Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

క్యాచ్ మిస్… మ్యాచ్ మిస్… దరిద్రపు ఫీల్డింగులో పంజాబ్ టాప్…

May 7, 2026 by M S R

.

ఇది ఐపీఎల్… బాల్ బాల్‌కూ సిట్యుయేషన్ మారిపోయేంత టఫ్ ఫైట్స్… వరుస పరాజయాలతో ఇక కథ ముగిసినట్టే అనుకున్న చెన్నై జట్టు కూడా టాప్ 6 లోకి చేరి, నేనూ ప్లే ఆఫ్‌కు రెడీ అంటోంది ఇప్పుడు… మొదట్లో పరాజయాలతో షాక్ తిన్న హైదరాబాద్ జట్టు కొన్ని మార్పులు చేసుకుని, ఇప్పుడు టాప్ వన్ ప్లేసులోకి చేరింది పంజాబ్ జట్టును రాత్రి ఓడించి… ఇది తప్పకుండా ప్లేఆఫ్ జట్టే…

ఇక్కడ చెప్పాల్సింది పంజాబ్ జట్టు గురించి… మొదటి నుంచీ టాప్ రేంజ్ ఆట చూపిస్తోంది… మంచి బౌలింగ్, మంచి బ్యాటింగ్‌తోపాటు శ్రేయాస్ అయ్యర్ తెలివైన కెప్టెన్సీ… కానీ సీన్ ఛేంజ్ అయిపోయింది… ఈ జట్టు మబ్బుల్లో నుంచి కిందకు దిగింది… పాయింట్ల టేబుల్‌లో టాప్ వన్ ప్లేసులో ఉన్న జట్టు కాస్తా నిన్నటి హైదరాబాద్ దెబ్బకు సెకండ్ ప్లేసులోకి దిగిపోయింది…

Ads

అంతేకాదు, హైదరాబాద్ తన రన్ రేట్ కూడా మెరుగుపరుచుకుంది… ఏమో, శ్రేయాస్ అయ్యర్ ఈసారి పంజాబ్ జట్టును ఎలాగైనా ఫైనల్స్‌కు తీసుకెళ్తాడేమో గానీ… హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ జట్టు బలహీనతలన్నీ బయటపడ్డాయి… అన్నింటికీ మించి దరిద్రపు ఫీల్డింగ్… మొత్తం 18 క్యాచులు మిస్ చేసింది ఈ జట్టు ఇప్పటివరకు ఈ సీజన్‌లో… అన్ని జట్లకన్నా ఎక్కువ…

నిన్నటి మ్యాచులో కీలకమైన ఓ స్టంపింగ్ మిస్ కూడా… ఓ క్యాచ్ మిసయితే మ్యాచే మిసవుతుంది… ఈ నిజం పంజాబ్ జట్టుకు అర్థం కావడం లేదు… దీనికి తోడు హైదరాబాద్ బౌలర్ల మెరుగైన బౌలింగు పుణ్యమాని పంజాబ్ టాప్ ఆర్డర్ వికెట్లు టపటపా పడిపోవడంతో ఇక తేరుకోలేదు… భారీ తేడాతో ఓడిపోయింది… వరుసగా ఇది మూడో ఓటమి… పంజాబ్ జట్టుకు ఇది అప్రతిష్టే…

ఇక ఇప్పుడు హైదరాబాద్ 14 పాయింట్లతో అగ్రస్థానం… పంజాబ్ 13 పాయింట్లతో రెండోస్థానం… తరువాత స్థానాల్లో బెంగుళూరు, రాజస్థాన్, గుజరాత్ 12 పాయింట్లతో… బెంగుళూరుకు ఇంకా 5 మ్యాచులున్నాయి… సో, డిఫెండింగ్ ఛాంపియన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు… సో, టాప్ ఫోర్‌లో చేరేవి హైదరాబాద్, పంజాబ్, బెంగుళూరు, రాజస్థాన్… ఇవేనా..? చూడాలిక..!! ఢిల్లీ, గుజరాత్, చెన్నై బలంగానే పోటీలో ఉన్నాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అఖిల్ నటనలో కాస్త మెరుగుదల- ఓ సాదాసీదా తెలుగు సినిమా లెనిన్!!
  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions