Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినిమా ప్రమోషన్లకు రాకపోతే… ఇక ఇండస్ట్రీ నుంచే బహిష్కరించేస్తారా..?!

May 21, 2024 by M S R

సరే, హీరోయిన్ పాయల్ రాజపుత్ సదరు రక్షణ అనే సినిమా నిర్మాత ప్రణదీప్ ఠాకూర్‌కు 50 కాల్‌షీట్లు ఇచ్చింది… ఆయన గారు 47 వాడేసుకున్నారు… మరో 3 కాల్‌షీట్లు సినిమా ప్రమోషన్ కోసం అలాగే ఉంచుకున్నారు… ఆ సినిమా కంప్లీట్ అయ్యిందా లేదా తెలియదు,.. ఈమధ్యే ఏదో టీజర్ రిలీజ్ చేసినట్టున్నారు… ఇప్పుడు ప్రమోషన్లు ప్లాన్ చేశాం, వచ్చెయ్ అంటాడట… అదేమంటే 3 కాల్ షీట్లు వాడుకోలేదు కదా అంటాడట…

ఇప్పుడు హఠాత్తుగా పాయల్ సోషల్ తెర మీదకు వచ్చి, తనకు డబ్బు బాకీ ఉన్నాడు, ఇవ్వడం లేదు సరికదా, ఫోన్లు చేసి, బూతులు వాడేస్తున్నాడు, నన్ను టాలీవుడ్ నుంచి బయటికి తరిమేస్తానని బెదిరిస్తున్నాడు అని ఆరోపించింది… మామూలుగా సినిమా తారల సిట్యుయేషన్ ఇండస్ట్రీలో ఎంత సెన్సిటివో తెలుసు కదా, సదరు నిర్మాత బెదిరింపులు ఎంత మితిమీరితే ఆమె ఈ ఆరోపణలకు దిగిందో అర్థం చేసుకోవచ్చు…

పైగా ఇప్పటివరకూ ఏ నిర్మాతా తను సతాయిస్తుందని కంప్లయిట్ చేయలేదు ఇప్పటిదాకా… సదరు ఠాకూర్ పాయల్ ఆరోపణలకు జవాబు ఇవ్వకుండా సైలెంటుగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశాడు… వాళ్లేం చేశారు..? ఏమీ తేల్చకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఈ కేసు ట్రాన్స్‌ఫర్ చేశారు… ఆమెనేమో అందులో మెంబర్ కాదు… తమ మెంబర్ కాకపోతే ఆ సంఘమూ ఏమీ తేల్చదు… మరి..?

Ads

ఇక్కడ పంచాయితీ ఎటు పోతుందనేది ప్రశ్న కాదు… ఆమె సినిమా ప్రమోషన్లకు గనుక రాకపోతే సినిమాకు తద్వారా వచ్చే నష్టాల్ని పాయల్ భరించాలట… ఇదేమిటి..? ఒక హీరోయిన్ సినిమా ప్రమోషన్‌కు రాకపోతే వచ్చే నష్టాన్ని ఎవరు, ఎలా లెక్కించాలి..? ఒకవేళ ఆ సినిమా చీదేస్తే దానికి ఆమె బాధ్యత ఏముంటుంది..? బోలెడు మంది హీరోయిన్లు గుమ్మడి కాయ కొట్టాక అసలు పట్టించుకోరు, డబ్బింగ్ కూడా ఎవరితోనైనా చెప్పించుకో అనేస్తారు…

వోకే, ముందస్తు ఒప్పందాల ప్రకారం పాయల్ ప్రమోషన్లకు నిరాకరించొద్దు నిజమే… సినిమా రిలీజయ్యాకే బాకీపడిన 6 లక్షలూ ఇస్తానని చెబుతున్నాడు వోకే… కానీ నువ్వు ఏదో తేదీల్లో ప్రమోషన్లు పెట్టుకుని, వచ్చెయ్ అంటే… ఆ డేట్లను ఆమె ఇంకెవరికో ఆల్రెడీ ఇచ్చేసి ఉంటే… ఆ నిర్మాత మొహాన మన్నుపోయాలా..? ఆ నిర్మాత ఊరుకుంటాడా..? ఏకంగా ఇండస్ట్రీ నుంచే బాయ్‌కాట్ చేసేస్తారా..?

ఆమెకు బాకీ ఉన్న ఆ ఆరు లక్షలకూ చెక్కును నిర్మాతల మండలికి ఇచ్చాడట… ఆమె ప్రమోషన్లకు వస్తేనే, సినిమా రిలీజైతేనే ఆ డబ్బును ఆమెకు మీరే ఇచ్చేయండని చెప్పాడట… నిజానికి నిర్మాతల మండలే తేల్చాలి ఇది… ఎందుకంటే ఓ నిర్మాత ఫిర్యాదు చేశాడు కాబట్టి… ఇలాంటివన్నీ మధ్యేమార్గంగా, మంచితనంతో, రాజీమార్గంలో సెటిల్ చేసే పెద్ద తలకాయలు కరువయ్యాయి ప్రస్తుతం ఇండస్ట్రీలో… అదీ అసలు సమస్య… పాయల్ కాబట్టి బెదిరిస్తున్నారు, మరో పెద్ద నటి అయితే ఏం చేసేవారు..? సింపుల్… మూసుకునేవాళ్లు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… బన్నీ జాతీయ ఉత్తమ నటుడు… రేవంత్ రెడ్డి పిసరంత ఎక్కువే…
  • మంత్రి సోదరుడికి అవార్డు..? ఈ హుడావుడి లేట్ ప్రకటన ఏమిటి..?
  • స్వాతి..! ఓ కుంతీపుత్రి కథ… మగాధిపత్యంపై ఓ ధిక్కారపతాక…!!
  • సూప‌ర్ స్టార్ కృష్ణ విశ్వప్రయత్నం చేసీ చేసీ ఓడిపోయిన ‘ప్రాజెక్టు’..!!
  • రేవంత్‌రెడ్డి సర్కారు నిజంగానే గద్దర్‌ను అవమానించిందా..?!
  • చావు తరుముకొచ్చింది… అది గొంతులో ఇరుక్కుని మరీ కుట్టి చంపింది…
  • మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు… ఓ పాత ఇంట్రస్టింగ్ స్టడీ ఇది…
  • ఆ అవార్డు అంటేనే అక్కినేనికి ఓ పరవశం… ఏంటది..? ఎవరిచ్చారు..?
  • విధి… ఆ సీటొక్కటే విరిగి దూరంగా పడి బతకడం అబ్బురమే…
  • అంతటి ఎన్టీయార్‌కే తప్పలేదు… పాపం కొమ్మినేని ఎంత..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions