, ప్రపంచబ్యాంకు నిర్దేశకత్వంలో రూపొందిన సంస్కరణల్లో భాగం… ఇవన్నీ సరే, ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం లేదా బాబూ..? ఒకవేళ రాకపోయినా అది పంచాయితీల అధికార పరిధిలోని అంశమా..,? ఖచ్చితంగా, ఏ మొహమాటం లేకుండా చెప్పొచ్చు, చంద్రబాబును చూస్తే జాలేస్తోంది…
- బాలికల విద్యను ప్రోత్సహిస్తాడట… బాలికల విద్య మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విధానం అంటూ ఏడవాలే తప్ప పంచాయతీలు విడిగా చేసేదేం ఉంటుంది..? గత అయిదేళ్ల కాలంలో ఈ దిశలో చేసిందేమిటి..?
- ఇలా ఆ రెండు పేజీల్లో రాసుకున్న పాయింట్లలో అధికశాతం అబ్సర్డ్… అవన్నీ తిరిగి చంద్రబాబునే వేలెత్తిచూపిస్తున్నయ్… మరి వీటిని ఎవరికి చదివి వినిపిస్తారు..? ఏ స్పూర్తిని చూపించి వోట్లు అడుగుతారు… జగన్ పాలన ఎంత దుర్మార్గంగా ఉన్నా సరే, ఇదుగో, ఇలాంటివి చదువుతుంటేనే… జనం మళ్లీ చంద్రబాబు వైపు మాత్రం వెళ్లేట్టు లేరు… ఫాఫం…
Share this Article