.
పజిల్ కా నాం సీక్వెల్! దేవర కాదు చెత్తరా…
రామాయణంలో పిడకల వేట! అంటే, మనం చేయాల్సిన పనికి, చేస్తున్న పనికి సంబంధం లేదని అర్థం! ఈ టైటిల్ తో అప్పట్లో ఓ సినిమా కూడా వచ్చింది! నాకు గుర్తున్నంతవరకు ఆ చిత్ర కథా, కథనం రెండూ పేరుకు తగ్గట్టుగానే సాగాయి!
Ads
కానీ, ఈ మధ్య సెల్యులాయిడ్కు ఎక్కుతున్న మెజారిటీ కథల్లో అసలు తల [Starting] కు తోక [Climax] కు సంబంధం ఉండటం లేదు! ఇదేందిరా అంటే, ఆ పజిల్ కు పార్టు 2 పేరిట సీక్వెల్ కలర్ ఇస్తున్నారు! కానీ, కథనం మీద పట్టు కోల్పోయి, సాంతం పొంతన లేకుండా భారీ ఖర్చుతో షూట్ చేసి, ప్రివ్యూలో ఆ మూవీ ఔట్ కం చూసినప్పుడు వాళ్లు తీసింది వాళ్లకే అర్థం కాక, ప్రేక్షకులకు ఏలా సర్ది చెప్పాలో తోచక దర్శక నిర్మాతలు ఆడే ఓ బిగ్ అన్ ఎథికల్ డ్రామానే ఈ పార్ట్ 2 థియరీ!
సరిగ్గా ఆ కోవలోనిదే జూ. ఎన్టీఆర్ దేవర! అది దేవర కాదు పెద్ద చెత్తరా! ఇంకా సీక్వెల్ ఏంటి ఆపరా! అన్నది డైరెక్టర్ కొరటాల శివకు వ్యూవర్స్ నుంచి పడుతున్న పంచ్! మూవీ ఫస్ట్ పార్ట్ లోనే హీరో రోల్లో ఉన్న 2 క్యారెక్టర్లు చనిపోయిన తరవాత, ఆ సీక్వెల్ ను ఎవరు హీరోగా, ఎందుకు, ఎలా తీస్తారో మరి! కేవలం హీరో చుట్టే తిరిగే ఇలాంటి స్టోరీలకు అసలు రెండో పార్టు స్కోపే లేదు! పూర్తి అస్పష్టమైన టేకింగ్ తో దేవర 2 అని ఒక ఎండ్ కార్డు వేసి దర్శకుడు ఈ మూవీలో ఒకరకంగా పిడకల వేటనే చేశాడు!
కట్ చేస్తే, క్రికెట్ వరల్డ్ కప్ కు ఇండియా ఆతిథ్యం ఇస్తోంది! ఓ 3 దేశాల అధ్యక్షులు ఆ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు! గ్యాంగ్ స్టర్ బ్రదర్స్ దయా అండ్ యతిల వల్ల ఆ ఈవెంట్ కు సెక్యూరిటీ థ్రెట్ అన్నది స్టోరీ లైన్! ఈ బ్యాక్ డ్రాప్ లో ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఓ కాన్ఫిడెన్షియల్ మీటింగ్! సెంట్రల్ హోం మినిస్టర్, రా చీఫ్, ఇతర బిగ్ కాప్స్ ల ప్రజెన్సనే పటాటోపంతో సినిమా ఫస్ట్ సీన్ గంభీరంగా షురూ ఔతుంది!
యతి అనే వాడి కోసం వేట వాళ్ల తక్షణ కర్తవ్యం [Task]! యతి సౌత్ లో మురుగా అనే వ్యక్తి దగ్గరకు వెళ్తాడన్న ఒక్క లైన్ మినహా, ఆ ఇద్దరు అన్నదమ్ములకు, ఆ తరవాత నడిచే కథకున్న లింకేంటన్నది దుర్భిణీ వేసి వెతికినా, ఎక్కడా దొరకదు! దయా ఆచూకీ తెలియదంటూ ఆ సమావేశంలో పెద్దలు చివరికి యతిని వెతికే బాధ్యతను మాత్రం ఓ అధికారికి అప్పగిస్తారు!
