.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాబ్, మీరు ఏమీ టెంప్ట్ కానవసరం లేదు… అసలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రిరిలీజులో ఏం మాట్లాడాడో వినాలనో, తెలుసుకోవాలనో మీరు ప్రయత్నించాల్సిన అవసరం లేదు… ప్రభావానికి గురికావల్సిన అవసరం అంతకన్నా లేదు…
ఆయన ఇంకా ఓజీ, హరిహరవీరమల్లు బాపతు సినిమా మనిషిగానే మాట్లాడుతున్నాడు తప్ప ఇంకా పొలిటిషియన్ కాలేకపోతున్నట్టుంది… సినిమా టికెట్ రేట్లు పెంచితే తప్పు లేదట, పైగా దాంతో బ్లాక్ టికెట్లను అరికట్టవచ్చునట… అంతకుమించి ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందట… ఓ శుష్క సమర్థన…
Ads
బ్లాక్ మార్కెట్ ఆగాలంటే, ఆ మార్గాల్ని తొక్కేయాలే తప్ప,.. ఎలాగూ బ్లాక్ అవుతోంది కదాని, అందులో ఆదాయం వెతుక్కుందామనే ధోరణి ఏమిటో తనకు తెలియాలి, తన భాగస్వామి చంద్రబాబుకు తెలియాలి, ప్రోత్సహించే బీజేపీకి తెలియాలి… సో, ఇదే కారణంతో తెలంగాణలోనూ రేట్లు పెంచమంటారేమో, చూసుకొండి…
అసలే దిల్ రాజు నీకు కావల్సిన మనిషి… ఒత్తిడి తెస్తాడు, తెలంగాణ జనానికి మాటిచ్చావు, నో బెనిఫిట్ షోస్, నో టికెట్ రేట్ హైక్ అని… అసలు ప్రిరిలీజులు అనబడే సోకాల్డ్ ఫ్యాన్ గ్యాదరింగులే సమాజానికి నష్టదాయకం… నీ స్టాండే కరెక్టు… నో అంటే నో అని ఘాఠ్టిగా చెప్పేసెయ్… సినిమాల ప్రచారానికి ఇవి అవసరం అని ఏదో చెబుతున్నాడు, నువ్వు పట్టించుకోకు…
మేం హీరోలతో నమస్కారాలు పెట్టించుకునేవాళ్లం కాదు అంటున్నాడు పవన్ కల్యాణ్… అబ్బే, నీ గురించి కాదులే… పోలీస్ అడ్డాలోకి పిలిపించి మరీ నమస్కారాలు పెట్టించుకున్న నిన్ను కాదు, అప్పట్లో జగన్ అలా చేశాడట, తనను అన్నాడు… నువ్వు అల్లు అర్జున్ విషయంలో చేసింది కరెక్టే అన్నాడు కదా ఆమధ్య…
అందుకే మూలాలు మరిచిపోవద్దు అని బన్నీని అంటున్నాడు పరోక్షంగా… చిరంజీవిని, మెగా క్యాంపును మరిచిపోవద్దు, మరిచిపోతే ఇలాగే ఉంటుందని మర్మగర్భంగా బన్నీకి చెబుతున్నాడు… అంతేతప్ప, నిన్నేమీ అనడం లేదు…
బ్లాక్ టికెట్లు విషయానికి వద్దాం… ఆయనేదో చెబుతుంటాడు, సినిమా మనిషి కదా, ఏదో డొల్ల సమర్థన… నిజానికి ఆన్‌లైన్ బుకింగులు వచ్చాక దాదాపు స్ట్రీమ్‌లైన్ అయ్యాయి టికెట్ల అమ్మకాలు… ప్రత్యేకించి సిటీల్లో… ఓ మోస్తరు పట్టణాలైనా సరే, ప్రభుత్వం అంటే థియేటర్లకు భక్తి, భయముంటే ఏ బ్లాకులూ నడవవు…
అసలు టికెట్ రేట్ల పెంపు దేనికి…? నిర్మాణవ్యయాలు పెరిగినందుకు..? అందులో అధికభాగం హీరోల పారితోషికాలే… దండుకునేదీ వాళ్లే, నయా దేవుళ్లుగా భ్రమల్లో బతికేదీ వాళ్లే… అందుకే హీరోగా మాత్రమే పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నాడు… కానీ జనం దోపిడీకి గురవుతున్నారనే కోణంలో తనలోని పొలిటిషియన్ ఆలోచించడం లేదు… కనుక, తెలంగాణలో రేట్లు, షోస్, ఫంక్షన్లపై మీ స్టాండ్ యథాతథంగా కాపాడుకొండి… జనం మెచ్చుతారు…!!
Share this Article