Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో తలకు దెబ్బ.., మెమొరీ లాస్, డేటా కరప్ట్… మళ్లీ దెబ్బ, డేటా రికవరీ…

May 10, 2024 by M S R

Subramanyam Dogiparthi…. దసరా బుల్లోడు జైత్రయాత్ర కొనసాగుతూ ఉండగానే విడుదలయి , వంద రోజులు ఆడిన చక్కటి సెంటిమెంటల్ , మ్యూజికల్ హిట్ 1971 లో వచ్చిన ఈ పవిత్ర బంధం సినిమా … అక్కినేని- వాణిశ్రీ జోడీలో వచ్చిన మరో గొప్ప సినిమా … కృష్ణంరాజు ఇంకా విలన్ గానే హీరో చేతిలో దెబ్బలు తింటూనే ఉన్నాడు అప్పటికి … కాంచనకు కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రే లభించింది ఇందులో…

హీరోకి , హీరోయిన్ కి ప్రమాదాలలోనో , ఇతరత్రా ఏదయినా షాక్ కు గురయ్యో గత జీవితం మరచిపోవటం , మరలా గుర్తుకు రావటం వంటి కధాంశాలతో పునర్జన్మ వంటి సినిమాలు మనకు ఉన్నాయి . ఈ సినిమాలో కూడా అదే కధాంశం . హీరో ANR… కోటీశ్వరురాలు కాంచన స్వేచ్ఛ కోసం బంగళా వదిలి రావటం , అక్కినేని, తను ప్రేమలో పడటం , హీరో ప్రమాదానికి గురవటం , మరో హీరోయిన్ వాణిశ్రీకి దగ్గరయి పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కనటం , మళ్ళా ప్రమాదం , మళ్ళా మరచిపోవటం , ఓ పాటతో గతం గుర్తుకు రావటం , ఒక హీరోయిన్ నిష్క్రమించటం , ఆమె ఫొటోకి దండ వేయటంతో సినిమా సమాప్తం అవుతుంది . చివర్లో ఇద్దరు హీరోయిన్లు అక్కాచెల్లెళ్ళని తెలవటం జనానికి నచ్చిన భలే ట్విస్ట్ . (మారువేషాలు- చెంపకు పులిపిరి సన్నివేశాలు కూడా ఇలాగే ఉంటాయి మన సినిమాల్లో…)

నటన పరంగా మార్కులు వేయాలంటే వాణిశ్రీకే వందకు వంద మార్కులు . ఈ సినిమాలో కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది . ఆమె తర్వాతే ANR … కాంచన , కృష్ణంరాజు , జి వరలక్ష్మి , పద్మనాభం , గీతాంజలి , పెరుమాళ్ళు , నాగయ్య , రావి కొండలరావు ప్రభృతులు నటించారు .

Ads

యస్ రాజేశ్వరరావు సంగీతం వీనుల విందుగా ఉంటుంది . గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ఇది అనే పాట , పచ్చబొట్టూ చెరిగీ పోదులే నా రాజా పడుచు జంట చెదిరీ పోదులే నా రాజా పాట ఈరోజుకి జనం నోట్లలో నానే పాటలే . పచ్చబొట్టూ చెరిగీ పోదూలే పాట ఒకసారి హుషారుగా , మరోసారి విషాదంగా వినిపిస్తుంది . రెండు సన్నివేశాలలో వాణిశ్రీ నటనలో చూపిన వైవిధ్యం సూపర్బ్ …

ఆ తర్వాత మెచ్చుకోవలసింది అట్లతద్దోయ్ ఆరట్లోయ్ అనే పాట . బహుశా ఇప్పుడు తరం వారికి , ముఖ్యంగా పట్నవాసులకు అట్ల తద్ది గురించి తెలియదు . ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవటం , పొద్దున్నే అట్లు తినటం , వాళ్ళతోపాటు అన్నాతమ్ముళ్ళు కూడా లాగించటం , ఉయ్యాలలూగటం కనుమరుగైన మన సాంప్రదాయం . కాంక్రీటు జనారణ్యంలో ఎక్కడ ఆశిస్తాం ?

వాణిశ్రీ , గీతాంజలి ఘలఘలఘల గజ్జెల బండి పాట , సగం సగం , చిన్నారి నవ్వులే పాటలు చాలా బాగుంటాయి . వి మధుసూధనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వాణిశ్రీ- ANR కాంబినేషన్లో వచ్చిన చాలా హిట్ సినిమాలలో ఒకటి . మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో ఓ నాలుగయిదు సార్లు చూసి ఉంటానేమో ! యూట్యూబులో ఉంది . చూడని వారెవరయినా ఉంటే తప్పక చూడండి … #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక్కసారి బంధాలు గాడితప్పితే… కథలో ఇక అన్నీ రోత ట్విస్టులే…
  • నిర్దోషిత్వం బయటపడేలోపు… నింద మాన్పలేని మచ్చల్ని మిగిలిస్తుంది…
  • వింత విజ్ఞత..! 90 శాతం గెలవని గెలుపు అసలు గెలుపే కాదట..!!
  • పాక్ గురించి కాదు, పాజ్ గురించే చర్చ..! ఉస్మాన్ తారీఖ్‌తో ఆడుకుంటారా..?
  • జీరోలు, సింగిల్ సీట్లు..! మున్సిపల్ తీర్పులో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్..!!
  • కొన్ని కేసుల్లో న్యాయం ఓ చిక్కు ప్రశ్నే… ఇదీ అలాంటి కేసే…
  • పట్టణ వోటర్లూ చెప్పేశారు..! రేవంతుడి లీడర్‌షిప్‌కి క్లియర్ బూస్టప్..!!
  • శారద అనగానే… కథలూ, మాటలూ రెచ్చిపోయి రాసేస్తారు బ్రదర్స్…
  • స్టయిలిష్ సనాతనం… భజన్ క్లబ్బింగ్… న్యూ స్పిరిట్యుయల్ వైబ్స్…
  • డ్రమ్ముల కొద్దీ గాఢమైన యాసిడ్ కొనుగోలు… ఎపిస్టీన్ ప్లానేమిటి..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions