Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘ట్రిపుల్ ఎక్స్’ సంస్కార రాజకీయాలు..! రొచ్చు, బురద రేంజ్ కూడా దాటేశారు..!!

September 29, 2021 by M S R

‘‘… సర్వమంగళం పాడింది’’ అన్నట్టు రాజకీయంగా పూర్తిగా దివాలా తీసిన పవన్ కల్యాణ్‌ను మళ్లీ తెరపై కనబడేలా చేస్తున్నది వైసీపీ మాత్రమే, ఆ పార్టీకి ప్రతిపక్షాన్ని కౌంటర్ చేయడంలో కూడా ఓ దిశ లేదు, ఓ దశ లేదు ……… ఈ విశ్లేషణ చాలామందికి రుచించలేదు మొన్న… నో, నో… రిపబ్లిక్ మూవీ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు రాష్ట్ర మంత్రులు మస్తు కౌంటర్ ఇచ్చారు అని అభిప్రాయపడ్డారు… కానీ ఇప్పటికే ఒకటే నిజం… పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ రాంగ్ స్ట్రాటజీ… ‘‘ఊరుకున్నంత ఉత్తమం లేదు’’… ఇదే అనుసరణీయ మార్గం… పవన్ కల్యాణ్ విమర్శలపై ఎవ్వరూ నోరు మెదపకుండా ఉన్నట్టయితే… ఫోఫోవోయ్, నిన్ను అసలు దేకడం లేదుఫో అన్నట్టుగా మౌనంగా ఉండి ఉంటే… పవన్ గింజుకోవాల్సి వచ్చేది..! వైసీపికి ఈరోజుకూ రెండు పెద్ద మైనసులు… 1) మీడియా, సోషల్ మీడియా వాడకంలో వైఫల్యం… 2) రాజకీయంగా దాడి, ఎదురుదాడి, ఖండన విషయాల్లో దిశారాహిత్యం…

ఇప్పుడేం జరిగింది..? బజారులో కుక్కలు కొట్లాటలాగా మారిపోయింది యవ్వారం… వైసీపీకి ఏం ఫాయిదా వచ్చింది..? అప్పట్లో కొడాలి నాని బూతుపురాణాన్ని వందలరెట్లు మించి పోసాని బూతుపురాణం… ఛిఛీ, ఏ పాపమూ తెలియని ఇంట్లోని ఆడవాళ్లను కూడా తిట్టేస్తున్నారు… అఫ్‌కోర్స్, పవన్ సైకోఫ్యాన్స్ మెసేజులు, ఫోన్ కాల్స్‌తో పోసానికి పిచ్చి రేగిపోయి ఉంటుంది… అంతే, భాష అదుపు తప్పింది, సంస్కారం మూసీలో కలిసింది, మనిషి ఏం మాట్లాడుతున్నాడో తనకే సోయి లేకుండా పోయింది… ఇదంతా వైసీపీకే నష్టం… సినిమావాళ్లు తమలోతాము తన్నుకుంటే మాకేంటి అని తప్పించుకోవడానికి కూడా వీల్లేదు వైసీపీకి…! ఇది సినిమా రచ్చకన్నా ప్రధానంగా పొలిటికల్ రచ్చే… పవన్ బురదలోకి లాగాడు, వీళ్లంతా కళ్లుమూసుకుని బురద బరిలోకి ప్రవేశించారు… ఇక తన్నులాట షురూ… (పోసాని ఇప్పుడు భగభగ మండిపోతున్నాడు కదా, మరి అప్పట్లో మహేష్ కత్తి ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడు..?)

pk

Ads

రాష్ట్రంలో తమ ప్రత్యర్థి ఎవరో, ప్రధాన ప్రతిపక్షం ఎవరో, ఎవరిని రాజకీయంగా ఎదుర్కోవాలో వైసీపీ ముందుగా ఓ క్లారిటీకి రావాలి… కొందరిని జస్ట్, ఇగ్నోర్ చేయడం ద్వారా నష్టపరచొచ్చు… ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయంగా నష్టపోయేది ఏముంది కొత్తగా..? ఏమీలేదు…! కానీ ఈ వివాదాన్ని కెలకడం ద్వారా ‘‘జగన్‌ను సరిగ్గా, ధైర్యంగా ప్రశ్నించగలిగేది, నిలదీసేది నేను మాత్రమే’’ అనే సంకేతాల్ని ప్రజల్లోకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు… వైసీపీ వాళ్లు తెలిసోతెలియకో పవన్ స్ట్రాటజీకి సహకరిస్తున్నారు… అబ్బే, పవన్‌ను తిట్టడం, తిట్టించడం వల్ల మాకు నష్టమేమీ లేదు, మేం భలే కౌంటర్ చేస్తున్నాం అని వైసీపీ అనుకుంటే అంతకుమించిన భ్రమ మరొకటి ఉండదు, కొన్ని నష్టాలు అంత త్వరగా అర్థం కావు… ప్రజలు ఈ రొచ్చు పంచాయితీని ఎంజాయ్ చేయడం లేదు, మౌనంగా గమనిస్తున్నారు, లోలోపల ఏవగించుకుంటున్నారు… అది పవన్ కల్యాణ్‌కు కాదు, అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ నష్టం కలిగిస్తుంది… అయితే… ‘‘పవన్ కల్యాణ్‌కు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఓ స్ట్రాటజీ, దీనివల్ల చంద్రబాబును హ్యుమిలియేట్ చేస్తున్నాం, ప్రజల్లో ఆయన్ని మైనస్ చేస్తున్నాం…’’ అని ఒకాయన పొద్దున గట్టిగా సమర్థించుకున్నాడు… నవ్వొచ్చింది..! వీళ్లకు పవన్ కల్యాణే బెటర్ అనిపించేంతగా…!! ఈ ‘ట్రిపుల్ ఎక్స్’ సంస్కారవంత రాజకీయాలు ఇంకా ఏ ‘ఎక్స్ ప్లస్’ రేంజుకు చేరుతాయో అని భయపడేంతగా..!! 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions