సూపర్ స్టార్ కృష్ణ… ఎంత గొప్పగా బతికి పోయాడు… కానీ తన అంత్యక్రియలు, ఊరేగింపు దగ్గర నుంచి ప్రతి విషయంలో మరణానంతరం అభిమానుల్ని కలుక్కుమనిపించే సీన్లు… అవన్నీ మళ్లీ లంబా చోడా ఇక్కడ చెప్పుకోలేం కానీ… ఫాలో కానివాళ్లు ఉంటే కాస్త దిగువన ఇచ్చిన ‘ముచ్చట’ లింక్ చదవండి… అసలు విషయం మొత్తం అర్థం అయిపోతుంది… ఇక ఇప్పటి సంగతి చెప్పుకుందాం…
ఈమధ్యకాలంలో మనం ఇద్దరి కర్మకాండ, ఏర్పాట్లు, ఘనమైన వీడ్కోళ్లు చూశాం… ఒకటి కృష్ణం రాజు పెద్ద కర్మ… వేలాది మందికి నాన్ వెజ్ భోజనం పెట్టి, ఘనంగా కృష్ణంరాజుకు నివాళి అర్పించాడు ప్రభాస్… నిజం… చాలా కులాల్లో పెద్ద కర్మ ఎంత ఘనంగా జరిపితే, మరణించిన వ్యక్తిని అంత ఘనంగా పైలోకాలకు పంపించినట్టు..! తెలంగాణలోని పలు ప్రధాన కులాల్లో పెద్ద కర్మ రోజున మద్యం కూడా పోస్తారు…
ఐతే ఒక సెలబ్రిటీ పెద్ద కర్మకు మద్యం పోయడం చాలా కోణాల్లో అసాధ్యం, అవాంఛనీయం… కాకపోతే శాస్త్రోక్తంగా పెద్ద కర్మ తంతు నిర్వహించి, వచ్చిన ప్రతి ఒక్కరి కడుపును నింపడం అనేది వారసుల విద్యుక్త ధర్మం… తరువాత “నమ్మ అప్పు”… చిన్నతనంలోనే కన్నుమూసిన పునీత్ రాజకుమార్ పెద్ద కర్మను కూడా తన సోదరులు, భార్య ఘనంగా నిర్వహించారు… ఒక్క ఫ్యాన్ కూడా అసంతృప్తితో వాపస్ పోకుండా చూశారు…
Ads
వాళ్ల జీవితంలో ఇదీ ఒక ముఖ్యమైన విధిగా భావించారు వాళ్లు… అదీ మరణించిన వ్యక్తి పట్ల చూపాల్సిన ప్రేమ… పునీత్‌కు దక్కిన ఘననివాళి ఈమధ్య కాలంలో ఏ కన్నడ సెలబ్రిటీకి దక్కలేదు…
కృష్ణ ‘కర్మకాండ’ అయిపోలేదు… అందరి కన్నూ ఇప్పుడు పెద్దకర్మ జరిపే తీరుపై..!!
మరి కృష్ణ విషయంలో ఇప్పటిదాకా తప్పుటడుగులు పడ్డాయి సరే… మరి పెద్ద కర్మ అయినా సరే, ఓ మోస్తరుగా నిర్వహిస్తారా అనే సందేహం చాలామందిలో నెలకొంది… విషయం ఏమిటంటే… అందరూ ఆహ్వానితులు కారు… రేపు జేఆర్సీ కన్వెన్షన్ హాలులో నిర్వహించే పెద్ద కర్మకు ఆహ్వానితులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది… కృష్ణ ఫ్యాన్స్ కూడా దీన్ని గుర్తించి.., పాసులు, ఇన్విటేషన్లు ఉన్నవాళ్లు మాత్రం రావడం బెటర్…
5 వేల మందికి ఈ పాసులు రావచ్చు బహుశా… మహేశా, చివరకు దీన్ని కూడా ఓ సినిమా ఫంక్షన్‌లా నామ్‌కేవాస్తే కార్యక్రమంగా మారుస్తున్నావా..?! ఈ మాట అనుకోవడానికి కఠినంగా ఉన్నా, నిష్ఠురంగా ఉన్నా నిజం అయితే ఇదే… చేదే… కృష్ణ గారూ.., సారీ, మమ్మల్నందరినీ క్షమించేసి, పెద్ద మనస్సు చేసుకుని, ఆ దేవలోకాలకు ఇక వెళ్లిపో… నువ్వు మంచోడివి బాసూ… అందరినీ క్షమించేస్తూనే ఉంటావు… ఇదే మా వీడ్కోలు…!!
Share this Article