ఇంకేం, ఆ యతనేటోడి కోసం సెర్చ్ స్టార్ట్! బస్, అంతే! ఇక అక్కడి నుంచి కథ ఎటెటో వెళ్లిపోయి, మళ్లా వెనక్కి రాదు! లాంగ్వేజ్ తో సహా టోటల్ స్టోరీ థీమ్ రాయలసీమ నేటివిటీకి షిఫ్ట్ ఔతుంది! ఐనా ఫర్వాలేదు! అభ్యంతరం కూడా అవసరం లేదు! కానీ, తోక వైపు సాగే ఈ ప్రయాణంలో దర్శకుడికి తెలియకుండానే తల మాయం ఐపోతుంది!
కంచికి చేరాల్సిన కథ దేవర 2 అనే ఎండ్ కార్డుతో కంత్రిగా కంప్లీట్ ఔతుంది! కథ మధ్యలోనే ఏంటిది! ఎటు పోతుంది మూవీ అనిపిస్తుంది! మరి కాసేపటికి చిర్రెత్తుతుంది! ఇంకాసేపటికి అసహనం మొదలై బోర్ కొడుతుంది! ఐనా, చేసేదేం లేదు! డబ్బులు పెట్టి టిక్కెట్టు కొన్నవాళ్లు, రీల్ టు రీల్ విధిగా దర్శకుడు తీసుకెళ్లే ఫ్లోలో కొట్టుకు పోవాల్సిందే! థియేటర్లలో వేరే ఆప్షన్ కూడా ఉండదు!
కానీ, ఓటీటీలో ఆ అక్కర లేదు! వెంటనే సినిమా నుంచి ఎగ్జిటవొచ్చు! కానీ, నేనలా చేయలేదు! కొంచం కష్టమైనా సరే, ఓపిగ్గా పిక్చర్ మొత్తం చూసి ఇదిగో ఈ రివ్యూ రాయాలని డిసైడయ్యాను! హలో, ఓటీటీలో పైసా ఖర్చు లేకుండా సినిమా చూసి రివ్యూ రాయడం ఏంటని మాత్రం అనకండి దయచేసి! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సమీక్ష కాదు! కేవలం నా ఒపీనియన్!
భవిష్యత్తులో ఇలాంటి చెత్త సినిమాలు రాకూడదనే ఆరాటం మాత్రమే! నెక్స్ట్, నెట్ ఫ్లిక్స్ వాడు మా అయ్య సుట్టమేం కాదు! అది నాకు ఫ్రీగా ఏం రావడం లేదు! ఎప్పటికప్పుడు దండిగా పైసలు పెట్టే యాప్ కొంటున్నాను! అలాగే, నిర్మాతలకు సైతం భారీగా రొక్కం చెల్లించే, నెట్ ఫ్లిక్సోడు మూవీల హక్కులు తీసుకుంటుంటాడు! సో, ఫ్రీ అనే తొక్కలో ఫిలాసఫీకి ఛాన్స్ లేదిక్కడ!
సరే, అది వదిలేసి, దేవరలోని మరికొన్ని సీన్లను విశ్లేషిద్దాం! ఇక్కడ కనిపించే సంఘటనలు నిజ జీవితంలో బహుశా ఎక్కడా జరగవు! ఇవి కేవలం కల్పిత కథలు మాత్రమే! ఇంకా చెప్పాలంటే ఫక్తు హీరో చుట్టూ గజిబిజిగా అల్లుతూ రాసే ఝూటా కహానీలు! కొత్తకొత్త స్టోరీలను వెండితెరకు ఎక్కించడంలో ఎవరికీ ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు! కానీ, భీభత్స, భీతావః, భయానక వాతావరణంలో అత్యంత హింసాత్మకంగా కత్తులతో నరక్కోవడాలు, రక్తం ఏరులైపారడాలు., ఇవి వాటిలో కనిపించే జుగుప్సాకరమైన సీన్లు!
