.
పవన్ కల్యాణ్, తన మూడో భార్య అన్నా లెజినోవా ‘ఇడుపు కాయితం’ ఓ సంచలనం… అది వాళ్లిద్దరి వ్యక్తిగతమే అయినా, టీడీపీతోపాటు విచిత్రంగా వైసీపీ కూడా దీనిపై సంయమనం పాటించాలని నిర్ణయించినా… తను యాక్టివ్ ప్రజాజీవితంలో, ఓ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మీడియా స్పందిస్తూనే ఉంటుంది… ఆయా పార్టీల అభిమానులు కూడా వ్యక్తులుగా స్పందిస్తుంటారు, పార్టీ హోదాలతో కాదు…
సినిమాలు, పాలిటిక్స్… ఈ రంగాల్లో మూడు కాదు, నాలుగు పెళ్లిళ్లూ చూసిందే, విన్నదే… అది మరీ అంత అసాధారణమేమీ కాదు… కానీ ఇది తాజా వార్త కాబట్టి కొన్నాళ్లు చర్చల్లో ఉంటుంది… ఎన్నికలొచ్చాక మళ్లీ విమర్శల్లోకి కూడా వస్తుంది… సహజం…
Ads
సోషల్ మీడియా పోస్టులను బట్టి…… ఆరేళ్లుగా ఇద్దరి మధ్య అంతర్గతంగా వివాదాలు చోటు చేసుకున్నాయి… మరీ రెండేళ్లుగా ఇద్దరూ ఎడమొఖం పెడమొఖం… జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న కోట రుక్మిణి కారణం అని అప్పట్లో గుసగుసలు కూడా వినిపించాయి… రాయలసీమ జనసేన వీర మహిళ పసుపులేటి పద్మావతి కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ చుట్టూ ‘కోట కట్టేసిన రుక్మిణి’ అని బాహాటంగా విమర్శించింది…
సరే, అవన్నీ జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఎవరో ఏదో అసంతృప్తిని అలా వెళ్లగక్కుతారు అనుకుని అప్పట్లో జనం కూడా కొట్టి పారేశారు… ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు… ఇటీవల కాలంలో ఆమె ఉప ముఖ్యమంత్రిని పూర్తిగా గుప్పెట్లో పెట్టేసుకుంది… ఆ పార్టీలో నెంబర్ టూ స్థానంలో వున్న నాదెండ్ల మనోహర్‌ను కూడా వెనక్కి నెట్టి ఆమె నెంబర్ టూ స్థానంలోకి వచ్చేసింది…

పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరిన ప్రతిసారీ ఆమె దగ్గరుండి చూసుకుంది… అన్నా లెజినోవా ప్రేక్షక పాత్రకు పరిమితమైంది… నిజానికి పవన్ కళ్యాణ్ మనస్తత్వం కొంత భిన్నం… తనకు మనసులో ఏమనిపిస్తే అది చేసేస్తాడు… భయపడడు… తన వ్యక్తిగత జీవితం తన ఇష్టం అనుకుంటాడు… విమర్శలు పట్టించుకోడు…
మూడు పెళ్లిళ్లు అనే విమర్శలు బలంగా వచ్చినప్పుడు… ఎక్కడో ఏదో మీటింగులో ‘మీరూ చేసుకొండి, ఎవడు వద్దన్నాడు’ అని స్పందించాడు తను… అదీ తన స్టయిల్… సనాతన ధర్మ వీరపరిరక్షకుడిగా చెప్పుకుంటూనే హిందూ వివాహ వ్యవస్థ, దాంపత్య ధర్మం వంటివేమీ పట్టించుకోడు… ఆ నలుగురు పిల్లలకు తమ పేరెంట్స్ విడాకులు జీవితాంతం మానసికంగా, సామాజికంగా వేధించే సమస్యే… విదేశాల్లో ఇవన్నీ కామన్, కానీ ఇండియాలో ఈరోజుకూ దాంపత్య ధర్మం అనేది పెద్ద సబ్జెక్టు… పిల్లలున్న దంపతులైతే మరీనూ…
ఒకటి మాత్రం నిజం… దీన్ని సాహసం అంటారో, ఇంకేదైనా పదం ఉందో తెలియదు గానీ… స్టార్ హీరో, ఉప ముఖ్యమంత్రి హోదా, ప్రధాని మోడీతో సాన్నిహిత్యం, చంద్రబాబుతో రాజకీయ స్నేహం, లక్షల అభిమానులు, ఏపీ రాజకీయాల్లో తను కీలకం… ఈ స్థాయిలో మరొకరు ఉంటే మూడో పెళ్లి ఇడుపు కాయితం గురించి ఆచితూచి నిర్ణయం ప్రకటించేవారు… కానీ పవన్ కల్యాణ్ కదా… గుడ్ బై చెప్పేశాడు తన రష్యన్ భార్యకు..!!
ఇంతకీ ఎవరు ఆ కోట రుక్మిణి..? కృష్ణా జిల్లాకు చెందిన ఈమె లండన్‌లో వున్నప్పుడు 2020లో అభిమానిగా పవన్ కళ్యాణ్‌కు పరిచయం… అక్కడ ఆమె బ్రాండెడ్ షోరూం నిర్వహించేది… ఆ తరువాత ఆయన విదేశ పర్యటనలను ఆమే పర్యవేక్షించే స్థితికి చేరుకుంది… అన్నా లెజినోవా దగ్గరుండి మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసినా, ప్రారంభోత్సవంలో మాత్రం అంతా రుక్మిణిదే ప్రధాన పాత్ర…
2024లో జనసేన వీర మహిళా విభాగం ఆమె చేతుల్లోకి వెళ్ళింది… ఆ తరువాత కీలక పార్టీ ప్రజా సంబంధాలు, పొలిటికల్ ఎఫైర్స్ వైస్ చైర్ పర్సన్‌గా, పవన్ కళ్యాణ్ పర్యటనలు దగ్గరుండి చూసుకోవడం వరకు… ఆమే ప్రధాన జనసేనాని… అప్పట్లో ఆమె ఎవరో ఆరోపించినట్టు… పవన్ చుట్టూ ఆమె ఓ కోట రుక్మిణి..!!
Share this Article