బలగం మొదటిసారి టీవీల్లో రిలీజ్ చేసినప్పుడు 14.3 ఓవరాల్ రేటింగ్స్ వచ్చాయి… ఈరోజుల్లో అది చాలా ఎక్కువ… గత వారం మళ్లీ ప్రసారమైతే ఈసారి ఏకంగా 9.08 రేటింగ్స్ వచ్చాయి… సూపర్… సరే, మనం చెప్పుకోదగిన విషయం మరొకటి ఉంది… అది ధనుష్ నటించిన సర్ సినిమా గురించి… ఇది కూడా గత వారం టీవీల్లో ప్రసారం చేశారు… కానీ జెమిని టీవీలో… దానికేమో రీచ్ తక్కువ… ఎంత భారీ సినిమా అయినా సరే, జెమిని టీవీలో ప్రసారం అయ్యిందంటే చాలు, దానికి రేటింగ్స్ రావు, ఎవడూ చూడనట్టే లెక్క…
అంతేనా..? కాదు… ఈ సినిమాను థియేటర్లలో కూడా తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు… ఓటీటీ సంగతేమిటో తెలియదు, ఓటీటీ మేనేజర్లు ఏది చెబితే అదే నమ్మాలి తప్ప ప్రేక్షకుల వాస్తవ సంఖ్య అనగా డౌన్‌లోడ్స్, వ్యూ అవర్స్ సంఖ్య అస్సలు బయటపడే మార్గం లేదు… మరి టీవీలో..? జస్ట్, 4.61 రేటింగ్స్ వచ్చాయి హైదరాబాద్ బార్క్ కేటగిరీలో… అంటే చాలా తక్కువ… నాసిరకం సీరియల్స్ కూడా ఇంతకుమించి రేటింగ్స్ సాధిస్తున్నాయి…
Ads
మొన్న ఇలా చెప్పుకున్నాం కదా… మరి 0.76 రేటింగ్స్ వస్తే ఏమనాలి..? ఫ్లాప్ అనా..? సూపర్ ఫ్లాప్ అనా..? డిజాస్టర్ అనా..? మరో పేరు ఏదైనా ఉందా..? ఎస్, ప్రస్తుతం ఎవరూ టీవీల్లో సినిమాలను చూడటానికి పెద్దగా ఇంట్రస్టు చూపించడం లేదు… కానీ ముఖ్యమైన స్టార్స్ లేదా మౌత్ టాక్ బాగున్న సినిమాలకు అంతోఇంతో రేటింగ్స్ వస్తుంటాయి… ఐనాసరే నాగశౌర్య హీరోగా నటించిన ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి సినిమాకు వచ్చిన రేటింగ్స్ మరీ దారుణం…
అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం రిలీజై ఫ్లాపయిన సినిమాను మళ్లీ ఇప్పుడు వేసినా ఒకటోరెండో రేటింగ్స్ వస్తాయి… అలాంటిది నాగశౌర్య ప్రజెంట్ జనరేషన్ హీరో అయినా సరే టీవీ ప్రేక్షకులు దేకలేదు… లైట్ తీసుకున్నారు… నిజానికి ఈ సినిమా దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మరీ తీసిపారేసే దర్శకుడేమీ కాదు… నటుడు, రచయిత, దర్శకుడు… కాస్త కామెడీ సెన్స్ ఉన్నవాడు… అప్పట్లో ఊహలు గుసగుసలాడే, జోఅచ్యుతానంద కూడా బాగానే ఉన్నట్టనిపించాయి…
ఈ సినిమాలో నటన తెలిసిన హీరోయిన్ మాళవిక నాయర్ కూడా ఉంది… కానీ ఏం ఫాయిదా..? సినిమా థియేటర్లలో ఆడలేదు… టీవీలో ఆడలేదు… ఓటీటీల్లో ఏమిటో మనకు తెలియదు… సినిమా ఫ్లాప్‌కు కారణం కథనంలో ఒక ఆర్గానిక్ ఫ్లో లేకపోవడం. స్క్రీన్ ప్లే లో గందరగోళం. ముందుకి వెనక్కి, వెనక్కి ముందుకు వెళ్లడం వల్ల కథని ఏ ఎమోషన్ తో కనెక్ట్ చేసుకోవాలో అర్ధం కాదు. పై పెచ్చు సదరు హీరో కేరక్టరైజేషన్ కూడా తికమకగా ఉంటుంది.
Top 5 Channels – AP/Telangana, 2+
RANK | CHANNELS | WEEKLY AMA’000 {AVG.} |
---|---|---|
1 | STAR Maa | 2222.97 |
2 | Zee Telugu | 1535.13 |
3 | ETV Telugu | 732.22 |
4 | Star Maa Movies | 633.04 |
5 | Gemini Movies | 564.62 |
అన్నింటికీ మించి నీరసంగా సాగే ఈ సినిమాలో మధ్యమధ్యలో “చాప్టర్-1′, “చాప్టర్2” అంటూ చూపించినప్పుడల్లా ప్రేక్షకుల నిట్టూర్పులే థియేటర్లలో… ఇలాంటి మౌత్ టాక్ వచ్చిన సినిమాను టీవీల్లోనైనా చూడాలని ఎవరికైనా ఎందుకనిపిస్తుంది..? చివరకు నాగశౌర్య కూడా ఏదో నటించానులే అన్నట్టుగా కనిపించాడు…
నిజానికి ఎంతటి పెద్ద నటుడైనా సరే, ఎంత మంచి మౌత్ టాక్ వచ్చినా సరే… జెమిని టీవీలో ప్రీమియర్ ప్రసారం అంటే దానికి రేటింగ్స్ రావు అని లెక్కేసుకొండి… ఈ చానెల్ ప్రస్తుత దురవస్థ అది… మెయిన్ స్ట్రీమ్ వినోదచానెళ్లలో మరీ నాలుగో ప్లేసు కూడా దాటిపోయి, సారీ దిగిపోయి, మరింత లోపలకు వెళ్లిపోతోంది… చివరకు ఇప్పుడు అయిదో ప్లేసు దగ్గర ఆగినట్టుంది… అసలే టీవీల్లో సినిమాల్ని ఎవడూ చూడటం లేదురా బాబూ అంటే ఇక జెమిని టీవీలో రిలీజ్ చేస్తే ఎవడు చూడాలి… దాని రీచ్ అంత ఘోరంగా ఉంది మరి… జాతీయ స్థాయిలో సన్ టీవీ రెండో ప్లేసు… వాళ్ల జెమిని చానెల్ స్టేటస్ చూస్తే ఇదీ దుర్గతి…
Share this Article