.
కొన్ని మనదాకా వస్తే గానీ తెలియదు… మైనారిటీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల నుంచి తరిమివేయడం, ఊచకోత అప్పుడెప్పుడో కశ్మీర్‌లో జరిగాయని చరిత్ర… హిందువు అంటే దంచడమే… మనం సెక్యులర్ కదా… కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయాం…
ఇప్పుడు సేమ్… బెంగాలీ బేగం మమత… నాటి కశ్మీర్ పాలకులకన్నా దారుణం… ఆమెకు సోకాల్డ్ వీర, ధీర, శూర సెక్యులర్ రాహుల్ గాంధీ అండ్ రేవంత్ర, స్టాలిన్, అఖిలేష్, తేజస్వి యాదవ్, ఉద్దవ్ ఠాక్రే అండ్ లెఫ్ట్ కూడా పరోక్ష వత్తాసు…
Ads
బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు వచ్చిపడుతున్నారు… అక్కడ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి… పాకిస్థాన్, అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో హిందువులు ఉండే సిట్యుయేషన్ ఏమీ లేదు… సోకాల్డ్ ఇండియన్ మేధావివర్గం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకం… అల్లర్లకు మంటపెడతారు…
వాళ్ల ఇళ్ల మీదకు మూకలు వచ్చి, ఒరేయ్ ఖాళీ చెయ్ బే, లేకపోతే తన్ని తగలేస్తాం, కాల్చేస్తాం, అత్యాచారాలు చేస్తాం బాడ్‌ఖావ్ అంటే గానీ వాళ్లకు అర్థం కాదు… బెంగాల్‌లో అనేకచోట్ల జరుగుతున్నది అక్షరాలా అదే… మమత రౌడీపాలనలో ఆ రాష్ట్రానికి దక్కింది ఇదే… కొన్ని జిల్లాల్లో బంగ్లాదేశీయులదే ఇప్పుడు మెజారిటీ…
రాబోయే కాలంలో ఆ ప్రాంత చికెన్ నెక్ సమస్యాత్మకం కాబోతోంది… ఆల్రెడీ ఆ యూనస్ చైనాకు ఎరవేస్తున్నాడు… దిక్కుమాలిన మన కేంద్ర ప్రభుత్వానికి ఏదీ చేతకావడం లేదు… నిజమే… అఫ్‌కోర్స్, కొంపదీసి రాహుల్ గనుక ప్రధాని అయితే, పోనీ, తనను పక్కకుదోసి మమత ప్రధాని అయితే… బెంగాల్ మనది కాదు… రాసిపెట్టుకొండి…
ఆ పిచ్చిది సృష్టిస్తున్న ఉద్దేశపూర్వక హింసతో వేలాది మంది హిందువులు ప్రాణాలు అరచేత్తో పట్టుకుని పారిపోతున్నారు… ఆల్రెడీ గత ఎన్నికల తరువాత ఆమె ఎగదోసిన హింసతో అస్సోం పారిపోయిన హిందువులు ఈరోజుకూ బెంగాల్ రాలేదు మళ్లీ… ఆమె రౌడీ మూకలు వాళ్లను బతకనివ్వవు…
ఆ బెంగాల్ హైకోర్టే కలతపడి… (మోడీ బాపతు బ్యాచుకు ఈరోజుకూ సోయి లేదు) కేంద్ర బలగాలను దింపాలని ఆదేశించిందీ అంటే అర్థం చేసుకోవాలి అక్కడి సిట్యుయేషన్ ఇంకెంత దారుణంగా ఉందో… ఇంకా రాష్ట్రాలట, ఫెడరల్ స్పిరిట్ అట…
కేంద్రం జోక్యం చేసుకోవద్దట,.. బిల్లులను ఆపితే సుప్రీం అడ్డుకుంటుంది అట… డీమ్డ్ టు బి పాస్డ్ అట… ఈ దేశానికి మోడీ కాదు, తను అసమర్థుడు, మనకు ఒక్క ట్రంపు కావాలి అని సగటు బెంగాలీ హిందూ ఘోషిస్తే అందులో అన్యాయం ఏముంది..?!
మోడీ భయ్యా… మమత రసగుల్లాలు, బెంగాలీ పైజామాలు, కుర్తాలు పంపించిందట… బాగున్నాయో చూసుకుని మురిసిపో…. —– ఓ అజ్ఞాతి ఆవేదనకు అక్షరరూపం… తన సందేహం ఏమిటంటే… ఖలిస్థానీ ఉగ్రవాదం ఉరిమేసరికి వ్యవసాయ చట్టాల్ని లెంపలేసుకుని మోడీ వెనక్కి తీసుకున్నాడు కదా… ఈ వక్ఫ్ చట్టాన్ని కూడా తుంగలో తొక్కుతాడా అని..!!
అయ్యా, రేవంతుడూ… నీ తాజా జాన్ జిగ్రీ దోస్త్ ఒవైసీ కదం తొక్కుతాడట… మనమూ వీర సెక్యులర్ కదా… సంఘీభావంగా ఒవైసీతో కలిసి బజార్లలో నినదిస్తూ కదులుతావా…!!
Share this Article