Jagannadh Goud…… కిషోర్ బియానీని శ్యాం వాల్టన్ ఆఫ్ ఇండియా అంటారు. శ్యాం వాల్టన్ అంటే అమెరి లో అతి పెద్ద రీటైల్ సంస్థ “వాల్ మార్ట్” ని స్థాపించిన అతను. అతని పిల్లలు గత చాలా యేండ్లుగా ప్రపంచంలో టాప్ 20 ధనవంతులుగా ఉంటున్నారు.
కిషోర్ బియాని గార్ని రీటైల్ కింగ్ ఆఫ్ ఇండియాగా కూడా ప్రపంచం కొనియాడింది. కిషోర్ బియాని గారు స్థాపించిన “ఫ్యూచర్ రీటైల్” నష్టాల్లో ఉన్నప్పుడు ముఖేష్ అంభానీ దాన్ని కొని సహాయం చేద్దాం అని చూస్తే, అమెజాన్ వాడు అంతర్జాతీయ కోర్ట్ లో కేస్ వేసి ఫ్యూచర్ రీటైల్ ని సంక నాకించాడు, కిషోర్ బియానిని సంక నాకించాడు.
విజయ్ మాల్యా గారి కింగ్ ఫిషర్ బీర్ ప్రపంచంలో 170 దేశాల్లో అమ్ముడు పోయేది. నాకు తెలిసి ఇండియా నుంచి ఎక్స్ పోర్ట్ అయ్యే వాటిల్లో అత్యధిక నాణ్యత కలిగినది కింగ్ ఫిషర్ బీర్ ఒక్కటే. విజయ్ మాల్యా గారు ఎయిర్ లైన్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టగానే అరబ్ కంపనీ ఇతియాడ్, ఇంకా ఏమి జరిగిందో ఏమో విజయ్ మాల్యా గారు దేశం విడిచి పోయేలా చేశారు…
Ads
ప్రస్తుతం కొంతమంది ముఖేష్ అంబానీ మీద ఏడుస్తున్నారు PayTM కొంటున్నాడు అని… చాలా కష్టపడి విజయ్ శేఖర్ శర్మ అని ఒక యువకుడు PayTM సంస్థని 2010 లో స్థాపించి నిజంగా మన దేశానికి డిజిటల్ మనీలో ఒక మార్గం వేశాడు. విజయ్ శేఖర్ శర్మ ఒక బడి పంతులు కొడుకు. ప్రస్తుతం ఏవో సమస్యల వలన నష్టాల్లో ఉంటే ముఖేష్ అంబానీ గారు సహాయం చేద్దాం అని చూస్తుంటే చాలా మంది ఏడుపులు.
అంబానీ గారు, మీ యాపారాలు అన్నీ మూసివేసి కొండాపూర్ లో కర్రీ పాయింట్ పెట్టుకోండి సార్ !
Share this Article