.
Mohammed Rafee …… పావలా శ్యామలను ఒక హోమ్ తరిమేసింది… మరో హోమ్ అక్కున చేర్చుకుంది…
నటి పావలా శ్యామలకు కష్టాలు తీరేటట్లు కనిపించడం లేదు! బతుకు పోరాటం అడుగడుగునా చేస్తూనే వుంది! చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా చాలా మంది ఆమెకు ఆర్ధిక సాయం చేశారు. అయినా ఆమెకు సరిపోవడం లేదు!
Ads
భయంతో డబ్బులు కూడబెట్టుకుంటుందా లేదా అప్పులేమైనా ఉన్నాయో తెలియదు కానీ, మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి బస్సుకు ఎదురుగా వెళ్లి తన కుమార్తెతో పాటు చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ సమాచారం తిరుమలగిరి పోలీసులకు అందింది. ఎసీపీ రమేష్ ఆదరించారు.
అసలేం జరిగింది
కొన్నాళ్ళుగా శ్యామల, తన కుమార్తెతో కలసి తిరుమలగిరిలో ఒక ఆశ్రయ హోమ్ లో ఉంటోంది! అయితే ఇద్దరి ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. అన్నీ బెడ్ పైనే జరిగే దశకు చేరుకోవడంతో ఆ హోమ్ నిర్వాహకులు చేతులెత్తేశారు!
తమకు భారంగా ఉందని, సర్వీస్ చేసే వాళ్ళు లేరని హోమ్ ఖాళీ చేసి వెళ్లాలని పలుమార్లు చెప్పినా శ్యామల వినలేదని సమాచారం. దాంతో నిన్న హోమ్ నుంచి బలవంతంగా పంపించేశారు.
ఆరోగ్యం బాగాలేకున్నా శ్యామలలో కోపం ఏమాత్రం తగ్గలేదు! హోమ్ నిర్వాహకులపై కోపంతో బలవన్మరణానికి పాల్పడతామని బెదిరించిందట. తిరుమలగిరి రోడ్లపై నిలబడి చంపేయండి అన్నదట!
ఆ హోమ్ నిర్వాహకులు తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఎసిపి రమేష్ వెంటనే స్పందించి, వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించుకున్నారు. కార్ఖానాలో వున్న ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ లో చేర్పించారు.
తల్లీకూతుళ్లకు బెడ్ లు కేటాయించి చికిత్స అందిస్తున్నారు. మందులు వేసుకోకుండా ఆరోగ్యాలు దెబ్బ తీసుకున్నారని, త్వరగా కోలుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు.
కోలుకున్నాక కూడా తమ ఆశ్రమంలోనే వారిద్దరికీ ఆశ్రయం కల్పిస్తామని వారు ప్రకటించారు. 300 పైగా సినిమాల్లో నటించిన శ్యామల చివరి దశలో కష్టాలు ఇతర నటులకు గుణపాఠం కావాలి! – డా. మహ్మద్ రఫీ
.
అవునూ, ఆమెకు ‘మా’లో సభ్యత్వం లేదా..? ఆ సంఘం ఏమీ పట్టించుకోదా..? వివరాలు తెలియవు కానీ, తలెత్తే సందేహం మాత్రం ఇదే...
నాకు తెలిసి ఆమెకు గత ప్రభుత్వం నుంచి నెలనెలా డబ్బు సాయం అందేది… ఐనా బదనాం చేసింది… ఇప్పటి పరిస్థితి ఏమిటో తెలియదు… ఇప్పటి హోంలో కూడా చాన్నాళ్లు ఉండలేదు ఆమె…
Share this Article