ఫాఫం సుమ… అవును, అచ్చం ఇలాగే అనిపించింది ఒక ప్రోమో చూస్తుంటే… ఆమె ఈటీవీలో సుమ అడ్డా అని ఓ షో చేస్తుంది కదా… దానికేమో పూర్ రేటింగ్స్, నిజంగా ఇంకా ఆ షో వస్తుందా అనే సందేహం కూడా కలుగుతుంది అప్పుడప్పుడూ… పైగా సుమ ప్రోగ్రాం క్వాలిటీ మరీ జబర్దస్త్, ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీలను మించిపోయిందా అశ్లీలంలో అనిపిస్తుంది… చివరకు ఓ పద్ధతిగా ఉండే సుమ కూడానా ఇలా..? వాటే ట్రాజెడీ…!?
నిజానికి ఆ షో ఎపిసోడ్లు మొత్తం ఏవో సినిమా ప్రమోషన్లకు అంకితం చేస్తుంది సుమ… ఏవో దిక్కుమాలిన జోకులు, తలకుమాలిన గేమ్స్‌తో ఏదో అదే మొనాటనీతో నడిపించేస్తోంది… కానీ రేటింగ్స్ డౌనయిపోయి ఎవరూ చూడటం లేదేమో… ఇక తను కూడా అదే అశ్లీలం బాట పట్టింది… అందుకే చెప్పింది… ఫాఫం అని…
ఈసారి ఎపిసోడ్‌కు కమెడియన్ కమ్ మాజీ పొలిటిషియన్ కమ్ టీవీ హోస్ట్ ఆలీ వచ్చాడు… తోడుగా మాజీ జబర్దస్త్, కన్నడ నటి సౌమ్య… మరో జంటగా శ్రీహాన్, సిరి హన్మంతు జంట… వాళ్లెలాగూ నిజజీవితంలోనూ జంటే… కానీ మరీ ఆలీకి సౌమ్య జంట ఏమిటో… మరీ రవితేజ, భాగ్యశ్రీ బోర్సె జంటలా…!!
Ads
రావడంతోనే సుమ వైన్ గ్లాసులిస్తోంది… దిగువన మద్యపానం హానికరం అని హెచ్చరిక స్క్రోల్… సరే, అయిపోయింది… పాప కర్నాటక నుంచి వచ్చింది తెలుగు ప్రాబ్లం అని ఆలీ ఏదో అంటున్నాడు, నాకు తెలుగు వచ్చు, కానీ లింగతోనే ప్రాబ్లం కాస్త అని చెబుతోంది… సిన్సియర్, ఇక్కడ లింగ అంటే ఆమె దృష్టిలో మాట్లాడేటప్పుడు జెండర్ కన్ఫ్యూజన్ వస్తోంది అని…
లింగ..? అని సుమ బోలెడంత సిగ్గుపడిపోయింది… నీ సిగ్గు చిమడ… అదేదో బూతు అర్థమైనట్టు..? లింగ అంటే అదే అనుకునేట్టు… ఆలీ కూడా సేమ్ ఫేలింగ్… తనూ అంతే కదా… ఓహో, ఆ లింగా అన్నాడు… లింగ అనగానే ‘అది’ తప్ప మరొకటి అర్థమయ్యే రేంజ్ కాదు కదా… అక్కడికి సౌమ్య స్త్రీలింగ, పుంలింగ అని చెబుతూనే ఉంది… ఆమె సిన్సియారిటీ ఎదుట సుమ నీచంగా కనిపించింది…
ఎవడికో అన్ని సబ్జెక్టుల్లో ఒక్కొక్క మార్కు వచ్చి, ఇంకేదో సబ్జెక్టులో 99 వచ్చాయట, అదే అడిగితే ఆ టీచర్ అందంగా ఉంటది అని ఆలీ జవాబు… చెత్త టేస్ట్… ఇంకా ఆలీ మారలేదు, మారడు… ఇక్కడ సౌమ్య వచ్చేసి ‘ఏమీ చదవరు, నాకే లైన్ కొడతారు’ అని కామెంట్… ఎవడు రాశాడో గానీ ఈ స్క్రిప్ట్… మహానుభావుడు..?
అమ్మాయిల్ని ఏ డ్రెసులో చూస్తే అబ్బాయిలు ఇంప్రెస్ అయిపోతారు అని ఓ వెధవ ప్రశ్న… దానికి లంగా వోణి, మోడరన్ డ్రెస్సు, నైటీ, కాలేజీ యూనిఫామ్ అని ఆప్షన్లు… చివరకు ఎలా అయిపోయావు సుమా..? తరువాత ఏదో వీథి నల్లా పోర్షన్… ఈమెకన్నీ సెటప్పులే కావాలని సిరి హన్మంతు వెగటు వెటకారం, దానికి ఆమె నీకంటే సెటప్ ఉంది..? (శ్రీహాన్‌తో) నాకేముంది అని ఎదురు ప్రశ్న…
ఈ పైపు పెట్టిందే నా హజ్బెండ్ తెలుసా అని సౌమ్య పంచాయితీ, ఏడీ నీ భర్త అనడిగితే వేరే పొలంలో నాట్లేయిస్తున్నాడు అట… దేవుడా… నీ బిడ్డ వల్లేనా బస్తీ మొత్తం కంపు కొడుతోంది అని సుమ… పిల్లలకు — కడగడానికి నీళ్లు లేవు అని ఆలీ వ్యాఖ్య… (ముడ్డి కడగడానికి అని చేత్తో సూచిస్తూ..)… తరువాత పెళ్లిచూపులట… ఊ అంటావా మామా ఊఊ అంటావా పాటను తమిళంలోనో మలయాళంలోనో పాడుతోంది సుమ…
మొత్తం సీక్వెన్సు గమనించండి… వైన్, లింగం, టీచర్ అందంతో కనెక్షన్, లంగావోణి ఇంప్రెస్, సెటప్, పొలంలో నాట్లు, ముడ్డి కడగడం…. అన్నీ పక్కా ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ బూతులకు పోటీ… ఛీ, చివరకు సుమ కూడా ఆ బురద పొలంలో దిగబడిపోతే… ఇక ఎవరేమంటారు..? జాలిపడటం మినహా…!! సుమ వయస్సేమిటి..? ఈ వేషాలేమిటి..?
Share this Article