వీటన్నిటి ద్వారా సినీ పరిశ్రమ సభ్య సమాజానికి ఏం మెసేజిస్తున్నట్లు? సగటు ప్రేక్షకుడిలో ఏ అభిప్రాయాన్ని నాటుతున్నట్లు? కాస్త కఠినంగా చెప్పాలంటే, ఈ ఫాల్స్, కాక్ అండ్ బుల్ స్టోరీస్ టోటల్ గా ట్రాక్ తప్పి, ప్రేక్షకులను సైతం తప్పుదారి పట్టిస్తున్నాయి!
లేకపోతే, ఆయుధాల కోసం 4 గ్రామ ప్రజలు కొట్టుకునే పోటీలు పెట్టడం ఏంటి? అందులో గెలిచిన గ్రామం ఆయుధాలను వాళ్ల ఊరికి తరలించడం ఏంటి? అలా చేస్తే శుభం కలగడం ఏంటి? అంతా నాన్ సెన్స్! ఇది ముమ్మాటికీ సినిమా లాంటి ఒక మాస్ మీడియాను ఆసరా చేసుకొని జనంలో మూఢనమ్మకాలు ప్రబలేలా చేసే ప్రయత్నమే!
సరిగ్గా, ఇలాంటి చిత్రాల వల్లనే సమాజంలో సదాచారాలు గంగలో కలుస్తున్నాయి! సంస్కృతి మంటగలసి పోతుంది! సత్సాంప్రదాయం, సనాతన నడవడులు విలువను కోల్పోయి, వాటి ఉనికిని సైతం ప్రమాదంలో పడుతోంది!
ఇంతకీ సినిమాలపై నియంత్రణ ఉన్నట్లా లేనట్లా! ఉంటే, ఇలాంటి చిత్రాలకు సెన్సార్ బోర్డు ఎందుకు క్లియరెన్స్ ఇస్తోంది? వాళ్ల కళ్లు మూసుకుపోయాయా? కేవలం అశ్లీలంగా ఉన్న క్లిప్పులు కత్తిరిస్తే బోర్డు పని ఐపోయినట్లేనా? ఈ మధ్య వాటిని కూడా తోసేస్తున్నారనుకోండి, అది వేరే విషయం!
కానీ, ఇలాంటి అడ్డగోలు మూఢ నమ్మకాలు జనంలోకి వెళ్లకుండా కట్టడి చేసే చిత్తశుద్ధి సెన్సార్ సభ్యులకు ఉండక్కరలేదా? ఒకవేళ డబ్బులకు అమ్ముడుపోయి వాళ్లు ఇలాంటి చిత్రాలకు U/A సర్టిఫికెట్లిచ్చి చేతులు దులుపుకుంటున్నారా?… సూరజ్ వి. భరద్వాజ్.
.
(తనలోని మంచి నటుడు చచ్చిపోయాడని అనలేం కానీ… సో కాల్డ్ స్టార్ హీరోల కాలిక్యులేటెడ్ పక్కా కమర్షియల్ చెత్తా సినిమాల బందిఖానాలో ఇరుక్కుని సతమతం అవుతున్న జూనియర్ ఎన్టీయార్‌కు ఈ పోస్టు అంకితం… సార్, మీకు దుల్కర్ సల్మాన్, శివకార్తికేయన్ తెలుసా సారూ…? అన్నట్టు చెప్పడం మరిచిపోయా…. ఫాఫం ఫాఫం ఫాఫం శ్రీదేవి బిడ్డ….)
(సినిమా నాణ్యతను నిగ్గుతేల్చేది పెయిడ్ రివ్యూలు, ట్విట్టర్ పోస్టులు కాదురా తండ్రీ… ఇదుగో ఇలా ఓటీటీలో రిలీజ్ తరువాత సోషల్ మీడియాలో వచ్చే అసలైన ప్రొడక్ట్ రివ్యూలు… అవే అసలైన రివ్యూలు… ఆ నాగవంశీ అనే ప్రపంచంలోకెల్లా మానవ మేధావి, తనకు వేయి రెట్ల మేధావి శ్రీకాంత్ అయ్యంగార్ అనే క్రిమిదొడ్డి నటుడికి కూడా అంకితం…)
Share this Article