.
మొన్నటి నుంచీ ఒకటే ఊదరగొడుతున్నారు… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాత్కాలికంగా సీఎం కాబోతున్నాడని..! మన కలలు ఫలించాయి అని జనసేన ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నట్టుగా భ్రమింపజేసే పోస్టులు కనిపిస్తున్నాయి… అవేకాదు, పలు యూట్యూబ్ చానెళ్లు, సైట్లు, చివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా వెబ్‌సైట్లు కూడా ఎడాపెడా రాసిపారేశాయి ఈ వార్తను…
డౌట్ ఏమిటంటే..? చంద్రబాబుకూ, పవన్ కల్యాణ్‌కూ నడుమ మంట పెట్టే ఎత్తుగడ, ఉద్దేశపూర్వక క్యాంపెయిన్ అనిపిస్తోంది… లేకపోతే సీఎం నాలుగు రోజులు విదేశీ పర్యటనకు వెళ్తే సీఎంగా ఇన్‌చార్జి బాధ్యతల్ని డిప్యూటీ సీఎంకు అప్పగిస్తారా..? అసలది తెలుగు రాష్ట్రాల్లో ఏనాడైనా ఆనవాయితీ ఉందా..?
Ads
ఏ సీఎం అలా చేయడు, అందులోనూ చంద్రబాబు చేస్తాడా..? నెవ్వర్… అసలు ఇండియన్ పాలిటిక్సులో సీఎం జైలుకు వెళ్తేనే పెళ్లాన్నో, మరో ఫ్యామిలీ మెంబర్‌నో సీఎం కుర్చీలో కూర్చోబెడతారు తప్ప, అన్యుల నీడను కూడా సీఎం కుర్చీపై పడనివ్వరు… అలాంటిది ఇన్‌చార్జి సీఎం బాధ్యతలు అప్పగిస్తారా ఎవరైనా..?
అసలు డిప్యూటీ సీఎం అంటే ప్రత్యేక అధికారాలు ఏమీ ఉండవు రాజ్యాంగం ప్రకారం… అదొక హోదా, అదొక ప్రాధాన్యపూర్వక గుర్తింపు… అంతే… అంతకుమించి ఏమీ లేదు… డిప్యూటీ సీఎం అయినా సరే, జస్ట్, ఓ మంత్రివర్గ సభ్యుడు… లోకేష్ ఎంతో పవన్ కల్యాణూ అంతే…
లోకేష్ అంతకుమించి, ప్రస్తుతం టీడీపీ పార్టీ, ప్రభుత్వ యవ్వారాలు కీలకమైనవి మొత్తం తనే డీల్ చేస్తున్నాడు… ఆ లోకేష్‌కు కూడా ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వొచ్చు సీఎం తలుచుకుంటే..! కానీ అదీ చేయడు చంద్రబాబు… అదే చేస్తే పవన్ కల్యాణ్‌తో దూరం, అపోహలు తప్పవు… సంకీర్ణ ప్రభుత్వంలో అలాంటివి కుదరవు కూడా…
ఐనా చంద్రబాబు త్వరలో సింగపూర్ వెళ్తున్నాడు సరేగానీ… ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లలేదు..? ఎప్పుడైనా ఎవరికైనా సింగిల్ ఫైల్ క్లియర్ చేసే బాధ్యతలు ఇచ్చాడా..? అవసరమైతే విదేశాల నుంచే సమీక్షలు, నిర్ణయాలు ఉంటాయి, తప్ప చిన్న బాధ్యతను కూడా తను ఎవరికీ అప్పగించడు, నమ్మడు…
పైగా వెళ్లేది జస్ట్, నాలుగు రోజులు… 26 నుంచి 30 వరకు… సో, తూచ్…!! పైగా ఏవో షూటింగుల్లో బిజీగా ఉండి ఉంటాడు పవనుడు, డిస్టర్బ్ చేయకండి కొన్నాళ్లు..!!
Share this Article