నా పోస్టులకు రీచ్ ఘోరంగా పడిపోయింది… ఏమిటీ దారుణం..? అయ్యో, నేను సారంగలో రాసిన కంటెంట్‌ను షేర్ చేస్తే కమ్యూనిటీ స్టాండర్డ్స్ పేరిట ఫేస్ బుక్కోడు రిమూవ్ చేశాడు… ఏమిటీ దరిద్రం..? బాబోయ్, వీడు నా మీద రెస్ట్రిక్షన్స్ పెట్టేశాడు, కాస్త పదిమందీ కాస్త పోకండి, వాడిని గోకండి గురూ… ఏమిటీ ఘోరం..?
ఇలాంటి పోస్టులు విపరీతంగా కనిపిస్తున్నాయి ఈమధ్య ఫేస్ బుక్ వాల్ మీద..! తాము వివిధ పత్రికల్లో, వెబ్ సైట్లలో రాసిన కంటెంట్‌ను ఫేస్ బుక్ మిత్రులతో షేర్ చేసుకుందామని వాల్ మీద లింకులు పెట్టడం సహజం… వెబ్ సైట్లకు కూడా ప్రత్యేకంగా ఫేస్ బుక్ పేజీలు కూడా ఉంటాయి… అది ఎన్నాళ్లుగానో ఉన్నదే…
కానీ ఇప్పుడు ఫేస్ బుక్కోడు ఆ లింకులు కనిపిస్తే చాలు రిమూవ్ చేస్తున్నాడు… నువ్వు ఎక్కువ లైకులు, ఎక్కువ షేర్ల కోసం ఇలా చేస్తున్నావ్, ఇది నా కమ్యూనిటీ స్టాండర్డ్స్‌కు విరుద్ధం, ఇలాగే చేస్తే మొత్తం ఖాతాను డియాక్టివేట్ చేసేస్తాం, నీ పేజీని రద్దు చేసేస్తాం… ఇలాంటి హెచ్చరికలు వస్తుంటాయి…
Ads
లైకులు, షేర్ల కోసం కాకపోతే ఫేస్‌బుక్కులో ఎవరైనా దేనికి ప్రయత్నిస్తారు, తనకు తెలియదా..? కోట్ల ఫేక్ ఖాతాలు, విస్తృతంగా ఫేక్ క్యాంపెయిన్స్, రాజకీయాలు, ఉన్మాదాలు, నానా చెత్తా అంతా పోస్టు అవుతూనే ఉంటుంది… ఎవరైనా సిన్సియర్‌గా కొన్ని విలువలతో కూడి కంటెంట్ షేర్ చేసుకుంటే మాత్రం రెస్ట్రిక్షన్స్, రిమూవల్స్… ఇదంతా ఓ దందా…
వెబ్ సైట్ లింక్స్ షేర్ చేసుకుంటే… ఎవరో కమర్షియల్ యాక్టివిటీకి మా ఫేస్ బుక్ ఎందుకు ఉపయోగపడాలనే భావనతో ఈ రిమూవల్స్ స్కీం… అదే లింక్‌కు డబ్బు కట్టి ‘ప్రమోట్’ చేసుకుంటే తనే రీచ్ పెంచుతాడు… మన ప్రొఫైల్ రీచ్ పెంచుతాడు వాడే… మన పోస్టులకు ప్రమోషన్ రేటు కట్టేదీ వాడే… చివరకు లైకులు, షేర్లకు కూడా డబ్బులే… వాల్ మీద బోలెడు ప్రొఫైల్స్ కనిపిస్తుంటాయి, రీల్స్ కనిపిస్తుంటాయి… అవన్నీ ప్రమోషన్ బాపతే… డబ్బు కట్టు, ఫేస్ బుక్కును వాడుకో… అంతే…
అందుకే ఒకప్పుడు బాగా యాక్టివ్‌గా ఉండి, ఫేస్ బుక్ అనే ఓ పెద్ద సొసైటీలో ఉండటానికి ఇష్టపడిన చాలామంది ఇప్పుడు వెళ్లిపోయారు, ఇంకా వెళ్లిపోతున్నారు… ఫేక్ ఖాతాలు, ప్రమోషన్లు, క్యాంపెయిన్లు, ఫేక్ కంటెంట్ మురికిలా ప్రవహిస్తోంది… ట్రోలింగ్, బూతులు సరేసరి… నా పోస్టులో యాంటీ సోషల్ కంటెంట్ ఏముందని రిమూవ్ చేశావు అనడగడానికి ఏమీ ఉండదు, నో గ్రీవియెన్స్, నో సొల్యూషన్స్… అసలు ఫేస్ బుక్ టీంలో తెలుగు తెలిసినవాళ్లు ఎవరు..? ఎవరు ఎవరికి చెప్పుకోవాలి..? ఏమీ ఉండదు… మోనోపలీ…
అప్పట్లో కేంద్రం తీసుకొచ్చి ఐటీ రూల్స్ ప్రకారమైనా గ్రీవియెన్స్ రిడ్రెసల్ సిస్టం ఉండాలి… ఉందేమో నామమాత్రంగా… అన్నట్టు, ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ కొన్నాక, ఎక్స్ అని పేరు పెట్టుకున్నాక… అక్కడా అంతే, డబ్బు, డబ్బు… ఖాతా అథెంటిఫికేషన్ దగ్గర నుంచి, పోస్ట్ ఎడిట్ చేయాలంటే డబ్బు, ఎక్కువ కంటెంట్ పెట్టాలంటే డబ్బు, ఎక్కువ మంది రీచ్ కావాలంటే డబ్బు… డబ్బున్నవాళ్లు ఎలా వాడుకున్నా సరే, వాడు ఏమీ అనడు… ఇదొక సోషల్ దరిద్రం మన చుట్టూ ఆవరించింది… అది చెప్పుకోవడమే ఈ కథనం…
Share this Article