.
సినిమా బయట రియల్ హీరో అజిత్… చాలా అంశాల్లో… తాజాగా వరించిన పద్మభూషణ్ కూడా..! రీల్ హీరోగా కూడా తమిళంలో బాగా పాపులర్… కానీ కొన్ని కథలకు, కొందరు దర్శకులకు గుడ్డిగా తలూపి పొరపాటు చేస్తాడు… భంగపడతాడు…
పట్టుదల అనే కొత్త సినిమా కూడా అలాంటిదే… అసలు ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని తెలుగు ప్రేక్షకుడికి తెలియదు పెద్దగా… బజ్ కూడా లేదు… చాలా తమిళ సినిమాలకు అలవాటే కదా… అడ్డదిడ్డంగా తెలుగులోకి డబ్ చేసి, తెలుగు మార్కెట్ నుంచి దండుకునే ప్రయత్నాలు…
Ads
ఇదీ అంతే… అసలు ఈ సినిమా ఒరిజినల్ విడాముయార్చి సినిమాలోనే అనిరుధ్ సంగీతం, పాటలు పెద్ద ఇంప్రెసివ్‌గా లేవు, ఇక తెలుగులోకి ఏం తర్జుమా చేస్తారు..? ఏదో తూతూమంత్రం… జనాల మీదకు వదిలారు…
ఇది అదేదో బ్రేక్ డౌన్ అనే హాలీవుడ్ సినిమాకు రీమేక్… దర్శకుడు మగిళ్ తిరుమేని నిజానికి చిత్రీకరణ విషయంలో కష్టపడ్డాడు… హాలీవుడ్ తరహా మేకింగ్ కోసం తపనపడ్డాడు… దర్శకుడు చెప్పినట్టు వినే అజిత్ కూడా ప్రయాసపడ్డాడు బాగానే… దానికితోడు వయస్సు పెరిగేకొద్దీ అందం పెరిగే త్రిష ఉండనే ఉంది…
అంతేనా..? యాక్షన్ హీరో అర్జున్ ఉన్నాడు, టూమినిట్స్ మ్యాగీ రెజీనా కసాండ్రా కూడా ఉంది… ఐనా సరే, పాత్రల కేరక్టరైజేషన్ సరిగ్గా లేక, కొన్నిచోట్ల ల్యాగ్, వెరసి సినిమా అనాసక్తంగా తయారైంది… అసలు హీరోహీరోయిన్లు 12 ఏళ్ల పెళ్లి బంధం నుంచి ఎందుకు విడిపోవాలనుకున్నారో సరిగ్గా కన్వే కాలేదు, ప్రేక్షకుడు కన్విన్సూ కాలేదు… విడిపోయేవాళ్లు వీడ్కోలు లాంగ్ టూర్‌కు ఎందుకు వెళ్తారు..? తల్లిదండ్రుల దగ్గర తానే దిగబడతానడం, చివరి మెమొరీలాగా ఉంటుందనడం ఎందుకో పెద్దగా నప్పలేదు…
అర్జున్, రెజీనా సైకో విలన్లుగా ఏదో కష్టపడ్డారు గానీ… దర్శకుడు ఎంతసేపూ యాక్షన్, చిత్రీకరణల మీద దృష్టి పెట్టాడే తప్ప పాత్రల నడవడిక మీద శ్రద్ధ చూపకపోవడంతో… వాళ్లు ఎందుకలా బిహేవ్ చేస్తుంటారో అర్థం గాకుండా పోయి, ఆ పాత్రలు పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి… దాంతో కిడ్నాపైన భార్య కోసం భర్త చేసే పోరాటం పెద్దగా ఆసక్తికరం అనిపించలేదు…
అజిత్, త్రిష మధ్య వచ్చే సీన్స్ ఆసక్తికరంగానే ఉన్నాయి… మధ్యలో అర్జున్, రెజీనా ఎంట్రీ.. ఆ తర్వాత త్రిష కనబడకుండా పోవడం.. కళ్ల ముందే కిడ్నాప్ చేసిన వాళ్ళున్నా ఏం చేయలేని అజిత్ సిచ్యువేషన్.. అవన్నీ బాగానే ఉంటాయి కానీ.. కథలో ఎమోషన్ కనిపించదు… అజిత్ మేకప్, లుక్కు కూడా మారిపోతూ ఉంటుంది… ఆ వైట్ అండ్ వైట్ గడ్డం, మీసం కూడా మాయం…
పైగా అజిత్ లాంటి స్టార్ సినిమా అంతా దెబ్బలు తింటుంటే చూడలేం… మేకింగ్ అంతా అజర్‌బైజాన్‌లో… ఆ టూరిజం కోసం తీసినట్లుంది ఈ సినిమా… అజిత్ నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి..? కాకపోతే యాక్షన్ సీన్స్‌లో మునుపటి వేగం కనబడలేదు…
యాక్షన్ కింగ్ అర్జున్ కొత్తగా ట్రై చేసాడు.. త్రిష, రెజీనా కూడా పర్లేదు… తనకు దక్కిన మంచి అవకాశాన్ని దర్శకుడు మగిళ్ తిరుమేని మిస్ చేసుకున్నాడు అనుకోవల్సిందే… ఓవరాల్‌గా అజిత్ కోసం ఎంత పట్టుదలగా సినిమా చివరిదాకా చూడాలనుకున్నా సరే…, కష్టమే..!
Share this Article